ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాంసీ లో రాణి లక్ష్మి బాయి కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయ కళాశాల, పరిపాలన భవనాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. విశ్వవిద్యాలయ విద్యార్థుల తో ఆయన ముచ్చటించారు.
విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతి ఒక్కరి ని ప్రధాన మంత్రి అభినందించారు. ఈ విశ్వవిద్యాలయం నుండి విద్య పూర్తి చేసిన అనంతరం, దేశ వ్యవసాయ రంగాని కి సాధికారిత ను కల్పించేందుకు విద్యార్థులు చురుకు గా పనిచేయాలని ప్రధాన మంత్రి సూచించారు. నూతన భవనాల ద్వారా లభించిన కొత్త సదుపాయాలు విద్యార్థులు మరింత కష్టపడి పనిచేసేందుకు ప్రోత్సాహాన్ని, ప్రేరణ ను ఇవ్వగలవని ఆయన అన్నారు.
“నేను నా ఝాంసీ ని ఇవ్వను” అని పలికిన రాణి లక్ష్మి బాయి మాటల ను ప్రధాన మంత్రి గుర్తు కు తెస్తూ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ను విజయవంతం చేయాలంటూ ఝాంసీ, బున్దేల్‌ఖండ్ ల ప్రజల కు విజ్ఞప్తి చేశారు.
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో వ్యవసాయ రంగం ఒక ప్రధానమైనటువంటి పాత్ర ను పోషించవలసివుంది అని ప్రధాన మంత్రి అన్నారు. రైతుల ను ఇటు ఉత్పత్తిదారులు గాను, అటు నవ పారిశ్రామికవేత్తలు గాను మార్చాలన్నదే వ్యవసాయ రంగం లో స్వావలంబన యొక్క లక్ష్యం అని ఆయన అన్నారు. ఈ స్ఫూర్తి కి అనుగుణం గా, వ్యవసాయ రంగం లో అనేక చరిత్రాత్మకమైన సంస్కరణల ను ప్రవేశపెట్టడమైందని ప్రధాన మంత్రి అన్నారు. ఇతర పరిశ్రమల మాదిరిగానే, రైతులు కూడా ప్రస్తుతం వారి పంటల ను దేశం లో వాటి కి మెరుగైన ధర లు పలికే చోట ఎక్కడ అయినా సరే విక్రయించవచ్చు. మెరుగైన సదుపాయాల ను సమకూర్చేందుకు మరియు పరిశ్రమల ను క్లస్టర్ ఆధారిత విధానం లో ప్రోత్సహించేందుకు లక్ష కోట్ల రూపాయల తో ఒక ప్రత్యేక నిధి ని ఏర్పాటు చేయడమైందని ఆయన అన్నారు.
వ్యవసాయ రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో జోడించేందుకు నిలకడగా ప్రయత్నాలు సాగుతున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ఈ దిశ గా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన శాల లు కీలక పాత్ర ను పోషిస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశం లో మూడు కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, ఆరు సంవత్సరాల క్రితం దేశం లో ఒకే ఒక కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండేదని ఆయన అన్నారు. దీనికి తోడు మరో మూడు జాతీయ సంస్థలు అంటే, ఎఐఆర్ ఐ ఝార్ ఖండ్ ను, ఐఎఆర్ ఐ అసమ్ ను, బిహార్ లోని మోతీహారీ లో మహాత్మ గాంధీ సమీకృత వ్యవసాయ సంస్థల ను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఈ సంస్థ లు విద్యార్ధుల కు నూతన అవకాశాల ను కల్పించడమే కాకుండా స్థానిక రైతుల కు సాంకేతిక పరిజ్ఞాన ప్రయోజనాల ను అందించేందుకు, వారి సామర్ధ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయన్నారు.
వ్యవసాయ రంగాని కి సంబంధించిన సవాళ్ల ను ఎదుర్కోవడం లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగం గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఇటీవల మిడతల దండు దాడి కి సంబంధించిన ఉదాహరణ ను ప్రస్తావించారు. మిడతల వ్యాప్తి ని నియంత్రించి నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక న పనిచేసినట్టు ఆయన తెలిపారు. ఇందుకు డజన్ ల కొద్దీ కంట్రోల్ రూమ్‌ల ను పలు నగరాల లో ఏర్పాటు చేయడం జరిగిందని, రైతుల ను ముందుగానే హెచ్చరించేందుకు తగిన ఏర్పాట్లు జరిగాయని చెప్పారు. డ్రోన్ ల ద్వారా మందులు చల్లడం, మిడతల దండు ను నాశనం చేసేందుకు డజన్ల కొద్దీ ఆధునిక స్ప్రేల ను సేకరించి రైతుల కు అందజేయడం జరిగాయన్నారు.
గడచిన ఆరు సంవత్సరాల లో ప్రభుత్వం పరిశోధనల కు, వ్యవసాయ దారుల కు మధ్య లంకె ను ఏర్పరచేందుకు కృషి చేసిందని, రైతుల కు క్షేత్ర స్థాయి లో గ్రామాల లో శాస్త్రీయ సలహాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని ప్రధాన మంత్రి అన్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణాల నుండి విజ్ఞానం, నైపుణ్య పరిజ్ఞానం పంట పొలాల కు చేరేలా తగిన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం లో విశ్వవిద్యాలయాల సహకారాన్ని ఆయన కోరారు.
పాఠశాల స్థాయి లో వ్యవసాయ సంబంధిత విజ్ఞానాన్ని, దాని వాస్తవ ఉపయోగాన్ని తెలియజెప్పాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. గ్రామాల లో మాధ్యమిక పాఠశాల స్థాయి లో వ్యవసాయాన్ని ఒక బోధనాంశం గా ప్రవేశపెట్టేందుకు కృషి జరుగుతున్నట్టు ఆయన తెలిపారు. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయన్నారు. అందులో ఒకటి, వ్యవసాయానికి సంబంధించిన అవగాహన విద్యార్థుల లో పెంపొందుతుందని, రెండోది విద్యార్థుల కుటుంబ సభ్యుల కు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మార్కెటింగ్, వ్యవసాయ రంగానికి సంబంధించిన తాజా సమాచారం అందించడానికి ఉపకరిస్తుందని అన్నారు. ఇది దేశంలో వ్యవసాయ సంబంధిత నవ పారిశ్రామికత్వాన్ని ప్రపోత్సహించగలదన్నారు.
కరోనావైరస్ మహమ్మారి కాలం లో ప్రజల సమస్యల ను తగ్గించేందుకు తీసుకొన్న చర్యల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, కోట్లాది మంది పేద ప్రజల కు, ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రామీణ కుటుంబాల కు ఉచిత రేశన్ ను అందించినట్టు తెలిపారు. ఈ కాలం లోనే బున్దేల్ ఖండ్ లో పది లక్షల మంది పేద మహిళల కు ఉచిత గ్యాస్ సిలిండర్‌ల ను అందించినట్టు ప్రధాన మంత్రి చెప్పారు. గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ లో భాగం గా ఇప్పటివరకు 700 కోట్ల రూపాయలకుపైగా ఉత్తర్ ప్రదేశ్ లో ఖర్చుచేసినట్టు ఆయన తెలిపారు. దీనిలో లక్షలాది కార్మికుల కు ఉపాధిని కల్పించడమైందని చెప్పారు.
గతం లో హామీ ఇచ్చినట్టుగా ప్రతి ఇంటి కి త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించే పనులు శరవేగం తో సాగుతున్నట్టు ప్రధాన మంత్రి వెల్లడించారు. ఈ ప్రాంతం లో 10,000 కోట్ల రూపాయల విలువగల సుమారు 500 నీటి సంబంధిత పరియోజన లు ఆమోదం పొందినట్టు ఆయన తెలిపారు. ఇది బున్దేల్ ఖండ్ లోని లక్షలాది మందికి ప్రత్యక్ష ప్రయోజనాన్ని కలిగిస్తుందని ఆయన అన్నారు. బున్దేల్ ఖండ్ లో భూగర్భ జల మట్టాన్ని పెంచేందుకు ఉద్దేశించిన అటల్ భూగర్బ జల పథకం పనులు పురోగతి లో ఉన్నాయని చెప్పారు. ఝాంసీ, మహోబా, బాందా, హమీర్ పుర్, చిత్రకూట్, ఇంకా లలిత్ పుర్ లతో పాటు పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ లోని వందలాది గ్రామాల లో నీటి స్థాయి ని పెంచేందుకు 700 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో చేపడుతున్న పరియోజన ల పనులు పురోగతి లో ఉన్నాయన్నారు.
బున్దేల్ ఖండ్ చుట్టూ బెత్వా, కెన్, యమునా నదులు ఉన్నప్పటికీ ఈ నదుల నుండి ఈ ప్రాంతం పూర్తిగా ప్రయోజనం పొందలేక పోతున్నదని ప్రధాన మంత్రి అన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం గట్టి కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. కెన్- బెత్వా నదీ అనుసంధాన ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజల దశ ను మార్చగల శక్తి కలిగినదని , ఈ దిశ గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల కు సహకరిస్తూ వారి తో కలసి పనిచేస్తున్నదని ప్రధాన మంత్రి అన్నారు. బున్దేల్ ఖండ్ కు తగినంత నీరు లభిస్తే ఈ ప్రాంత ప్రజల జీవనం పూర్తిగా మారిపోతుందన్నారు. వేలాది కోట్ల రూపాయల ఖర్చు తో చేపడుతున్న బున్దేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే, డిఫెన్స్ కారిడర్ లు వేల మందికి ఇక్కడ కొత్త గా ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. జయ్ జవాన్, జయ్ కిసాన్, జయ్ విజ్ఞాన్ నినాదం బున్దేల్ ఖండ్ నలుమూలలా వినిపించాలన్నారు. బున్దేల్ ఖండ్ ప్రాచీన గుర్తింపు ను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధి తో కట్టుబడి ఉన్నాయని ఆయన పునరుద్ఘాటించారు.
कभी रानी लक्ष्मीबाई ने बुंदेलखंड की धरती पर गर्जना की थी- मैं अपनी झांसी नहीं दूंगी।
— PMO India (@PMOIndia) August 29, 2020
आज एक नई गर्जना की आवश्यकता है- मेरी झांसी-मेरा बुंदेलखंड आत्मनिर्भर भारत अभियान को सफल बनाने के लिए पूरी ताकत लगा देगा, एक नया अध्याय लिखेगा।
इसमें बहुत बड़ी भूमिका कृषि की है: PM
जब हम कृषि में आत्मनिर्भरता की बात करते हैं तो ये सिर्फ खाद्यान्न तक ही सीमित नहीं है।
— PMO India (@PMOIndia) August 29, 2020
बल्कि ये गांव की पूरी अर्थव्यवस्था की आत्मनिर्भरता की बात है।
ये देश में खेती से पैदा होने वाले उत्पादों में वैल्यू एडिशन करके देश और दुनिया के बाज़ारों में पहुंचाने का मिशन है: PM
कृषि में आत्मनिर्भरता का लक्ष्य किसानों को एक उत्पादक के साथ ही उद्यमी बनाने का भी है।
— PMO India (@PMOIndia) August 29, 2020
जब किसान और खेती, उद्योग के रूप में आगे बढ़ेगी तो बड़े स्तर पर गांव में और गांव के पास ही रोज़गार और स्वरोज़गार के अवसर तैयार होने वाले हैं: PM
6 साल पहले जहां देश में सिर्फ 1 केंद्रीय कृषि विश्विद्यालय था, आज 3 सेंट्रल एग्रीकल्चर यूनिवर्सिटीज़ देश में काम कर रही हैं।
— PMO India (@PMOIndia) August 29, 2020
इसके अलावा तीन और राष्ट्रीय संस्थान IARI-झारखंड, IARI-असम, और मोतीहारी में Mahatma Gandhi Institute for Integrated Farming की स्थापना की जा रही है: PM
ड्रोन टेक्नॉलॉजी हो, आर्टिफिशियल इंटेलीजेंस की टेक्नॉलॉजी हो, आधुनिक कृषि उपकरण हों, इसको देश की कृषि में अधिक से अधिक उपयोग में लाने के लिए आप जैसे युवा Researchers को, युवा वैज्ञानिकों को निरंतर काम करना होगा: PM
— PMO India (@PMOIndia) August 29, 2020
इससे दो लाभ होंगे।
— PMO India (@PMOIndia) August 29, 2020
एक लाभ तो ये होगा कि गांव के बच्चों में खेती से जुड़ी जो एक स्वभाविक समझ होती है, उसका विस्तार होगा।
दूसरा लाभ ये होगा कि वो खेती और इससे जुड़ी तकनीक, व्यापार-कारोबार के बारे में अपने परिवार को ज्यादा जानकारी दे पाएगा: PM
कृषि से जुड़ी शिक्षा को, उसकी प्रेक्टिकल एप्लीकेशन को स्कूल स्तर पर ले जाना भी आवश्यक है।
— PMO India (@PMOIndia) August 29, 2020
प्रयास है कि गांव के स्तर पर मिडिल स्कूल लेवल पर ही कृषि के विषय को इंट्रोड्यूस किया जाए: PM
बुंदेलखंड की करीब-करीब 10 लाख गरीब बहनों को इस दौरान मुफ्त गैस सिलेंडर दिए गए हैं।
— PMO India (@PMOIndia) August 29, 2020
लाखों बहनों के जनधन खाते में हज़ारों करोड़ रुपए जमा किए गए हैं: PM
कोरोना के खिलाफ बुंदेलखंड के लोग भी डटे हुए हैं।
— PMO India (@PMOIndia) August 29, 2020
सरकार ने भी प्रयास किया है कि लोगों को कम से कम दिक्कत हो।
गरीब का चूल्हा जलता रहे, इसके लिए यूपी के करोड़ों गरीब और ग्रामीण परिवारों को मुफ्त राशन दिया जा रहा है: PM
गरीब कल्याण रोज़गार अभियान के तहत यूपी में 700 करोड़ रुपए से अधिक का खर्च अब तक किया जा चुका है, जिसके तहत लाखों कामगारों को रोज़गार उपलब्ध हो रहा है।
— PMO India (@PMOIndia) August 29, 2020
मुझे बताया गया है कि इस अभियान के तहत यहां बुंदेलखंड में भी सैकड़ों तालाबों को ठीक करने और नए तालाब बनाने का काम किया गया है:PM
जब ये तैयार हो जाएंगी तो इससे बुंदेलखंड के लाखों परिवारों को सीधा लाभ होगा।
— PMO India (@PMOIndia) August 29, 2020
इतना ही नहीं, बुंदेलखंड में, भूजल के स्तर को ऊपर उठाने के लिए अटल भूजल योजना पर भी काम चल रहा है: PM
बुंदेलखंड एक्सप्रेस वे हो या फिर डिफेंस कॉरीडोर, हज़ारों करोड़ रुपए के ये प्रोजेक्ट यहां रोजगार के हजारों अवसर बनाने का काम करेंगे।
— PMO India (@PMOIndia) August 29, 2020
वो दिन दूर नहीं जब वीरों की ये भूमि, झांसी और इसके आसपास का ये क्षेत्र देश को रक्षा क्षेत्र में आत्मनिर्भर बनाने के लिए एक बड़ा सेंटर बनेगा: PM
एक तरह से बुंलेदखंड में ‘जय जवान, जय किसान और जय विज्ञान’ का मंत्र चारों दिशाओं में गूंजेगा।
— PMO India (@PMOIndia) August 29, 2020
केंद्र सरकार और उत्तर प्रदेश की सरकार बुंदेलखंड की पुरातन पहचान को, इस धरती के गौरव को समृद्ध करने के लिए प्रतिबद्ध है: PM