It is an impressive fact that there have been improvements in 9 out of 10 parameters in Ease of Doing Business - such as Ease of Getting Electricity, Ease of Paying Taxes etc: PM
India will develop, will grow only when our states develop: PM Modi
We are creating a transparent eco-system for the creation of new India that minimizes the need for face to face interactions with Government agencies: PM
In the last 3 years we have abolished more than 1400 acts that had ceased to be relevant: PM Modi
Potential + Policy + Performance equals Progress: PM Modi
There are two factors that are the hallmark of the way this Government works – reform oriented budget and result oriented policies: PM
Our budget is not limited to outlay, our budget is not limited to outputs. Our budget is an outcome budget: PM Modi
The structural and policy changes that the Government has made are dedicated to the welfare of the poorest and most vulnerable of our society: PM
The Government will now provide, under Ayushman Bharat, health insurance for Rs. 5 lakh per annum to every poor family in the country: PM Modi
The Government will spend Rupees one lakh crore in the next 4 years to strengthen and improve the education system, says the PM

మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శ్రీ‌మాన్ సి. విద్యాసాగ‌ర్ రావు గారు, ముఖ్య‌మంత్రి శ్రీ దేవేంద్ర ఫ‌డ్‌ణ‌వీస్ గారు, పారిశ్రామిక‌వేత్త‌లు మ‌రియు దేశ విదేశాల నుండి ఇక్క‌డ‌కు విచ్చేసిన ఇత‌ర ఉన్న‌తాధికారులు.. మీ అంద‌రికీ ఈ మేగ్నెటిక్ మ‌హారాష్ట్ర కార్య‌క్ర‌మానికి ఇదే నా స్వాగతం.

Samruddha Ani Sampanna Maharashtracha Nirmiti Karta Honara Magnetic Maharashtrala Majha Khup Khup Shubhechchha

Bandhu Bhaginino Sarvana Majha Namaskar

శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన లోతుపాతులను గురించి నాకు అంత‌గా తెలియదు; కానీ, ఒక అయ‌స్కాంత క్షేత్రానికి దిశ తో పాటు మహత్వం కూడా ఉంటుంద‌ని నాతో చెప్పారు. నేను ఇక్క‌డ‌కు రావ‌డాని క‌న్నా ముందు న‌వీ ముంబ‌యి విమానాశ్ర‌యానికి మ‌రియు జెఎన్‌పిటి కి సంబంధించిన కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యాను. ఆ రెండు కార్య‌క్ర‌మాలు కూడా మ‌హారాష్ట్ర యొక్క దిశ‌తో పాటు అయ‌స్కాత క్షేత్రం యొక్క మ‌హ‌త్వాన్ని చాటి చెప్పేవే. అదీకాక‌, కేంద్ర స్థానానికి మీరు ఎంత స‌న్నిహితంగా ఉంటే అంత అధిక స్థాయిలో అయ‌స్కాంత క్షేత్రం తాలూకు శ‌క్తి ని మీరు అనుభ‌వంలోకి తెచ్చుకోగ‌లుగుతారన్న‌ది వాస్తవం. ఈ రోజు మీలోని ఉత్సాహమూ, అభినివేశమూ, ఇంకా ఈ ఉల్లాసభ‌రిత వాతావ‌ర‌ణమూ.. ఇవ‌న్నీ మేగ్నెటిక్ మ‌హారాష్ట్ర యొక్క అయ‌స్కాంత రేఖ‌లు ఎంత శ‌క్తివంత‌మైన‌వో వెల్ల‌డించే రుజువులే.

మిత్రులారా, ఈ కార్య‌క్ర‌మం స‌హ‌కారాత్మ‌క‌మైన, స్ప‌ర్ధాత్మ‌క‌మైన స‌మాఖ్యా విధానానికి ఒక చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. ఈ రోజు దేశం లోని అన్ని రాష్ట్రాల మ‌ధ్య ఒక విధ‌మైన స్ప‌ర్ధ, ఒక ర‌క‌మైన పోటీ నెల‌కొన్నాయి. ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మాల‌ను మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, వ్య‌వ‌సాయం, జౌళి, ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, విద్య‌, సౌర‌ శ‌క్తి, ఇంకా అనేక ఇత‌ర రంగాల‌ లోకి పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డం కోసం నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంది. రాష్ట్రాలు వాటి వాటి అవ‌స‌రాల‌కు అనుగుణంగా విభిన్న రంగాల‌లో పెట్టుబ‌డుల ఆవ‌శ్య‌క‌త పైన దృష్టిని సారిస్తున్నాయి.

ఇటీవ‌లే ‘అడ్వాంటేజ్ అస‌మ్- ఇన్‌వెస్ట‌ర్స్‌ స‌మిట్‌’ లో పాలుపంచుకొనే అవ‌కాశం నాకు ద‌క్కింది. అనేక సంవ‌త్స‌రాల‌ క్రితం ఈశాన్య ప్రాంతంలో పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఈ కోవ‌కు చెందిన చ‌క్క‌టి బ్రాండింగు ను చేప‌ట్ట‌వ‌చ్చనే ఆలోచ‌నను ఎవ్వరూ చేసి ఉండ‌రు.

ఝార్ ఖండ్‌, మ‌ధ్య‌ ప్ర‌దేశ్, ఇంకా అనేక రాష్ట్రాలు ఈ విధ‌మైన కార్య‌క్ర‌మాలను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నాయి. గుజ‌రాత్ లో మొద‌లైన ఈ ప‌రంప‌ర తాలూకు ప్ర‌భావాన్ని ప్రస్తుతం దేశ‌వ్యాప్తంగా చూడవచ్చును.

మిత్రులారా, ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నందుకు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని నేను హృద‌యపూర్వ‌కంగా అభినందిస్తున్నాను. రాష్ట్రంలో పెట్టుబ‌డి వాతావ‌ర‌ణాన్ని ప‌టిష్ట ప‌ర‌చేందుకు గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లో అనేక నూత‌న కార్య‌క్ర‌మాల‌ను మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టింది. ఈ ప్ర‌య‌త్నాలు ప్ర‌పంచ బ్యాంకు యొక్క వ్యాపారాన్ని సులువుగా నిర్వ‌హించే విష‌యంలో ఇచ్చే స్థానాలలో రాష్ట్రం యొక్క స్థానం మెరుగు ప‌డ‌టానికి ఎంత‌గానో తోడ్ప‌డ్డాయి. ఫ‌డ్‌ణ‌వీస్ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంస్క‌ర‌ణ‌లు మ‌హారాష్ట్ర లో ప‌రివ‌ర్త‌న‌ను తీసుకొని రావ‌డంలో ఒక ముఖ్య పాత్ర‌ను పోషించాయి. వ్యాపారాన్ని సులువుగా నిర్వ‌హించే విష‌యంలో స్థానాలకు సంబంధించి విద్యుచ్ఛక్తిని పొంద‌డం మ‌రియు ప‌న్నుల‌ను చెల్లించ‌డంలో సౌల‌భ్యం ల వంటి 10 ప‌రామితుల‌లో 9 ప‌రామితులు మెరుగ‌య్యాయి. ఈ విష‌యాల‌న్నీ కూడా వాటంత అవి ఒక గొప్ప గ‌మ‌నార్హ‌మైన అంశంగా రూపొందాయి.

విధాన‌ప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌ల ద్వారా ప‌రిపాల‌న‌లో ఒక నూత‌న ప‌ని సంస్కృతిని అభివృద్ధి చేసిన‌ప్పుడే ఈ విధ‌మైన స‌మ‌గ్ర సంస్క‌ర‌ణ‌లు చోటు చేసుకోగ‌లుగుతాయి. ప్రాజెక్టులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం కోసం ఆయా ప్రాజెక్టుల అమ‌లులో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం చేస్తూ పోతే, విభాగాల మ‌ధ్య స‌హ‌కారాన్ని పెంపొందిస్తే, నిర్ణ‌యాల‌ను ఒక కాల ప‌రిమితి లోప‌ల తీసుకోవ‌డం జ‌రిగితే- అదుగో అప్పుడు స‌మ‌గ్ర సంస్క‌ర‌ణ‌లు సాధ్య‌మవుతాయి.

నేను ఇంత‌కు ముందు ఏ అయ‌స్కాంత క్షేత్రాన్ని గురించి మాట్లాడానో దానిని సృష్టించ‌డం ఈ ప‌ద్ధ‌తిలోనే వీలు ప‌డుతుంది. మ‌రి దీని ప్ర‌భావం రాష్ట్రంలో పెట్టుబ‌డుల పైన, రాష్ట్రంలోని అభివృద్ధి పైన ఉంటుంది. ఈ కార‌ణంగా మ‌హారాష్ట్ర అవ‌స్థాప‌న ప్రాజెక్టుల మొత్తం వ్య‌యం విష‌యంలో దేశం లోని మ‌రే ఇత‌ర రాష్ట్రాని క‌న్నా అగ్ర‌గామిగా నిలిచింది. ఫ్రాస్ట్ అండ్ సులివాన్ యొక్క జాబితా ప్ర‌కారం స‌ర్వ‌తోముఖ అభివృద్ధి విష‌యంలో దేశంలోకెల్లా మ‌హారాష్ట్ర అగ్ర స్థానంలో ఉన్న‌ట్లు ప్ర‌క‌టించ‌డ‌మైంది. దేశం లోకి 2016-17లో త‌ర‌లి వ‌చ్చిన మొత్తం పెట్టుబ‌డిలో దాదాపు 51 శాతం పెట్టుబ‌డులు ఒక్క మ‌హారాష్ట్ర లోకే త‌ర‌లి వ‌చ్చాయి. అదే విధంగా 2016 ఫిబ్ర‌వ‌రి లో ‘మేక్ ఇన్ ఇండియా’ స‌ప్తాహం జ‌రిపిన‌ప్పుడు పారిశ్రామిక విభాగంలో సుమారు నాలుగు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. అలాగే, రెండు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల విలువైన ప్రాజెక్టులకు సంబంధించిన ప‌నులు మొద‌ల‌య్యాయి.

ఈ రోజు, మ‌హారాష్ట్ర లో అమ‌ల‌వుతున్న అవ‌స్థాప‌న ప‌థ‌కాలు యావ‌త్ ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ఢిల్లీ-ముంబ‌యి ఇండస్ట్రియల్ కారిడోర్ ప్రాజెక్టు ప్ర‌పంచంలోనే 100 అత్యంత వినూత్న శైలి ప్రాజెక్టుల‌లో ఒక ప్రాజెక్టుగా పేరు తెచ్చుకొంది. న‌వీ ముంబ‌యి విమానాశ్ర‌య నిర్మాణ‌ం, ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ నిర్మాణ ప‌నులు ఈ ప్రాంతంలో నివ‌సిస్తున్న లక్షలాది ప్ర‌జ‌ల జీవితాల‌లో ఒక పెను మార్పును తీసుకు రాబోతున్నాయి. దీనికి తోడు ముంబ‌యి, న‌వీ ముంబ‌యి, పుణే మ‌రియు నాగ్‌పుర్ ల‌లో అభివృద్ధిప‌ర‌చ‌బోయే దాదాపు 350 కిలో మీట‌ర్ల పొడ‌వైన మెట్రో నెట్‌వ‌ర్క్ ఈ ప్రాంతాల‌లో అటు పెట్టుబ‌డికి, ఇటు అభివృద్ధికి కొత్త అవ‌కాశాల‌ను సృష్టించ‌నున్నాయి.

మిత్రులారా, నేను ఇప్పుడు మీకు ఒక ప్ర‌త్యేక‌మైన‌టువంటి ప్రాజెక్టును గురించి వివ‌రిస్తాను. అదే మ‌హారాష్ట్ర స‌మృద్ధి కారిడోర్‌. ఈ ప్రాజెక్టు రాష్ట్రం యొక్క గ్రామీణ ప్రాంతాల‌ను, రాష్ట్రం యొక్క వ్య‌వ‌సాయాన్ని మ‌రియు వ్య‌వ‌సాయ ఆధారిత ప‌రిశ్ర‌మ‌ల‌ను వికాస సంబంధ నూత‌న శిఖ‌రాల‌కు తీసుకువెళ్ళ‌డ‌మే ధ్యేయంగా రూపొందిన‌టువంటిది. మ‌హారాష్ట్ర లో 700 కిలో మీట‌ర్ల పొడ‌వున సాగే సూప‌ర్ క‌మ్యూనికేశన్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం మ‌రియు స్మార్ట్ సిటీస్ కోవ‌లో ఎక్స్‌ప్రెస్ వే కు ఇరు వైపులా 24 న్యూ నోడ్స్ అభివృద్ధి.. ఈ అంశాల‌న్నీ క‌నీసం 20 నుండి 25 ల‌క్ష‌ల మందికి కొత్త‌గా ఉద్యోగావ‌కాశాల‌ను అందించే స‌త్తా ను క‌లిగివున్న‌టువంటివి.

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ ఆర్థిక వ్య‌వస్థ‌ను క‌లిగివుండే తొలి రాష్ట్రంగా రూపొందాల‌ని ల‌క్ష్యాన్ని నిర్దేశించుకొన్నందుకు నేను సంతోషిస్తున్నాను. శివాజీ మ‌హారాజ్ పుట్టిన గ‌డ్డ మీద ఏ ల‌క్ష్య‌మైనా సాధించ‌డానికి క‌ష్ట‌మైంది కానే కాదు. ఆయ‌న దీవెన‌ల‌తో ఈ ల‌క్ష్యాన్ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సాధించి, దేశంలో కెల్లా ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థతో కూడిన ప్రప్రథమ రాష్ట్రంగా నిల‌బ‌డగ‌ల‌ద‌ని నేను న‌మ్ముతున్నాను.

మిత్రులారా, రాష్ట్రాలు అభివృద్ధి చెందిన‌ప్పుడు మాత్రమే దేశాభివృద్ధి సాధ్య‌ప‌డుతుంద‌ని నా విశ్వాసం. మ‌హారాష్ట్ర యొక్క ప్ర‌గ‌తి భార‌త‌దేశం యొక్క ప్ర‌వ‌ర్ధ‌మాన‌మ‌వుతున్న సామ‌ర్ధ్యానికి ఒక ప్ర‌తీక‌. మ‌రి మ‌న‌కు ఈ మాదిరి భారీ ల‌క్ష్యాల‌ను పెట్టుకొనే స‌త్తా కూడా ఉంది. దేశంలో మారుతున్న ఆలోచ‌న‌ల స‌ర‌ళికి, ప‌రివ‌ర్త‌న‌కు లోన‌వుతున్న స్థితిగ‌తుల‌కు ఇది ఒక స‌జీవ ఉదాహ‌ర‌ణ.

భార‌త‌దేశం ప్ర‌ప్ర‌థ‌మంగా ట్రిలియ‌న్ డాల‌ర్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల స‌ర‌స‌న చేరిన సంద‌ర్భంలో ఎంత‌టి పెద్ద ప‌తాక శీర్షిక‌లు వ్యాప్తి లోకి వ‌చ్చాయో నాకు ఇప్ప‌టికీ జ్ఞాప‌కం ఉంది. అయితే, కొన్ని సంవ‌త్స‌రాలు గడచిన త‌రువాత ఆ వృద్ధి ప్ర‌స్థానం కుంభ‌కోణాల కార‌ణంగా తారుమారు అయింది. ఇక దేశంలో భిన్న‌మైన‌టువంటి ఒక వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ట్రిలియ‌న్ డాల‌ర్ దేశాల స‌మూహం గురించి కాకుండా దుర్భ‌ల‌మైన అయిదు దేశాల గురించి చ‌ర్చించసాగారు.

మ‌ళ్ళీ ఇప్పుడు, గ‌త మూడున్న‌ర సంవ‌త్స‌రాల కాలంలో, ప్ర‌భుత్వం అదే ప‌నిగా చేస్తున్న ప్ర‌య‌త్నాల ఫ‌లితంగా అయిదు ట్రిలియ‌న్ డాల‌ర్ దేశాల స‌మూహాన్ని గురించి చ‌ర్చించ‌డం జ‌రుగుతోంది. రానున్న కొన్ని ఏళ్ళ‌లో భార‌త‌దేశం అయిదు ట్రిలియ‌న్ డాల‌ర్ ల దేశాల స‌మూహంలో చేరుతుంద‌ని ప్ర‌పంచం లోని అగ్ర‌గామి రేటింగ్ సంస్థ‌లు పేర్కొంటున్నాయి.

మిత్రులారా, ఈ విశ్వాసం అంత సుల‌భంగా ఏమీ రాలేదు. ఒక దార్శ‌నిక‌త అనేది చోటు చేసుకొంది. ఈ క‌ద‌లిక వెనుక ప్ర‌జ‌ల‌కు అనుకూల‌మైన అభివృద్ధికి స్నేహ‌శీల‌మైన మ‌రియు పెట్టుబ‌డికి అనుకూల‌మైన వాతావ‌ర‌ణాన్ని ఏర్ప‌ర‌చాల‌న్న ప్ర‌య‌త్నాలు అండ‌గా నిలిచాయి. మేము ప‌రిపాల‌న‌ను ఎక్క‌డికి తీసుకు వెళ్ళామంటే.. ఆ చోట‌ ప్ర‌భుత్వం వైపు నుండి జోక్యం అనేది క‌నీస స్థాయికి చేరుకొంది.

మిత్రులారా, ఒక సంపూర్ణ‌మైన దృష్టి కోణాన్ని క‌లిగి ఉంటేనే దేశం పురోగ‌మిస్తుంది. మ‌రి ఆ దార్శ‌నిక‌త అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకొని పోయే విధంగానూ, స‌మ‌గ్రంగానూ ఉండాలి. ఈ రోజు మ‌నం ఆ దిశ‌గా ప‌యనిస్తున్నాం. ఎక్క‌డైతే రాష్ట్రానికి చోద‌క శ‌క్తిగా విధానం ఉంటుందో, ఎక్క‌డైతే ప్ర‌భుత్వం ప‌నితీరు ఆధారంగా ముందుకు సాగుతుందో, ఎక్క‌డైతే ప్ర‌భుత్వం జ‌వాబుదారుత‌నాన్ని క‌లిగివుంటుందో, ఎక్క‌డైతే ప్ర‌భుత్వం భాగస్వామ్యయుత ప్ర‌జాస్వామ్యంగా ఉంటుందో ఆ దిశ‌గా మ‌నం ముందుకు సాగుతున్నాం. ఒక ‘న్యూ ఇండియా’ను ఆవిష్క‌రించ‌డానికి దేశంలో ఒక పార‌ద‌ర్శ‌క‌మైన‌టువంటి ఈకో సిస్ట‌మ్ ను మేము అభివృద్ధిప‌రుస్తున్నాం. ఈ ఇకో సిస్ట‌మ్ ప్ర‌భుత్వ యంత్రాంగం పైన ఆధార‌ప‌డేదిగా ఉండ‌దు. దీనిని సాధించ‌డం కోసం నియ‌మాల‌ను స‌ర‌ళ‌త‌రం చేశాం. చ‌ట్టాల‌ను స‌వ‌రించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉన్న చోట్ల చ‌ట్టాల‌ను స‌వ‌రించాం. చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌వ‌ల‌సిన అగ‌త్యం ఉన్న‌చోట‌ల్లా చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌డ‌మైంది.

భార‌త ప్ర‌భుత్వం గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లో 1400 ల‌కు పైగా చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసిన సంగ‌తి మీలో కొంద‌రికి ఖాయంగా తెలిసే ఉంటుంది. కొత్త చ‌ట్టాలను రూపొందించేట‌ప్పుడు అవి విష‌యాల‌ను జ‌టిలం చేసే బ‌దులు నిజానికి సుల‌భ‌త‌రం చేసేట‌ట్టు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డ‌మైంది. ప‌రిపాల‌న‌లో మాన‌వ ప్ర‌మేయాన్ని త‌గ్గించేందుకు మేము ప్ర‌యత్నిస్తున్నాం. కార్మిక చ‌ట్టాలు కానివ్వండి, లేదా ప‌న్నులను చెల్లించే విధానం కానివ్వండి, సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవ‌డం ద్వారా అన్ని ప్ర‌క్రియ‌ల‌ను సుల‌భ‌త‌రంగా మార్చేందుకు మేము న‌డుం క‌ట్టాము.

మిత్రులారా, ప్ర‌స్తుతం జాతీయ ర‌హ‌దారుల నిర్మాణంలో కానివ్వండి; లేదా కొత్త రైలు మార్గాల నిర్మాణంలో కానివ్వండి; లేదా రైలు మార్గాల విద్యుతీక‌ర‌ణ కానివ్వండి; లేదా ప్ర‌భుత్వం చేప‌ట్టే గృహ నిర్మాణ ప‌నులు కానివ్వండి; లేదా అద‌నంగా సౌర శ‌క్తి ఉత్ప‌త్తి సామ‌ర్ధ్యం క‌ల్ప‌న కానివ్వండి ఆయా ప్రాజెక్టుల అమ‌లు తాలూకు వేగం సంత‌రించుకొంది. అమ‌లు ప్ర‌క్రియ యొక్క వేగం రెండింత‌లో లేదా మూడింత‌లో పెరిగిన మ‌రో యాభై రంగాల‌ను నేను పేర్కొనగ‌ల‌ను.

మిత్రులారా, ఒక ప‌క్క మేము వ‌న‌రుల తాలూకు అభిల‌ష‌ణీయ ఉప‌యోగానికి జాగ్ర‌త్త‌లు తీసుకొంటూనే మ‌రో ప‌క్క వ‌న‌రుల ఆధారిత అభివృద్ధి విధానాల దిశ‌గా ముందుకు పోతున్నాం. అంతేకాదు, మేము బ‌డ్జెట్ ఆధారిత‌మైన అభివృద్ధి విధానాల విష‌యంలో ప్రాధాన్యాన్ని ఇస్తున్నాం. బ‌డ్జెట్ లో మా ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన సంస్క‌ర‌ణ‌లు మ‌రియు బ‌డ్జెట్‌తో ముడిప‌డిన ఆలోచ‌నా స‌ర‌ళిని మేము సంస్క‌రించిన తీరు.. ఇవి దేశంలో ఒక కొత్త ప‌ని సంస్కృతిని అభివృద్ధిప‌ర‌చ‌డ‌మే కాకుండా సామాజిక‌, ఆర్థిక జీవ‌నంలో ప‌రివ‌ర్త‌న‌కు బాట పరచాయి.

ప్ర‌స్తుతం రైల్వే బ‌డ్జెట్ అనేది సాధార‌ణ బ‌డ్జెట్ లో ఒక భాగంగా మారింది. ఇంత‌క్రితం ఉన్న‌ ప్ర‌ణాళిక‌, ప్ర‌ణాళికేత‌ర అనే ఒక కృత్రిమ‌మైన గోడ‌ ను మేము ప‌గుల‌గొట్టాం. బ‌డ్జెట్ ను స‌మ‌ర్పించే కాలాన్ని కూడా ఒక నెల రోజులు ముందుకు జ‌రిపాం. ఈ నిర్ణ‌యాల‌న్నింటి కార‌ణంగా విభాగాల‌కు కేటాయించే సొమ్మును వాటికి నిర్ణీత కాలాని కంటే ముందుగానే ఇవ్వ‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం విభాగాలు ఆయా ప‌థ‌కాల‌ను అమ‌లుప‌ర‌చ‌డానికి మ‌రింత వ్య‌వ‌ధిని చిక్కించుకొన్నాయి. వ‌ర్షాకాలం కార‌ణంగా ప‌నుల అమ‌లులో జ‌రుగుతున్న జాప్యం గ‌ణ‌నీయంగా తగ్గింది. ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చే స్వ‌రూపాత్మ‌క సంస్క‌ర‌ణలు మ‌రియు విధాన ప‌ర‌మైన చ‌ర్య‌లు ఏవైనా స‌రే దేశంలో వ్య‌వ‌సాయ‌దారులు, పేద ప్ర‌జ‌లు, షెడ్యూల్డు కులాలు మ‌రియు వెనుక‌బ‌డిన స‌ముదాయాలు, ఇంకా స‌మాజంలోని అట్ట‌డుగు వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల్సిందే.

మిత్రులారా, మ‌న బ‌డ్జెట్‌ వ్య‌యానికి ప‌రిమిత‌మైన‌టువంటిది కాదు. మ‌న బ‌డ్జెట్ కేవ‌లం ఉత్ప‌త్తికి ప‌రిమిత‌మైంది కానే కాదు. మ‌న బ‌డ్జెట్ దృష్టి అంతా కూడా ఫ‌లితాల‌పై శ్ర‌ద్ధ‌తో కూడుకొన్న‌ది. మేము 2019 క‌ల్లా అంద‌రికీ విద్యుత్తును మరియు 2022 క‌ల్లా అంద‌రికీ గృహ వ‌స‌తి క‌ల్ప‌న‌ కోసం కసరత్తును ఇప్ప‌టికే మొద‌లుపెట్టాం. ఈ సంవ‌త్స‌రం బ‌డ్జెట్ లో రెండు ప‌థ‌కాలపై కృషిని వేగ‌వంతం చేయ‌డ‌మైంది. ఆ రెండు ప‌థ‌కాలు ఏమిటంటే, ‘అంద‌రికీ శుభ్ర‌మైన ఇంధ‌నం’ మ‌రియు ‘అంద‌రికీ ఆరోగ్య ర‌క్ష‌ణ’ అనేవే. మేము ఉజ్జ్వ‌ల ప‌థ‌కంలో భాగంగా పేద కుటుంబాల‌కు ఉచితంగా గ్యాస్ క‌నెక్ష‌న్ లను అందించే ల‌క్ష్యాన్ని అయిదు కోట్ల నుండి ఎనిమిది కోట్ల కుటుంబాల‌కు పెంచాము. భార‌త‌దేశంలోని మొత్తం దాదాపు 25 కోట్ల కుటుంబాల‌లోకీ ఎనిమిది కోట్ల కుటుంబాలు ఉచిత గ్యాస్ క‌నెక్ష‌న్‌లను పొంద‌నున్నాయి. ఇవి కేవ‌లం ప‌థ‌కాలు కావు; మేము ఏ దిశ‌గా సాగుతున్న‌దీ ఈ పథకాలు వెల్ల‌డి చేస్తాయి. దేశంలో పేద‌ల‌లోకెల్లా నిరుపేద‌ల యొక్క సామాజిక మ‌రియు ఆర్థిక సంక్షేమం, ఇంకా సామాజిక, ఆర్థిక స‌మ్మిళితం అనే ల‌క్ష్యాలు మా బ‌డ్జెట్ కు ప్రాతిప‌దిక‌గా నిలిచిన సంగ‌తిని మీరు గ‌మ‌నించి ఉంటారు. ‘జ‌న్‌ ధ‌న్ యోజ‌న‌’, ‘స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్‌’, ‘స్కిల్ ఇండియా’, ‘డిజిట‌ల్ ఇండియా’, ‘ముద్ర ప‌థ‌కం’, ‘స్టాండ్-అప్ ఇండియా’, ’స్టార్ట్-అప్ ఇండియా’ ల వంటి ప‌థ‌కాలు దేశం లోని పేద‌లకు, దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తికి, మ‌ధ్య‌త‌ర‌గ‌తికి, యువ‌జ‌నులకు మ‌రియు మ‌హిళ‌ల‌కు సాధికారిత‌ ను అందిస్తున్నాయి.

మిత్రులారా, మేము ప్ర‌క‌టించిన‌టువంటి ఆరోగ్య సంర‌క్ష‌ణ సంబంధిత బృహ‌త్ కార్య‌క్ర‌మం యావ‌త్ ప్ర‌పంచం దృష్టిని ఆక‌ట్టుకుంటోంది. ఇక్క‌డ దేశంలో బ‌డా కార్పొరేట్ సంస్థ‌లు మ‌రియు ఆ సంస్థ‌ల యాజ‌మాన్య ప్ర‌తినిధులు గుమికూడారు. యావ‌త్ కుటుంబానికి 5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆరోగ్య ర‌క్ష‌ణ బీమా ద‌క్కాలంటే, ప్రైవేటు కంపెనీల ఉద్యోగుల‌కు ఏ ర‌క‌మైన జీతం ఉండాలనే సంగతి మీకు తెలిసేవుంటుంది. సాధార‌ణంగా నెల‌కు 60-70 వేల రూపాయల నుండి 1-1.5 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆదాయ శ్రేణిలో ఉన్న ఉద్యోగులు ఈ మాదిరి బీమా ర‌క్ష‌ణ‌ను పొందుతారు.

మ‌రి దేశంలో పేద‌ల‌లోకెల్లా క‌డు పేద కుటుంబం ‘ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న’ లో భాగంగా రూ. 5 ల‌క్ష‌ల మేర‌కు ఆరోగ్య బీమా పొందేలా చూడాల‌ని నిర్ణ‌యించుకొన్న ప్ర‌భుత్వమిది. సుమారు 10 కోట్ల కుటుంబాలు.. అంటే 50 కోట్ల‌కు పైగా ప్ర‌జానీకం దీని తాలూకు లాభాల‌ను పొంద‌బోతున్నాయి. ఈ ప‌థ‌కం దీర్ఘ‌కాల వ్యాధుల వ‌ల్ల ఎదుర‌య్యే అత్యంత భార‌మైన ఆర్థిక క‌ష్టాల దాడి బారి నుండి ప్ర‌జ‌ల‌ను కాపాడ‌గ‌లుగుతుంది.

మేము ‘ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం’ లో భాగంగా దేశంలోని ప్ర‌ధాన‌మైన గ్రామ పంచాయ‌తులలో 1.5 ల‌క్ష‌ల వెల్‌నెస్ సెంట‌ర్ లను ప్రారంభించాల‌ని నిర్ణయించాం. ఈ నిర్ణ‌యాలు దేశ ఆరోగ్య సంర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను ఎలా మార్చ‌గ‌లుగుతాయో మీరు ఊహించ‌గలరు. దేశంలో త‌క్కువ వ్య‌య‌మ‌య్యే ఆరోగ్య సంర‌క్ష‌ణ సంస్థ‌లు, అలాగే కొత్తగా వైద్య వృత్తి లోకి వ‌చ్చిన అభ్య‌ర్థులు, కొత్త‌గా వ‌చ్చిన పారామెడిక్ స్టాఫ్ మ‌రియు ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగంతో అనుబంధం క‌లిగి ఉన్న ప్ర‌తి ఒక్క వ్య‌క్తికీ ఈ ప‌థ‌కం ఎంతో ముఖ్య‌మైందిగా మార‌బోతోంది.

దేశంలో విద్యా సంబంధ మౌలిక స‌దుపాయాల‌ను బ‌లోపేతం చేసేందుకు మేము ఒక కొత్త కార్య‌క్ర‌మాన్ని మొద‌లుపెట్టాం. ఒక ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చించ‌డం ద్వారా నాలుగు సంవ‌త్స‌రాల‌లో దేశంలో విద్యా వ్య‌వ‌స్థ‌ను మెరుగు ప‌రిచేందుకు ఒక ప‌థ‌కంతో మా ప్ర‌భుత్వం ముందుకు క‌దులుతోంది. అలాగే, దేశంలోని యువ‌జ‌నుల‌లో స్వ‌తంత్రోపాధిని ప్రోత్స‌హించేందుకు, మ‌రీ ముఖ్యంగా ఎమ్ఎస్ఎమ్ఇ రంగంలో కృషి చేస్తున్న న‌వ పారిశ్రామికులకు సంబంధించి ముద్ర ప‌థ‌కాన్ని మేము విస్త‌రిస్తూ పోతున్నాం. మ‌న దేశంలో ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన నాటి నుండి ఇంత‌వ‌ర‌కు దాదాపు 10.50 కోట్ల రుణాల‌ను మంజూరు చేయ‌డ‌మైంది. ఎటువంటి బ్యాంకు పూచీక‌త్తు లేకుండా 4.60 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల విలువైన రుణాల‌ను ప్ర‌జ‌ల‌కు అందించ‌డ‌మైంది. ఈ సంవ‌త్స‌రం బ‌డ్జెట్‌లో సైతం 3 ల‌క్ష‌ల కోట్ల రూపాయల విలువైన ‘ముద్ర‌’ రుణాల‌ను ఇవ్వాల‌ని మేము నిర్ణ‌యించాము.

ఈ విధ‌మైన ఉద్య‌మాలు దేశంలో పేద‌ల మ‌రియు మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల జీవ‌నాన్ని స‌ర‌ళ‌త‌రంగా మార్చే ప‌నికి మెరుగులు పెడుతున్నాయి. జీవించే ప‌ద్ధ‌తిని సుల‌భ‌త‌రం చేసే క్ర‌మం ఎంతగా ఇనుమ‌డిస్తే అంత ఎక్కువ సాధికారిత ప్ర‌జ‌ల‌కు సిద్ధిస్తుంది. ఎంత ఎక్కువ మంది ప్ర‌జ‌ల‌కు సాధికారిత సిద్ధిస్తే అంతగా మ‌న సామాజిక అభివృద్ధి మ‌రియు ఆర్థిక అభివృద్ధి అంత‌గా వేగ‌వంతం అవుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు నేను దేశ గ్రామీణ రంగాన్ని గురించి మాట్లాడుతున్నానంటే.. వ్య‌వ‌సాయ రంగం కోసం మ‌రియు గ్రామీణ ప్రాంతాల‌లో మౌలిక స‌దుపాయాల అభివృద్ధి కోసం 14 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు చేయాల‌ని ఈ సంవ‌త్స‌ర‌పు బ‌డ్జెట్ లో మేము నిర్ణ‌యించాం. ఈ నిధుల‌ను వ్య‌వ‌సాయ సంబంధ కార్య‌క‌లాపాల‌లో ఖ‌ర్చు చేయ‌నున్నాం. అయితే ఈ డ‌బ్బును గ్రామీణ ప్రాంతాల‌లో 3 ల‌క్ష‌ల కిలో మీట‌ర్ల‌కు పైగా పొడ‌వైన ర‌హ‌దారుల‌ను నిర్మించేందుకు; 51 ల‌క్ష‌ల నూత‌న గృహాల‌ను నిర్మించేందుకు, అలాగే సుమారు 2 కోట్ల కొత్త మ‌రుగుదొడ్ల నిర్మాణానికి, ఇంకా 1.75 కోట్ల పేద కుటుంబాల‌కు విద్యుత్తు క‌నెక్ష‌న్ లను స‌మ‌కూర్చ‌డానికి కూడా వినియోగించడం జ‌రుగుతుంది.

ఈ కృషి అంతా వ్య‌వ‌సాయ‌రంగ వృద్ధికి ఉత్తేజాన్ని అందించేదే కాకుండా, గ్రామీణ రంగంలో ల‌క్ష‌లాది ఉద్యోగాలకు కూడా బాటను ప‌రుస్తుంది. ఈ సంవ‌త్స‌రం మేము ల‌క్ష కోట్ల రూపాయ‌ల‌కు పైగా అవ‌స్థాప‌న బ‌డ్జెట్ ను పెంచాం. కొత్త వంతెన‌లు, కొత్త ర‌హ‌దారులు, కొత్త మెట్రో, కొత్త విమానాశ్ర‌యాలు ఇవ‌న్నీ ముంబ‌యి వంటి మేక్సిమమ్ సిటీ యొక్క బోలెడు ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డ‌మే కాకుండా, ప్ర‌త్యేకించి దేశం లోని మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌గ‌లుగుతాయి.

మిత్రులారా, అంత‌ర్జాతీయ స‌మాజంలో చోటుచేసుకొంటున్న హఠాత్ ప‌రిణామాల‌ను మ‌రియు అసంతృప్తిని, మ‌న ప్ర‌స్తుత అవ‌స‌రాల‌తో పాటు భావి ఆవ‌శ్య‌కత‌ల‌ను కూడా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకొని మ‌నం మ‌న భావి కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించుకోవ‌ల‌సి ఉంటుంది. మ‌రి దీనిని మ‌న‌మంతా క‌ల‌సి క‌ట్టుగా చేయాల్సివుంది. దేశం యొక్క అవ‌స‌రాల‌ను లెక్క‌ లోకి తీసుకొని, దేశ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను అర్థం చేసుకొని మ‌నం ప‌ని చేశామంటే ఒక ‘న్యూ ఇండియా’ ను ఆవిష్క‌రించాల‌న్న మ‌న క‌ల‌ను మ‌నం పండించుకోగ‌లుగుతాం. అది జ‌రిగిన‌ప్పుడు మాత్ర‌మే దేశంలో జ‌నాభా ప‌రంగా ఉన్న‌టువంటి సంఖ్యాప‌ర‌మైన లాభాంశానికి మ‌నం న్యాయం చేసిన వాళ్లం అవుతాం. ఈ విధ‌మైన ప‌విత్ర ప్ర‌తిజ్ఞ‌ల‌ను ఈ రాష్ట్రం యొక్క ల‌క్ష‌లాది ప్ర‌జ‌లు, ఈ రాష్ట్రానికి చెందిన అధికారి వర్గం, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నేరవేరుస్తాయ‌ని- అది కూడా నిర్ణీత‌మైన కాలం లోప‌ల ఈ ప‌నిని పూర్తి చేస్తాయ‌ని నేను ఆశాభావంతో ఉన్నాను.

ఇక నేను నా ఉప‌న్యాసాన్ని ముగించే ముందు మేగ్న‌ెటిక్ మ‌హారాష్ట్ర కార్యక్రమంలో తెర వెనుక కీల‌క పాత్ర‌ను పోషించిన వారికి, ఈ రాష్ట్రం యొక్క క‌ష్టించే ప‌ని చేసే ప్ర‌జ‌ల‌కు, మరియు పారిశ్రామిక‌వేత్త‌ల‌కు నా యొక్క కృత‌జ్ఞ‌త‌లను వ్య‌క్తం చేయ‌ద‌ల‌చుకొన్నాను.

ఈ కార్య‌క్ర‌మానికి నేను మ‌రొక్క సారి నా మ‌నఃపూర్వ‌క శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నాను. దేశ విదేశాల నుండి ఇక్క‌డ‌కు విచ్చేసిన ఉన్న‌తాధికారులంద‌రికీ నేను ఒక హామీని ఇవ్వ‌ద‌ల‌చాను. అది ఏమిటంటే, భార‌త ప్ర‌భుత్వం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో క‌లిసి ప‌ని చేయ‌డం ద్వారా దేశాభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉంటుంద‌నేదే. ప్ర‌పంచ జ‌నాభా లో ఆరింట ఒక వంతు మందికి ఏది ప్ర‌యోజ‌న‌క‌రం అవుతుందో అది ప్ర‌పంచానికి అంత‌టికీ కూడాను అంత ప్ర‌యోజ‌న‌కరం కాగ‌ల‌ద‌నేది మీరు ఇట్టే ఊహించగలరు.

అనేకానేక ధన్యవాదాలు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi Receives Kuwait's Highest Civilian Honour, His 20th International Award

Media Coverage

PM Modi Receives Kuwait's Highest Civilian Honour, His 20th International Award
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi remembers former PM Chaudhary Charan Singh on his birth anniversary
December 23, 2024

The Prime Minister, Shri Narendra Modi, remembered the former PM Chaudhary Charan Singh on his birthday anniversary today.

The Prime Minister posted on X:
"गरीबों और किसानों के सच्चे हितैषी पूर्व प्रधानमंत्री भारत रत्न चौधरी चरण सिंह जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। राष्ट्र के प्रति उनका समर्पण और सेवाभाव हर किसी को प्रेरित करता रहेगा।"