వంద వాట్ సామర్థ్యం కలిగిన 91 క్రొత్త ఎఫ్ఎమ్ ట్రాన్స్ మిటర్ లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు. ఈ ప్రారంభం దేశం లో రేడియో కనెక్టివిటీ ని మరింత పెంచుతుంది
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, కార్యక్రమం లో అనేక మంది పద్మ పురస్కార గ్రహీత లు పాలుపంచుకోవడాన్ని గమనించి మరి వారి కి స్వాగత వచనాల ను పలికారు. ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి) కాస్తా ఆల్ ఇండియా ఎఫ్ఎమ్ గా మారే దిశ లో ఆకాశవాణి ద్వారా ఎఫ్ఎమ్ సేవ ల విస్తరణ లో ఒక ముఖ్యమైనటువంటి ముందడుగు ఈ రోజు న పడిందని ప్రధాన మంత్రి అన్నారు. ఆల్ ఇండియా రేడియో ద్వారా 91 ఎఫ్ఎమ్ ట్రాన్స్ మిటర్ లు ప్రారంభం కావడం 85 జిల్లాల కు మరియు దేశం లో రెండు కోట్ల మంది ప్రజల కు లభించినటువంటి ఒక కానుక అని ఆయన అన్నారు. ఒక రకం గా ఇది భారతదేశం లో ఉన్నటువంటి వైవిధ్యం మరియు వర్ణాల తాలూకు ఒక దృశ్యాన్ని పట్టి చూపుతోంది అనవచ్చు అని ప్రధాన మంత్రి అన్నారు. కొత్తగా 91 ఎఫ్ఎమ్ ట్రాన్స్ మిటర్ ల సేవల ను అందుకొనే జిల్లా లు మహత్త్వాకాంక్షయుక్త జిల్లాలు మరియు మహత్త్వాకాంక్షయుక్త బ్లాకులు అని ఆయన వెల్లడిస్తూ, ఈ మహత్తరమైన కార్యసాధన కు గాను ఆకాశవాణి కి అభినందనల ను తెలియ జేశారు. దీని ద్వారా చాలా ప్రయోజనాన్ని అందుకోనున్నటువంటి ఈశాన్య ప్రాంత పౌరుల కు కూడా ఆయన అభినందనల ను వ్యక్తం చేశారు.
తన తరం వారి కి రేడియో తో ఉన్న భావోద్వేగ పరమైనటువంటి బంధాన్ని గురించి ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. త్వరలో జరుగనున్న ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట’ కార్యక్రమం) యొక్క వందో భాగాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘నా వరకు అయితే, రేడియో తో నాకు ఒక ఆతిథేయి గా కూడా ను సంబంధం ఉండడం మరింత సంతోషాన్ని ఇస్తోంది’’ అన్నారు. ‘‘దేశ ప్రజల తో ఈ విధమైనటువంటి భావోద్వేగ భరిత బంధం కేవలం రేడియో ద్వారానే సాధ్యమైంది. దీని ద్వారా, నేను దేశం యొక్క శక్తి తో, దేశ ప్రజల లోని కర్తవ్యం తాలూకు సామూహిక శక్తి తో ముడిపడి ఉంటున్నాను.’’ అని ఆయన అన్నారు. ఇదే అంశాన్ని ఆయన మరింత విపులం గా వివరిస్తూ, స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ పఢావో, ఇంకా హర్ ఘర్ తిరంగా ల వంటి కార్యక్రమాల ఉదాహరణల ను ఇచ్చారు. ఈ కార్యక్రమాలు ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) ద్వారా ప్రజా ఉద్యమాలు గా మారాయి అని ఆయన అన్నారు. ‘‘ఈ కారణం గా, ఒక రకం గా చెప్పాలంటే మీ ఆకాశవాణి బృందం లో ఓ భాగం గా నేను మారిపోయాను.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
91 ఎఫ్ఎమ్ ట్రాన్స్ మిటర్ ల ప్రారంభం అనేది ఇంతవరకు ఆ సదుపాయాని కి నోచుకోనటువంటి నిరాదరణ కు గురైన వర్గాల వారి కి ప్రభుత్వం ప్రాధాన్యాన్ని ఇస్తూ అమలు పరుస్తున్న విధానాల ను మరింత ముందుకు తీసుకు పోతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఎవరైతే ఇంతకాలం సమాజాని కి దూరం గా ఉండిపోయారన్న భావన లో ఉన్నారో వారు ఇక మరింత విశాలమైన స్థాయి లో సంధానం అయ్యేందుకు ఒక అవకాశాన్ని దక్కించుకొంటారు.’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఎఫ్ఎమ్ ట్రాన్స్ మిటర్ ల తాలూకు లాభాల ను గురించి ప్రధాన మంత్రి ఒకటొకటి గా చెప్తూ, ముఖ్యమైన సమాచారాన్ని సకాలం లో ప్రసారం చేయడం, సాముదాయిక నిర్మాణ సంబంధి ప్రయాస లు, వ్యావసాయిక అభ్యాసాల కు సంబంధించినటువంటి వాతావరణం తాలూకు తాజా కబురు లు, రైతుల కు ఆహారం మరియు కాయగూరల ధర ల సంబంధి సమాచారం, వ్యవసాయం లో రసాయనిక పదార్థాల వినియోగం ద్వారా వాటిల్లే నష్టాల గురించిన చర్చ లు, వ్యవసాయానికై ఆధునిక యంత్ర సామగ్రి ని అంతా కలసి ఒక చోటు కు చేర్చుకొని వంతుల వారీ గా వినియోగించుకొంటూ తద్ద్వారా లాభపడడం, బజారు కు సంబంధించిన నూతన అభ్యాసాల ను గురించి మహిళా స్వయం సహాయ సమూహాల కు తెలియ జేయడం, ఏదైనా ప్రాకృతిక విపత్తు సంభవించిన కాలాల్లో యావత్తు సముదాయాని కి సహాయాన్ని అందించడం వంటి అంశాల ను ప్రస్తావించారు. ఎఫ్ఎమ్ కు ఉన్న సమాచారం, విజ్ఞానం సంబంధి విలువ ను గురించి కూడా ఆయన వివరించారు.
సాంకేతిక విజ్ఞానాన్ని ప్రజాస్వామీకరించడం కోసం ప్రభుత్వం అదే పని గా పాటుపడుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘భారతదేశం తన పూర్తి సామర్థ్యం మేరకు వృద్ధి చెందాలి అంటే గనక దేశం లో ఏ పౌరుడు| ఏ పౌరురాలు తనకు అవకాశాలు కొరవడ్డాయని తలచనే తలచ కూడదు.’’ అని ప్రధాన మంత్రి అన్నారు. దీనికి గాను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరి అందుబాటు లోకి తీసుకు రావడం, అదీ తక్కువ ఖర్చు లో లభ్యం అయ్యేటట్లు చూడడం ముఖ్యఃమని ఆయన అన్నారు. అన్ని పల్లెల కు ఆప్టికల్ ఫైబర్ మరియు అత్యంత చౌక గా డేటా లభిస్తూ ఉండడం సమాచార లభ్యత ను సరళతరం చేసివేసినట్లు ప్రధాన మంత్రి వివరించారు. ఇది గ్రామాల లో డిజిటల్ ఆంట్రప్రన్యోర్ శిప్ కు ఒక సరిక్రొత్త గతి ని జోడించిందని ఆయన అన్నారు. అదే విధం గా, యుపిఐ అనేది బ్యాంకింగ్ సేవల ను చిన్న వ్యాపార సంస్థల కు మరియు వీధుల లో తిరుగుతూ సరకుల ను విక్రయించే వ్యాపారుల కు అందుబాటు లోకి తీసుకు రావడం లో సహాయకారి గా నిలచిందని ఆయన వివరించారు.
గడచిన కొన్ని సంవత్సరాలు గా దేశం లో చోటు చేసుకొంటున్న సాంకేతిక విజ్ఞాన సంబంధి క్రాంతి అనేది రేడియో ను ప్రత్యేకించి ఎఫ్ఎమ్ ప్రసారాల కు ఒక కొత్త స్వరూపాన్ని ఇచ్చిందని ప్రధాన మంత్రి నొక్కిపలికారు. ఇంటర్ నెట్ వృద్ధి ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, రేడియో మాధ్యం అనేది పాడ్ కాస్ట్ స్, ఇంకా ఆన్ లైన్ ఎఫ్ఎమ్ వంటి సరిక్రొత్త మార్గాల లో ముందుకు వచ్చిందని తెలియ జేశారు. ‘‘డిజిటల్ ఇండియా అనేది రేడియో కు క్రొత్త శ్రోతల ను ఇవ్వడం ఒక్కటే కాకుండా, ఒక వినూత్నమైన ఆలోచన ప్రక్రియ ను కూడా అందించింది.’’ అని ప్రధాన మంత్రి అన్నారు. అదే విధమైనటువంటి విప్లవాన్ని ప్రతి ఒక్క ప్రసార మాధ్యం లో చూడవచ్చును అని ఆయన అన్నారు. దేశం లో అతి పెద్దది అయినటువంటి డిటిహెచ్ ప్లాట్ ఫార్మ్.. అదే డిడి ఫ్రీ డిష్ యొక్క సేవల ను నాలుగు కోట్ల ముప్ఫయ్ లక్షల ఇళ్ళ కు అందజేయడం జరిగిందన్నారు. దీని లో భాగం గా, ప్రపంచాని కి చెందిన సమాచారాన్ని కోట్ల కొద్దీ గ్రామీణ కుటుంబాల ఇళ్ళ ముంగిట కు, మరి అలాగే సరిహద్దు ను ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల కు వాస్తవ కాల ప్రాతిపదిక న చేరవేయడం జరుగుతోందని ఆయన వెల్లడించారు. దశాబ్దాల తరబడి నిరాదరణ కు లోనవుతూ వచ్చిన సమాజం లోని కొన్ని వర్గాల వారి కి విద్య మరియు వినోదం అందుబాటు లోకి వస్తున్నాయని కూడా ఆయన వివరించారు. ‘‘ఇది సమాజం లో భిన్న వర్గాల మధ్య అసమానత ను తొలగించడం లో మరియు ప్రతి ఒక్కరి కి నాణ్యమైనటువంటి సమాచారాన్ని ఇవ్వడం లో దోహదం చేసింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. డిటిహెచ్ చానల్స్ లో వేరు వేరు విధాలైన విద్య పాఠ్య క్రమాలు లభ్యం అవుతున్నాయి.. తత్ఫలితం గా ఒక విశ్వవిద్యాలయం కంటే అధికం అయినటువంటి జ్ఞానం నేరు గా గృహాల కు చేరుతోందని ఆయన తెలిపారు. అది దేశం లో కోట్ల కొద్దీ విద్యార్థుల కు ఎంతో సహాయకారి గా మారింది, ప్రత్యేకించి కరోనా కాలం లో ఈ ప్రయోజనం సమకూరింది అని ప్రధాన మంత్రి తెలిపారు. ‘‘అది డిటిహెచ్ కావచ్చు లేదా ఎఫ్ఎమ్ రేడియో కావచ్చు, ఈ శక్తి ఏదైతే ఉందో, అది మనకు భావి భారతదేశం లోకి తొంగి చూసేందుకు ఒక కిటికీ ని అందుబాటు లోకి తీసుకు వస్తోంది. ఆ భవిష్యత్తు కోసం మనల ను మనం సిద్ధంపరచుకోవాలి’’ అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
భాషా పరమైన భిన్నత్వ పార్శ్వాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఎఫ్ఎమ్ ప్రసారం అన్ని భాషల లోను, ప్రత్యేకించి 27 మాండలికాల తో కూడిన ప్రాంతాల లో జరగుతుందని తెలియ జేశారు. ‘‘ఈ కనెక్టివిటీ కేవలం ప్రసార సాధనాల ను కలపడం కాకుండా, ప్రజల ను కూడా ను సన్నిహితం చేసి వేస్తుంది. ఇది ఈ ప్రభుత్వం యొక్క పని సంస్కృతి కి అద్దం పడుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సామాజిక సంధానం దానితో పాటే భౌతిక సంధానం.. ఈ రెండిటి ని ప్రోత్సహించడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రత్యేకం గా వివరించారు. ‘‘మా ప్రభుత్వం సాంస్కృతిక సంధానాన్ని మరియు మేధోపరమైన సంధానాన్ని సైతం పటిష్ట పరుస్తోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సంగతి ని సిసలైన వీరుల ను గౌరవించడం ద్వారా పద్మ పురస్కారాల ను మరియు ఇతర పురస్కారాల ను నిజంగా ప్రజల కు సంబంధించినటువంటి పురస్కారాలు గా మార్చివేసిన ఉదాహరణ తో ఆయన వివరించారు. ‘‘మునుపటి వలె కాక, ప్రస్తుతం సిఫారసుల పైన ఆధారపడడానికి బదులు పద్మ పురస్కారాల ను దేశ ప్రజల కు మరియు సమాజాని కి చేస్తున్న సేవల కు గాను ప్రదానం చేయడం జరుగుతోంది’’ అని ఆయన అన్నారు.
దేశం లోని వేరు వేరు ప్రాంతాల లో ధార్మిక స్థలాల పునరుద్ధరణ అనంతరం పర్యటక రంగం ఒక ఉత్తేజాన్ని అందుకొంది అనే విషయాన్ని ప్రధాన మంత్రి తెలియ జేస్తూ, పర్యటక ప్రదేశాల ను దర్శించే ప్రజల సంఖ్య పెరుగుతూ ఉండడం దేశం లో సాంస్కృతిక సంధానం వృద్ధి చెందుతోందనడానికి ఒక రుజువు గా ఉందని పేర్కొన్నారు. ఆదివాసి స్వాతంత్య్ర సమరయోధుల కు సంబంధించినటువంటి వస్తు సంగ్రహాలయం, పిఎమ్ సంగ్రహాలయం మరియు జాతీయ యుద్ధ స్మారకం, బాబాసాహెబ్ ఆమ్బేడ్ కర్ తో ముడిపడ్డ పంచ్ తీర్థ్ ల గురించి ఆయన ఉదాహరణలిచ్చారు. ఆ తరహా కార్యక్రమాలు దేశం లో మేధో సంబంధమైనటువంటి మరియు భావోద్వేగ పరమైనటువంటి సంధానాని కి ఒక కొత్త పరిమాణాన్ని జోడించాయి అని ఆయన అన్నారు.
ఆకాశవాణి వంటి కమ్యూనికేశన్ చానల్స్ అన్నింటి దృష్టి కోణాన్ని మరియు మిశన్ ను గురించి ప్రధాన మంత్రి ఉద్ఘాటిస్తూ, కనెక్టివిటీ అనేది అది ఏ రూపం లో ఉన్నప్పటికీ, దేశాన్ని మరియు దేశం లోని 140 కోట్ల మంది పౌరుల ను కలపడమే దాని ప్రయోజనం కావాలి అన్నారు. ఈ దృష్టికోణం తో సంబంధి వర్గాల వారంతా ముందుకు సాగిపోవడాన్ని కొనసాగిస్తారని, అదే జరిగి నిరంతర చర్చ మాధ్యం ద్వారా దేశం బలపడుతుంది అనేటటువంటి విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
పూర్వరంగం
దేశం లో ఎఫ్ఎమ్ కనెక్టివిటీ ని పెంచడాని కి ప్రభుత్వం కంకణం కట్టుకొంది. ఈ ప్రయాస లో భాగం గా, దేశం లో 18 రాష్ట్రాల మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధి లో గల 84 జిల్లాల లో ఒక్కొక్కటీ 100 వాట్ సామర్థ్యం కలిగిన 91 ఎఫ్ఎమ్ ట్రాన్స్ మిటర్ ల ను కొత్త గా స్థాపించడమైంది. మహత్వాకాంక్ష యుక్త జిల్లాల లో మరియు సరిహద్దు ప్రాంతాల లో సేవల ను పెంచడం పై ఈ విస్తరణ కార్యక్రమం లో ప్రధానం గా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఎఫ్ఎమ్ ప్రసారాల కవరేజీ ని బిహార్, ఝార్ ఖండ్, ఒడిశా, పశ్చిమ బంగాల్, అసమ్, మేఘాలయ, నాగాలాండ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, గుజరాత్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర ల లోను, కేంద్రపాలిత ప్రాంతాలు లద్దాఖ్, ఇంకా అండమాన్ మరియు నికోబార్ దీవుల లో ను విస్తరించడమైంది. ఆకాశవాణి ఎఫ్ఎమ్ సేవ ల పరం గా ఈ విస్తరణ తో ఇంతవరకు రేడియో మాధ్యం లభ్యం కాకుండా ఉన్నటువంటి రెండు కోట్ల మంది కి ఈ తరహా సేవ ఇకమీదట అందుబాటు లోకి వచ్చింది. ఇది దాదాపు గా 35,000 చదరపు కిలో మీటర్ ల కు పైగా ప్రాంతం లో ఈ విధమైనటువంటి సేవల ను విస్తరింప చేయనుంది.
సామాన్య ప్రజానీకం చెంతకు చేరుకోవడం లో రేడియో ప్రముఖ పాత్ర ను పోషిస్తుందని ప్రధాన మంత్రి గట్టి గా నమ్ముతున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది శ్రోత ల వద్ద కు చేరుకోవడాని కి ఈ మాధ్యం యొక్క విశిష్టమైన బలాన్ని వినియోగించుకోవడానికని ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాన్ని ఆరంభించారు. మనసు లో మాట కార్యక్రమం ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైనటువంటి వందో ఎపిసోడ్ కు చేరువ లో ఉంది.
जब बात रेडियो और FM की होती है, तो इससे मेरा रिश्ता एक भावुक श्रोता का भी है, और एक होस्ट का भी है: PM @narendramodi pic.twitter.com/NTrdW7S1Ty
— PMO India (@PMOIndia) April 28, 2023
हमारी सरकार, निरंतर, टेक्नोलॉजी के लोकतंत्रिकरण, Democratization के लिए काम कर रही है। pic.twitter.com/fDNnOH9ADc
— PMO India (@PMOIndia) April 28, 2023
डिजिटल इंडिया ने रेडियो को नए listeners भी दिये हैं, और नई सोच भी दी है। pic.twitter.com/JIH9cI2NNF
— PMO India (@PMOIndia) April 28, 2023