PM Modi lays Foundation Stone of Barrage over Narmada river, flags off Antyodaya Express
The Antyodaya Express is a commendable initiative by the Railway Ministry, says PM Modi
Neem coating of urea has benefitted farmers and choked it's theft and corruption: PM Modi
Barrage over Narmada river will enhance commute, ensure water availability to nearby areas & also help in environment protection: PM

నర్మద నది మీదుగా నిర్మించే భాడ్‌భూత్ ఆన‌క‌ట్ట‌ పనులకు శంకుస్థాపన సూచకంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ఒక ఫలకాన్ని ఆవిష్కరించారు. భరూచ్ లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాన మంత్రి పాల్గొని ఈ సందర్భంగా సూర‌త్ స‌మీపంలో ఉన్న ఉధ్ నా మ‌రియు బిహార్ లోని జ‌య‌న‌గ‌ర్‌ ల మ‌ధ్య న‌డిచే అంత్యోద‌య ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రారంభ సూచ‌కంగా ప‌చ్చ జెండా ను చూపారు. గుజ‌రాత్ న‌ర్మ‌ద ఫ‌ర్టిలైజ‌ర్ కార్పొరేష‌న్‌ కు చెందిన వేరు వేరు ప్లాంటుల ప్రారంభ సూచకంగానూ, శంకుస్థాప‌న సూచ‌కంగానూ ఏర్పాటు చేసిన శిలా ఫ‌ల‌కాల‌ను కూడా ఆయ‌న ఆవిష్క‌రించారు.

బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాన మంత్రి.. ‘అంత్యోద‌య ఎక్స్‌ప్రెస్’ అభినందనీయమైనటువంటి చొరవ అని, ఇది ప్రజలను కలుపుతుందని; మరీ ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లేదా బిహార్ లకు చెందివుండి, వారి ఇళ్ల నుండి బాగా దూరంగా ఉన్న ప్రాంతాలలో పనిచేస్తున్న వారికి సహాయకారిగా ఉంటుందని వివరించారు. ఉత్తర్ ప్రదేశ్ మరియు బిహార్ లకు చెందిన ప్రజలు ‘ఛఠ్ పూజ’కు ఇంటికి చేరుకోవడాన్ని ఇది సులభతరం చేయగలదని కూడా ఆయన అన్నారు.

యూరియాకు వేప పూతను పూయడం రైతులకు ప్రయోజనకారి అయింది, అవినీతి తో పాటు చౌర్యం ఆగిపోయిందని ప్రధాన మంత్రి తెలిపారు.

పశు పోషణలో గుజరాత్ వేసిన ముందంజ వ్యవసాయదారులకు ఎంతగానో తోడ్పడినట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. గుజరాత్ కు ఒక బృందాన్ని పంపించి, పశు ఆరోగ్య మేళాలను గురించి అధ్యయనం చేయించవలసిందిగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కు తాను సూచించినట్లు ఆయన వెల్లడించారు. అదే తరహా మేళాలను ఇటీవలే వారాణసీ లో నిర్వహించినట్లు, ఆ మేళాను దర్శించే అవకాశం తనకు లభించినట్లు కూడా ప్రధాన మంత్రి చెప్పారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi