కోల్ కాతా లో చిత్తరంజన్ నేశనల్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ లో రెండో కేంపస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భం లో హాజరు అయిన వారిలో పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బనర్జీ గారు, ఇంకా కేంద్ర మంత్రులు డాక్టర్ మన్ సుఖ్ మాండవియా, డాక్టర్ సుభాష్ సర్ కార్, శ్రీ శాంతను ఠాకుర్, శ్రీ జాన్ బార్ లా మరియు శ్రీ నిసిథ్ ప్రామాణిక్ లు ఉన్నారు.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ కొత్త కేంపస్ పశ్చిమ బెంగాల్ ప్రజల కు, ప్రత్యేకించి పేద కుటుంబాల కు, మరియు మధ్య తరగతి కుటుంబాల కు తక్కువ ఖర్చు లో అత్యంత ఆధునిక సంరక్షణ ను అందించడం లో ఒక ప్రముఖ పాత్ర ను పోషించనుంది అన్నారు. ‘‘దేశం లో ప్రతి ఒక్క పౌరుని కి\ ప్రతి ఒక్క పౌరురాలి కి అత్యుత్తమ వైద్య సంరక్షణ ను అందుబాటు లోకి తీసుకు రావాలి అనే ప్రతిజ్ఞ ను నెరవేర్చే ప్రస్థానం లో మనం మరొక గట్టి చర్య ను తీసుకొన్నాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
పదిహేనేళ్ళ మొదలుకొని పద్దెనిమిది ఏళ్ళ వయోవర్గం బాలల కు టీకామందు ను ఇప్పించడం ద్వారా దేశం ఈ సంవత్సరాన్ని ప్రారంభించినట్లు ప్రధాన మంత్రి ప్రస్తావించారు. అదే కాలం లో, భారతదేశం ఈ సంవత్సరం ఒకటో నెల లోని మొదటి వారం లోనే 150 కోట్ల - 1.5 బిలియన్ వేక్సీన్ డోజు ల చరిత్రాత్మక మైలురాయి ని కూడా సమీపిస్తోంది అని ఆయన అన్నారు. ఒక సంవత్సరం కన్నా తక్కువ కాలం లో 150 కోట్ల డోజు లు అనేవి ఒక ప్రముఖ కార్యసాధన. అంతేకాక ఇది దేశం ఇచ్ఛాశక్తి కి ఒక సంకేతం కూడా అని ఆయన అన్నారు. ఇది దేశం యొక్క సరికొత్త విశ్వాసాన్ని, స్వయంసమృద్ధి ని, ఆత్మగౌరవాన్ని సూచిస్తున్నది అని ఆయన అన్నారు. ఓమిక్రాన్ రకం వల్ల కేసు లు పెరుగుతూ ఉన్నందున 150 కోట్ల వ్యాక్సీన్ డోజు ల తాలూకు రక్షాకవచం లభించడం అనేది అతి ముఖ్యమైన విషయం గా మారిపోయింది అని ప్రధాన మంత్రి అన్నారు.
భారతదేశం లోని వయోజనుల లో ప్రస్తుతం 90 శాతాని కి పైగా వయోజనులు ఒక డోజు టీకామందు ను అందుకొన్నారని ప్రధాన మంత్రి తెలిపారు. కేవలం అయిదు రోజుల లోనే 1.5 కోట్ల కు పైగా బాలల కు టీకా మందు డోజు ను ఇప్పించడం జరిగింది అని ఆయన అన్నారు. ఈ కార్యసిద్ధి ని యావత్తు దేశాని కి మరియు ప్రతి ఒక్క ప్రభుత్వాని కి ఆయన అంకితం చేశారు. ఈ కార్యసాధన కు గాను విశేషించి దేశ శాస్త్రవేత్తల కు, టీకా మందు తయారీదారు సంస్థల కు మరియు ఆరోగ్య రంగ సిబ్బంది కి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
ఇంతవరకు ప్రభుత్వం సుమారు 11 కోట్ల కరోనా వ్యాక్సీన్ డోజుల ను పశ్చిమ బంగాల్ కు ఎలాంటి ధర లేకుండా ఉచితం గా అందించింది అని ప్రధాన మంత్రి అన్నారు. బంగాల్ కు ఒక వెయ్యి అయిదు వందల కు పైగా వెంటిలేటర్ లను, తొమ్మిది వేల కు పైగా కొత్త ఆక్సీజన్ సిలిండర్ లను అందించడమైందన్నారు. రాష్ట్రం లో 49 పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటు లు సైతం కొత్త గా పని చేయడం మొదలు పెట్టాయి అని ప్రధాన మంత్రి వెల్లడించారు.
దేశ ఆరోగ్య రంగాన్ని పరివర్తన చెందింప చేయడం కోసం నివారణ ప్రధానమైనటువంటి ఆరోగ్య సంరక్షణ, తక్కువ ఖర్చు లో ఆరోగ్య సంరక్షణ, సరఫరా వైపు నుంచి జోక్యం ల కోసం ఉద్యమ పద్ధతి లో ప్రచారం చేయడం జరుగుతోంది అని ఆయన చెప్పారు. యోగ, ఆయుర్వేద, ఫిట్ ఇండియా మూవ్ మెంట్, టీకామందు ను అందరికీ ఇప్పించడం.. ఇవన్నీ నివారణ ప్రధానమైనటువంటి ఆరోగ్య సంరక్షణ ను పటిష్టం చేస్తున్నాయన్నారు. అదే విధం గా, స్వచ్ఛ్ భారత్ మిశన్ మరియు హర్ ఘర్ జల్ పథకాలు మెరుగైన ఆరోగ్య సంబంధి పర్యవసానాల కు తోడ్పడుతూ ఉన్నాయి అని ఆయన అన్నారు.
కేన్సర్ అనేది ఆర్థిక ప్రభావం పరం గా పేదల ను, మధ్య తరగతి ప్రజల ను భయానికి లోను చేస్తుందని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఈ వ్యాధి కలుగజేసే విషవలయం బారి నుంచి పేద ప్రజల ను బెంగ బయట కు తీసుకు రావడం కోసం, వారిలో బెంగ ను దూరం చేయడం కోసం చౌకైనటువంటి మరియు అందుబాటు లో ఉండేటటువంటి వైద్య చికిత్స లకై దేశం నిరంతరం గా చర్యల ను చేపడుతోంది అని ఆయన అన్నారు. కేన్సర్ చికిత్స కు అవసరమైన మందుల ధర లు గత కొన్ని సంవత్సరాల లో గణనీయ స్థాయి లో దిగివచ్చాయి అని ఆయన అన్నారు. ఎనిమిది వేల కు పైగా జన్ ఔషధి కేంద్రాలు మందుల ను, శస్త్ర చికిత్స సంబంధి పరికరాల ను ఎంతో తక్కువ ధరల కు అందజేస్తున్నాయి. యాభై కి పై చిలుకు కేన్సర్ ఔషధాలు ఎంతో తక్కువ ధర కు ఈ దుకాణాల లో లభిస్తున్నాయి అని ఆయన అన్నారు.
రోగుల అవసరాలు ఏమిటి అనే విషయం లో ప్రభుత్వం సూక్ష్మగ్రాహ్యత ను అవలంబిస్తున్నది. అంతేకాక 500కు పైగా మందుల ధరల నియంత్రణ ద్వారా ప్రతి ఒక్క సంవత్సరం లోనూ 3000 కోట్ల రూపాయల కు పైగా ఆదా అవుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. గుండె కు అమర్చే స్టెంట్ ల ధరల నియంత్రణ తో హృదయ కోశ రోగులు ఏటా 4500 కోట్ల రూపాయల కు పైగా ఆదా చేసుకోగలుగుతున్నారు. మోకాలి మార్పిడి సంబంధి శస్త్ర చికిత్సల కు అయ్యే ఖర్చులు తగ్గడం సీనియర్ సిటిజన్ లు ఏటా 1500 కోట్ల రూపాయలు మిగుల్చుకోవడం లో సహాయకారి అవుతున్నది అని ఆయన అన్నారు. ప్రైమ్ మినిస్టర్ నేశనల్ డయాలిసిస్ ప్రోగ్రామ్ లో భాగం గా 12 లక్షల మంది పేద రోగులు ఉచిత డయాలిసిస్ సౌకర్యాల ను ఉపయోగించుకొన్నారు అని ప్రధాన మంత్రి తెలియ జేశారు.
ప్రస్తుతం ‘ఆయుష్మాన్ భారత్ పథకం’ అనేది తక్కువ ఖర్చు మరియు అన్ని వర్గాల కు ఆరోగ్య సంరక్షణ ల పరం గా చూసినప్పుడు ఒక గ్లోబల్ బెంచ్ మార్క్ గా నిలుస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. పిఎమ్-జెఎవై లో భాగం గా, రెండు కోట్ల అరవై లక్షల మందికి పై గా రోగులు దేశవ్యాప్తం గా ఆసుపత్రుల లో ఉచిత వైద్య చికిత్స ను చేయించుకొన్నారు అని ఆయన వివరించారు. ఈ పథకమే లేకపోతే రోగులు 50 వేల కోట్ల రూపాయలు మొదలుకొని 60 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టవలసి వచ్చేది అని అంచనాలు పేర్కొంటున్నాయన్నారు. 17 లక్షల మంది కి పైగా కేన్సర్ రోగులు కూడా ఆయుష్మాన్ భారత్ పథకం లో భాగం గా లబ్ధి ని పొందారన్నారు. ఈ పథకం కేన్సర్, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల కు క్రమం తప్పక పరీక్షలు చేయించుకోవాలని ప్రచారం చేయడం ద్వారా గంభీర వ్యాధుల ను ముందుగానే పసిగట్టడం తో పాటు ముందస్తు గా వైద్య చికిత్స ను అందించడానికి కూడా ఉపయోగపడుతోంది అని ఆయన అన్నారు. ఈ ఉద్యమాని కి సహాయకారి గా హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్స్ పని చేస్తున్నాయన్నారు. ఆ కోవ కు చెందిన అయిదు వేల కు పైగా కేంద్రాల ను పశ్చిమ బంగాల్ లో కూడా స్థాపించడం జరిగింది అని పేర్కొన్నారు. పదిహేను కోట్ల కు పైచిలుకు ప్రజల కు నోటి కేన్సర్, మెడ\గర్భాశయ ద్వారానికి సంబంధించిన కేన్సర్, రొమ్ము కేన్సర్ లకు సంబంధించి ఒక రకం ఎక్స్ రే పరీక్ష లు చేయడమైంది అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
దేశం లో 2014వ సంవత్సరం వరకు చూసినట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్ల సంఖ్య దాదాపు తొంభై వేలు గా ఉండింది అని ప్రధాన మంత్రి అన్నారు. గత ఏడు సంవత్సరాల లో వాటికి తోడు అరవై వేల సీట్ల ను జత పరచడం జరిగింది అని ఆయన అన్నారు. 2014వ సంవత్సరం లో మనకు 6 ఎఐఐఎమ్ఎస్ లే ఉండేవి. ప్రస్తుతం దేశం 22 ఎఐఐఎమ్ఎస్ లతో కూడిన ఒక బలమైన నెట్ వర్క్ దిశ లో ముందుకు సాగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం లో ప్రతి జిల్లా లో కనీసం ఒక వైద్య కళాశాల ఉండేటట్లు గా సంబంధిత పనులు సాగుతున్నాయి అని ఆయన చెప్పారు. 19 స్టేట్ కేన్సర్ ఇన్స్ టిట్యూట్ ల ద్వారా కేన్సర్ సంరక్షణ సంబంధి మౌలిక సదుపాయాల కు దన్ను లభించనుంది. 20 తృతీయ స్థాయి కేన్సర్ సంరక్షణ సంస్థల ను మంజూరు చేయడమైంది. 30 కి పైగా సంస్థల స్థాపన పనులు కొనసాగుతూ ఉన్నాయి. అదే మాదిరి గా, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్థ్ మిశన్ మరియు ఆయుష్మాన్ భారత్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ లు దేశం లో ఆరోగ్య రంగాని కి ఒక ఆధునికమైన రూపు రేఖల ను సంతరించనున్నాయి అని ఆయన వివరించారు.
కరోనా కు వ్యతిరేకం గా జరుగుతున్న యుద్ధం లో ముందు జాగ్రత చర్యల ను తీసుకోవలసింది గా ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి తన విజ్ఞప్తి ని పునరుద్ఘాటిస్తూ ప్రసంగాన్ని ముగించారు.
దేశవ్యాప్తం గా ఆరోగ్య రంగ సదుపాయాల ను విస్తరించాలన్నా, అలాగే వాటి ని ఉన్నతీకరించాలన్న ప్రధాన మంత్రి దృష్టి కోణాని కి అనుగుణం గా ఈ సిఎన్ సిఐ లో రెండో కేంపస్ ను నిర్మించడం జరిగింది. సిఎన్ సిఐ కి కేన్సర్ రోగులు భారీ సంఖ్య లో వస్తున్నారు. దీనితో ఈ సంస్థ ను విస్తరించవలసిన అవసరం ఉందన్న భావన గత కొంత కాలం గా ఉంటోంది. ఈ అవసరాన్ని రెండో కేంపస్ ద్వారా తీర్చినట్లు అవుతుంది.
సిఎన్ సిఐ రెండో కేంపస్ ను 540 కోట్ల రూపాయల కు పై చిలుకు ఖర్చు తో నిర్మించడమైంది. ఈ సొమ్ము లో 75:25 నిష్పత్తి లో, దాదాపు గా 400 కోట్ల రూపాయల ను కేంద్ర ప్రభుత్వం అందించగా మిగిలిన సొమ్ము ను పశ్చిమ బంగాల్ ప్రభుత్వం సమకూర్చింది. ఈ కేంపస్ లో 460 పడకల తో సంపూర్ణ కేన్సర్ సెంటర్ యూనిట్ ను కేన్సర్ రోగ నిర్ధారణ, స్టేజింగ్, వైద్య చికిత్స, ఇంకా సంరక్షణ లకు సంబంధించిన అత్యంత ఆధునికమైనటువంటి మౌలిక సదుపాయాల హంగుల తో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆవరణ లో న్యూక్లియర్ మెడిసిన్ (పిఇటి), 3.0 టెస్లా ఎమ్ఆర్ఐ, 128 స్లైస్ సిటి స్కానర్, రేడియో న్యూక్లైడ్ థెరపీ యూనిట్, ఎండోస్కోపీ స్వీట్, ఆధునిక బ్రాంకిథెరపీ యూనిట్ లు వగైరా సౌకర్యాల ను సమకూర్చారు. ఈ కేంపస్ అధునాతన కేన్సర్ పరిశోధన సదుపాయం గా కూడా పని చేస్తుంది. ఇది కేన్సర్ రోగుల కు, ప్రత్యేకించి దేశం లోని తూర్పు ప్రాంతాల నుంచి మరియు ఈశాన్య ప్రాంతాల నుంచి వచ్చే కేన్సర్ రోగుల కు సంపూర్ణ సంరక్షణ ను అందించనుంది.
साल की शुरुआत देश ने 15 से 18 साल की उम्र के बच्चों के लिए वैक्सीनेशन से की थी।
— PMO India (@PMOIndia) January 7, 2022
वहीं आज साल के पहले महीने के पहले हफ्ते में ही, भारत 150 करोड़- 1.5 बिलियन वैक्सीन डोजेज़ का ऐतिहासिक मुकाम भी हासिल कर रहा है: PM @narendramodi
मैं विशेष रूप से इस उपलब्धि के लिए देश के वैज्ञानिकों का, वैक्सीन मैन्यूफैक्चरर्स का, हमारे हेल्थ सेक्टर से जुड़े साथियों का धन्यवाद करता हूं।
— PMO India (@PMOIndia) January 7, 2022
सबके प्रयासों से ही देश ने उस संकल्प को शिखर तक पहुंचाया है, जिसकी शुरुआत हमने शून्य से की थी: PM @narendramodi
आज भारत की वयस्क जनसंख्या में से 90 प्रतिशत से ज्यादा लोगों को वैक्सीन की एक डोज लग चुकी है।
— PMO India (@PMOIndia) January 7, 2022
सिर्फ 5 दिन के भीतर ही डेढ़ करोड़ से ज्यादा बच्चों को भी वैक्सीन की डोज लगाई जा चुकी है।
ये उपलब्धि पूरे देश की है, हर सरकार की है: PM @narendramodi
सरकार द्वारा अब तक पश्चिम बंगाल को भी कोरोना वैक्सीन की करीब-करीब 11 करोड़ डोज मुफ्त मुहैया कराई जा चुकी है।
— PMO India (@PMOIndia) January 7, 2022
बंगाल को डेढ़ हजार से अधिक वेंटिलेटर, 9 हजार से ज्यादा नए ऑक्सीजन सिलेंडर भी दिए गए हैं।
49 PSA नए ऑक्सीजन प्लांट्स ने भी काम करना शुरू कर दिया है: PM @narendramodi
कैंसर की बीमारी तो ऐसी है जिसका नाम सुनते ही गरीब और मध्यम वर्ग हिम्मत हारने लगता था।
— PMO India (@PMOIndia) January 7, 2022
गरीब को इसी कुचक्र, इसी चिंता से बाहर निकालने के लिए देश सस्ते और सुलभ इलाज के लिए निरंतर कदम उठा रहा है।
बीते सालों में कैंसर के इलाज के लिए ज़रूरी दवाओं की कीमतों में काफी कमी की गई है: PM
आयुष्मान भारत योजना आज affordable और inclusive healthcare के मामले में एक ग्लोबल बेंचमार्क बन रही है।
— PMO India (@PMOIndia) January 7, 2022
PM-JAY के तहत देशभर में 2 करोड़ 60 लाख से ज्यादा मरीज, अस्पतालों में अपना मुफ्त इलाज करा चुके हैं: PM @narendramodi
साल 2014 तक देश में अंडर ग्रेजुएट और पोस्ट ग्रेजुएट सीटों की संख्या 90 हज़ार के आसपास थी।
— PMO India (@PMOIndia) January 7, 2022
पिछले 7 सालों में इनमें 60 हज़ार नई सीटें जोड़ी गई हैं।
साल 2014 में हमारे यहां सिर्फ 6 एम्स होते थे।
आज देश 22 एम्स के सशक्त नेटवर्क की तरफ बढ़ रहा है: PM @narendramodi