Agricultural institutions will provide new opportunities to students, help connect farming with research and advanced technology, says PM
PM calls for ‘Meri Jhansi-Mera Bundelkhand’ to make Atmanirbhar Abhiyan a success
500 Water related Projects worth over Rs 10,000 crores approved for Bundelkhand region; work on Projects worth Rs 3000 crores already commenced

ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లోని ఝాంసీ లో రాణి ల‌క్ష్మి బాయి కేంద్రీయ ‌వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌య క‌ళాశాల‌, పరిపాల‌న భ‌వ‌నాల‌ ను ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. విశ్వ‌విద్యాల‌య విద్యార్థుల‌ తో ఆయన ముచ్చ‌టించారు.

విశ్వ‌విద్యాల‌యానికి చెందిన ప్ర‌తి ఒక్క‌రి ని ప్ర‌ధాన‌ మంత్రి అభినందించారు. ఈ విశ్వ‌విద్యాల‌యం నుండి విద్య పూర్తి చేసిన అనంత‌రం, దేశ వ్య‌వ‌సాయ‌ రంగాని కి సాధికారిత ను క‌ల్పించేందుకు విద్యార్థులు చురుకు గా ప‌నిచేయాలని ప్రధాన‌ మంత్రి సూచించారు. నూతన భ‌వ‌నాల ద్వారా ల‌భించిన కొత్త స‌దుపాయాలు విద్యార్థులు మ‌రింత క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేందుకు ప్రోత్సాహాన్ని, ప్రేర‌ణ‌ ను ఇవ్వ‌గ‌ల‌వ‌ని ఆయ‌న అన్నారు.

“నేను నా ఝాంసీ ని ఇవ్వను” అని పలికిన రాణి ల‌క్ష్మి బాయి మాట‌ల‌ ను ప్ర‌ధాన‌ మంత్రి గుర్తు కు తెస్తూ ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ అభియాన్‌ ను విజ‌య‌వంతం చేయాలంటూ ఝాంసీ, బున్దేల్‌ఖండ్ ల ప్ర‌జ‌ల కు విజ్ఞప్తి చేశారు.

ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ అభియాన్ లో వ్య‌వ‌సాయ‌ రంగం ఒక ప్రధానమైనటువంటి పాత్ర ను పోషించవలసివుంది అని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు. రైతుల ను ఇటు ఉత్పత్తిదారులు గాను, అటు నవ పారిశ్రామికవేత్తలు గాను మార్చాల‌న్నదే వ్య‌వ‌సాయ‌ రంగం లో స్వావ‌లంబ‌న యొక్క లక్ష్యం అని ఆయన అన్నారు. ఈ స్ఫూర్తి కి అనుగుణం గా, వ్యవ‌సాయ రంగం లో అనేక చరిత్రాత్మకమైన సంస్క‌ర‌ణ‌ల ను ప్రవేశపెట్టడమైందని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల మాదిరిగానే, రైతులు కూడా ప్ర‌స్తుతం వారి పంటల ను దేశం లో వాటి కి మెరుగైన ధర లు పలికే చోట ఎక్కడ అయినా సరే విక్రయించవచ్చు. మెరుగైన స‌దుపాయాల ను సమకూర్చేందుకు మరియు పరిశ్రమల ను క్ల‌స్ట‌ర్ ఆధారిత విధానం లో ప్రోత్సహించేందుకు ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌ తో ఒక ప్ర‌త్యేక నిధి ని ఏర్పాటు చేయడమైందని ఆయ‌న అన్నారు.

వ్య‌వ‌సాయ‌ రంగాన్ని ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం తో జోడించేందుకు నిలకడగా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు. ఈ దిశ‌ గా వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యాలు, ప‌రిశోధ‌న శాల‌ లు కీల‌క పాత్ర ను పోషిస్తాయ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌స్తుతం దేశం లో మూడు కేంద్రీయ వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యాలు ఉన్నాయ‌ని, ఆరు సంవ‌త్స‌రాల క్రితం దేశం లో ఒకే ఒక కేంద్రీయ వ్య‌వ‌సాయ విశ్వవిద్యాల‌యం ఉండేద‌ని ఆయ‌న అన్నారు. దీనికి తోడు మ‌రో మూడు జాతీయ సంస్థ‌లు అంటే, ఎఐఆర్ ఐ ఝార్ ఖండ్‌ ను, ఐఎఆర్ ఐ అసమ్ ను, బిహార్‌ లోని మోతీహారీ లో మ‌‌హాత్మ గాంధీ స‌మీకృత వ్య‌వ‌సాయ సంస్థ‌ల ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ఈ సంస్థ‌ లు విద్యార్ధుల‌ కు నూత‌న అవ‌కాశాల‌ ను క‌ల్పించ‌డ‌మే కాకుండా స్థానిక రైతుల‌ కు సాంకేతిక ప‌రిజ్ఞాన ప్ర‌యోజ‌నాల‌ ను అందించేందుకు, వారి సామ‌ర్ధ్యాన్ని పెంచేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌న్నారు.

వ్య‌వ‌సాయ రంగాని కి సంబంధించిన స‌వాళ్ల‌ ను ఎదుర్కోవ‌డం లో ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం ఉప‌యోగం గురించి ప్ర‌ధాన‌ మంత్రి మాట్లాడుతూ, ఇటీవ‌ల మిడ‌త‌ల దండు దాడి కి సంబంధించిన ఉదాహ‌ర‌ణ‌ ను ప్ర‌స్తావించారు. మిడ‌త‌ల వ్యాప్తి ని నియంత్రించి న‌ష్టాన్ని త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిప‌దిక‌ న ప‌నిచేసిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఇందుకు డ‌జ‌న్ ల కొద్దీ కంట్రోల్ రూమ్‌ల‌ ను ప‌లు న‌గ‌రాల‌ లో ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని, రైతుల‌ ను ముందుగానే హెచ్చ‌రించేందుకు త‌గిన ఏర్పాట్లు జ‌రిగాయ‌ని చెప్పారు. డ్రోన్ ల ద్వారా మందులు చ‌ల్ల‌డం, మిడ‌త‌ల దండు ను నాశ‌నం చేసేందుకు డ‌జ‌న్ల కొద్దీ ఆధునిక స్ప్రేల ను సేక‌రించి రైతుల‌ కు అందజేయ‌డం జరిగాయన్నారు.

గ‌డ‌చిన ఆరు సంవత్స‌రాల‌ లో ప్ర‌భుత్వం ప‌రిశోధ‌న‌ల‌ కు, వ్య‌వ‌సాయ దారుల‌ కు మ‌ధ్య లంకె ను ఏర్ప‌ర‌చేందుకు కృషి చేసింద‌ని, రైతుల‌ కు క్షేత్ర స్థాయి లో గ్రామాల‌ లో శాస్త్రీయ స‌ల‌హాలు ఇచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌ని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు. విశ్వ‌విద్యాల‌య ప్రాంగణాల‌ నుండి విజ్ఞానం, నైపుణ్య ప‌రిజ్ఞానం పంట పొలాల‌ కు చేరేలా త‌గిన వాతావ‌ర‌ణాన్ని ఏర్పాటు చేయ‌డం లో విశ్వ‌విద్యాల‌యాల స‌హ‌కారాన్ని ఆయ‌న కోరారు.

పాఠ‌శాల స్థాయి లో వ్య‌వ‌సాయ సంబంధిత విజ్ఞానాన్ని, దాని వాస్త‌వ ఉప‌యోగాన్ని తెలియ‌జెప్పాల్సిన అవ‌స‌రాన్ని ప్ర‌ధాన‌ మంత్రి నొక్కిచెప్పారు. గ్రామాల‌ లో మాధ్య‌మిక పాఠ‌శాల స్థాయి లో వ్య‌వ‌సాయాన్ని ఒక బోధ‌నాంశం గా ప్ర‌వేశ‌పెట్టేందుకు కృషి జ‌రుగుతున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. దీనివ‌ల్ల రెండు ర‌కాల ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌న్నారు. అందులో ఒక‌టి, వ్య‌వ‌సాయానికి సంబంధించిన అవ‌గాహ‌న విద్యార్థుల‌ లో పెంపొందుతుంద‌ని, రెండోది విద్యార్థుల కుటుంబ సభ్యుల‌ కు ఆధునిక వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తులు, మార్కెటింగ్‌, వ్య‌వ‌సాయ‌ రంగానికి సంబంధించిన తాజా స‌మాచారం అందించ‌డానికి ఉప‌క‌రిస్తుంద‌ని అన్నారు. ఇది దేశంలో వ్యవసాయ సంబంధిత నవ పారిశ్రామికత్వాన్ని ప్రపోత్సహించగ‌ల‌ద‌న్నారు.

క‌రోనావైర‌స్ మ‌హ‌మ్మారి కాలం లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ ను త‌గ్గించేందుకు తీసుకొన్న చ‌ర్య‌ల ను గురించి ప్రధాన‌ మంత్రి ప్ర‌స్తావిస్తూ, కోట్లాది మంది పేద ప్ర‌జ‌ల‌ కు, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లోని గ్రామీణ కుటుంబాల‌ కు ఉచిత రేశన్ ను అందించిన‌ట్టు తెలిపారు. ఈ కాలం లోనే బున్దేల్ ఖండ్ లో ప‌ది ల‌క్ష‌ల మంది పేద మ‌హిళ‌ల‌ కు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్‌ల‌ ను అందించిన‌ట్టు ప్ర‌ధాన మంత్రి చెప్పారు. గ‌రీబ్ క‌ల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ లో భాగం గా ఇప్ప‌టివ‌ర‌కు 700 కోట్ల రూపాయ‌ల‌కుపైగా ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లో ఖ‌ర్చుచేసిన‌ట్టు ఆయన తెలిపారు. దీనిలో ల‌క్ష‌లాది కార్మికుల‌ కు ఉపాధిని క‌ల్పించడమైందని చెప్పారు.

గ‌తం లో హామీ ఇచ్చిన‌ట్టుగా ప్ర‌తి ఇంటి కి త్రాగునీటి సౌకర్యాన్ని క‌ల్పించే ప‌నులు శ‌ర‌వేగం తో సాగుతున్న‌ట్టు ప్ర‌ధాన‌ మంత్రి వెల్ల‌డించారు. ఈ ప్రాంతం లో 10,000 కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల సుమారు 500 నీటి సంబంధిత పరియోజన లు ఆమోదం పొందిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఇది బున్దేల్ ఖండ్ లోని ల‌క్ష‌లాది మందికి ప్రత్యక్ష ప్ర‌యోజ‌నాన్ని క‌లిగిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. బున్దేల్ ఖండ్‌ లో భూగ‌ర్భ జ‌ల మ‌ట్టాన్ని పెంచేందుకు ఉద్దేశించిన‌ అట‌ల్ భూగ‌ర్బ జ‌ల ప‌థ‌కం ప‌నులు పురోగ‌తి లో ఉన్నాయ‌ని చెప్పారు. ఝాంసీ, మ‌హోబా, బాందా, హ‌మీర్‌ పుర్‌, చిత్ర‌కూట్‌, ఇంకా లలిత్‌ పుర్ లతో పాటు ప‌శ్చిమ ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లోని వంద‌లాది గ్రామాల‌ లో నీటి స్థాయి ని పెంచేందుకు 700 కోట్ల రూపాయ‌ల కు పైగా ఖ‌ర్చు తో చేప‌డుతున్న పరియోజన ల‌ ప‌నులు పురోగ‌తి లో ఉన్నాయ‌న్నారు.

బున్దేల్ ఖండ్ చుట్టూ బెత్వా, కెన్‌, య‌మునా న‌దులు ఉన్న‌ప్ప‌టికీ ఈ న‌దుల‌ నుండి ఈ ప్రాంతం పూర్తిగా ప్ర‌యోజ‌నం పొంద‌లేక పోతున్న‌ద‌ని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు. ఈ ప‌రిస్థితిని మార్చేందుకు ప్ర‌భుత్వం గ‌ట్టి కృషి చేస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. కెన్‌- బెత్వా న‌దీ అనుసంధాన‌ ప్రాజెక్టు ఈ ప్రాంత ప్ర‌జ‌ల ద‌శ‌ ను మార్చ‌గ‌ల శ‌క్తి క‌లిగిన‌ద‌ని , ఈ దిశ‌ గా కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ కు స‌హ‌క‌రిస్తూ వారి తో క‌లసి ప‌నిచేస్తున్న‌ద‌ని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు. బున్దేల్ ఖండ్‌ కు త‌గినంత నీరు ల‌భిస్తే ఈ ప్రాంత ప్ర‌జ‌ల జీవ‌నం పూర్తిగా మారిపోతుంద‌న్నారు. వేలాది కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు తో చేప‌డుతున్న బున్దేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే, డిఫెన్స్ కారిడర్‌ లు వేల మందికి ఇక్క‌డ కొత్త‌ గా ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తాయ‌ని అన్నారు. జయ్ జ‌వాన్‌, జయ్ కిసాన్‌, జయ్ విజ్ఞాన్ నినాదం బున్దేల్ ఖండ్ న‌లుమూల‌లా వినిపించాల‌న్నారు. బున్దేల్ ఖండ్ ప్రాచీన గుర్తింపు ను మ‌రింత పెంచేందుకు కేంద్ర ప్ర‌భుత్వం, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధి తో క‌ట్టుబ‌డి ఉన్నాయ‌ని ఆయ‌న పున‌రుద్ఘాటించారు.

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"