India is ready to protect humanity with not one but two 'Made in India' coronavirus vaccines: PM Modi
When India took stand against terrorism, the world too got the courage to face this challenge: PM
Whenever anyone doubted Indians and India's unity, they were proven wrong: PM Modi
Today, the whole world trusts India: PM Modi

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు ను ప్రారంభించారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి తన ప్రసంగం లో, ఆయా దేశాలలో కరోనా మహమ్మారి కాలంలో విదేశీ భారతీయులు నిర్వహించిన పాత్రను మెచ్చుకొన్నారు. వివిధ దేశాల అధిపతులతో తాను చర్చలు జరిపిన క్రమం లో, వారు ప్రవాసీ భారతీయులు ఆయా దేశాలలో వైద్యులుగా, వైద్య చికిత్స సహాయక సిబ్బంది గానే కాకుండా సాధారణ పౌరులుగా కూడా అందిస్తున్న తోడ్పాటు ను ప్రశంసించినప్పుడల్లా తాను గర్వపడుతూ వచ్చానన్నారు. కోవిడ్ కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో విదేశాలలో నివసిస్తున్న భారతీయులు అందిస్తున్న తోడ్పాటు ను కూడా ఆయన లెక్కలోకి తీసుకొని అభినందించారు.

వై-2కె సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భారతదేశం పోషించిన పాత్ర ను, భారతీయ ఔషధ నిర్మాణ పరిశ్రమ ఈ క్రమంలో వేసిన ముందడుగులను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, భారతదేశం సామర్థ్యాలు మానవాళి కి ఎల్లవేళలా ప్రయోజనాన్ని అందిస్తూవస్తున్నాయన్నారు. ప్రపంచ సవాళ్లను తగ్గించడంలో భారతదేశం ఎప్పుడూ అగ్రసర భూమిక ను నిభాయించింది అని ఆయన అన్నారు. వలసవాదానికి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరు లో భారతదేశం సాధించిన పైచేయి ఈ బెదరింపులకు ఎదురొడ్డి నిలవడం లో ప్రపంచానికి బలాన్నిచ్చిదని ఆయన అన్నారు.

భారతదేశం అంటే ప్రపంచానికి ఉన్న నమ్మకం ప్రపంచానికి ఉన్న నమ్మకం, భారతదేశం ఆహార, భారతదేశం ఫ్యాశన్, భారతదేశం కుటుంబానికి ఇచ్చే విలువ, భారతదేశం వ్యాపారానికి ఇచ్చే విలువల ఖ్యాతిలో చాలా భాగం ప్రవాసీ భారతీయులకు దక్కుతుందని ప్రధాన మంత్రి అన్నారు. విదేశాలలో నివసిస్తున్న భారతీయుల నడవడిక భారతీయ మార్గం, భారతీయ విలువల పట్ల ఒక ఆసక్తి ని రేకెత్తించింది, మరి ఒక కుతూహలం కాస్తా ఈ పరంపర తాలూకు శుభారంభం జరిగి, అది ఈ సదస్సు రూపాన్ని తీసుకొందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశం ముందుకు పోతున్న క్రమం లో, ప్రవాసీ భారతీయులకు ప్రముఖ పాత్ర ఉంది, ఎందుకంటే భారతదేశంలో తయారైన ఉత్పత్తులను వారు ఉపయోగిస్తుండడంతో భారత ఉత్పత్తులంటే మరింత ఎక్కువ విశ్వాసం అంకురిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం చూపిన సమర్థవంతమైన ప్రతిస్పందన ను గురించి ప్రవాసీ భారతీయులకు ప్రధాన మంత్రి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ కు వ్యతిరేకంగా నెలకొన్న ఈ విధమైన ప్రజాస్వామ్య ఐకమత్యానికి మరో ఉదాహరణ అంటూ ఏదీ లేదు అని ఆయన అన్నారు. పిపిఇ కిట్ లు, మాస్క్ లు, వెంటిలేటర్ లు, టెస్టింగ్ కిట్ లు వంటి ముఖ్య వస్తువులలో స్వయం సంవృద్ధి ని సాధించుకొందని, అయినప్పటికీ భారతదేశం తన సామర్థ్యాలను ఒక్క స్వయంసంవృద్ధిని సాధించుకోవడం కోసమే పూర్తిగా అభివృద్ధిపరచుకోలేదని, అనేక వస్తువులను భారతదేశం ఎగుమతి చేయడం కూడా మొదలుపెట్టేసింది అని ప్రధాన మంత్రి వివరించారు. ప్రస్తుతం అన్నిటి కంటే తక్కువ మరణాల రేటు తో పాటు అన్ని దేశాల కంటే వేగంగా వ్యాధి నయమవుతున్న రేటు ను కలిగివున్న దేశాలలో ఒక దేశంగా ఉంది. ప్రపంచ ఔషధాలయం లాగా, భారతదేశం ప్రపంచ దేశాలకు సాయపడుతోందని, యావత్తు ప్రపంచం రెండు టీకామందులతో ప్రపంచంలోనే అతి భారీదైన టీకాకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సన్నద్ధం అవుతున్నటువంటి భారతదేశం వైపు చూస్తోందని ఆయన అన్నారు.

 

ప్రపంచ ప్రశంసలను అందుకున్న ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) మాధ్యమం ద్వారా అవినీతికి కళ్లెం వేయడం లో దేశం సాధించిన ప్రగతి ని ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రకటించి, మహమ్మారి కాలంలో ఈ వ్యవస్థ కు ప్రపంచ స్థాయి లో ప్రశంసలు దక్కాయన్నారు. ఇదే విధంగా, పేదలకు సాధికారిత కల్పన, నవీకరణయోగ్య శక్తి రంగంలో ప్రగతి అంశాలలో సైతం దేశానికి ప్రశంసలు లభిస్తున్నాయన్నారు.

నేటి భారతదేశం అంతరిక్ష కార్యక్రమం, సాంకేతిక విజ్ఞానయుక్త స్టార్ట్- అప్ ఇకోసిస్టమ్, స్టార్ట్- అప్ ఇకోసిస్టమ్ తాలూకు దిన దిన ప్రవర్ధమాన కంపెనీలు భారతదేశంలో శతాబ్దాల నాటి అవిద్య పరమైన దృష్టికోణాన్ని మార్చివేసి ఒక కొత్త చరిత్ర ను లిఖిస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. విద్య రంగం మొదలుకొని వాణిజ్య సంస్థ రంగం వరకు వివిధ రంగాలలో ఇటీవల కొన్ని నెలల వ్యవధి లో చేపట్టిన సంస్కరణల తాలూకు ప్రయోజనాన్ని పొందవలసిందంటూ ప్రవాసీ భారతీయులను ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భం లో తయారీ రంగానికి లోకప్రియత్వాన్ని కొనితేవడానికి ఉత్పత్తి తో ముడిపెట్టిన సబ్సిడీ ల పథకాన్ని గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ప్రవాస భారతీయులకు వారి మాతృభూమి నుంచి అవసరమైన అన్ని విధాలుగాను మద్దతు లభిస్తుంది అంటూ ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు. వందే భారత్ మిశన్ ను గురించి ఆయన ప్రస్తావించి, కరోనా కాలంలో 45 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులను కాపాడడం జరిగిందని తెలిపారు. విదేశాలలో ఉన్న భారతీయుల ఉపాధి ని రక్షించడం కోసం జరుగుతున్న ప్రయత్నాలను గురించిన సమాచారాన్ని కూడా ఆయన తెలిపారు. గల్ఫ్, ఇతర ప్రాంతాల నుంచి అప్రవాసీలను వెనుకకు తిరిగి రప్పించడం కోసం స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డేటాబేస్ ఫార్ ఎంప్లాయ్ మెంట్ సపోర్ట్ (ఎస్ డబ్ల్యు ఎడిఇఎస్.. ‘స్వదేశ్’) అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రవాసీ భారతీయులతో మెరుగైన సంపర్కాన్ని, సంధానాన్ని ఏర్పరచుకోవడానికి ఉద్దేశించిన గ్లోబల్ ప్రవాసీ రిశ్తా పోర్టల్ ను గురించి కూడా ఆయన మాట్లాడారు.

సురినామ్ అధ్యక్షుడు, గౌరవనీయ శ్రీ చంద్రిక ప్రసాద్ సంతోఖీ నాయకత్వ, ప్రధాన అభిభాషణ కు గాను ప్రధాన మంత్రి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఆయనను త్వరలోనే కలుసుకొంటాననే ఆశాభావాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. శ్రీ మోదీ ప్రవాసీ భారతీయ సమ్మాన్ విజేతలను, క్విజ్ పోటీ లోని విజేతలను అభినందించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన క్రమంలో 75వ వార్షికోత్సవం సందర్భం లో జరుపుకొనే మహోత్సవం లో పాలుపంచుకోవసిందిగా ప్రవాసీ భారతీయులను ప్రధాన మంత్రి కోరారు. ప్రవాస భారతీయులను, భారతీయ మిశన్ ల వారిని ఒక పోర్టల్ ను రూపొందించాలని ఆయన సూచించారు. ఆ పోర్టల్ భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రవాసీ భారతీయుల తోడ్పాటు ను నమోదుచేసేందుకు అనువైందిగా ఉండాలని ఆయన అన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
25% of India under forest & tree cover: Government report

Media Coverage

25% of India under forest & tree cover: Government report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi