భూటాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా భూటాన్ రాజు మాననీయ జిగ్మే ఖేసర్ నంగ్యాల్ వాంగ్‌చుక్ తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో’ను భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈ సాదర సత్కారంపై మాననీయ భూటాన్ రాజుకు శ్రీ మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ మేరకు భూటాన్ ప్రధాని ట్వీట్‌కు స్పందిస్తూ ప్రధానమంత్రి ఇచ్చిన వరుస ట్వీట్లలో-
“ధన్యవాదాలు ల్యోన్‌చెన్ @పీఎంభూటాన్! ఈ సాదర సత్కారంతో నా మనసు పులకించింది. ఇందుకుగాను మాననీయ భూటాన్ రాజుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మా భూటాన్ సోదరసోదరీమణుల ప్రేమాదరాలు పొందడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ నేపథ్యంలో శుభప్రదమైన భూటాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా వారందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
భూటాన్ విశిష్ట సుస్థిర ప్రగతి నమూనాతోపాటు లోతైన ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అనుసరిస్తున్నందుకు అభినందిస్తున్నాను. వరుస ‘డ్రక్ గ్యాల్పోలు’- వారి మాననీయ రాజులు తమ రాజ్యానికి అరుదైన గుర్తింపును ఆర్జించిపెట్టారు. అలాగే మన దేశాలమధ్య ఇరుగుపొరుగు ప్రత్యేక స్నేహబంధాన్ని పెంచి పోషించారు.
భారతదేశం సదా భూటాన్‌ను అత్యంత సన్నిహిత మిత్రుడుగా, పొరుగు దేశంగా పరిగణిస్తుంది. ఆ మేరకు వీలైన ప్రతి మార్గంలోనూ మేం భూటాన్ ప్రగతి పయనానికి మద్దతు కొనసాగిస్తాం” అని పేర్కొన్నారు.
Thank you, Lyonchhen @PMBhutan! I am deeply touched by this warm gesture, and express my grateful thanks to His Majesty the King of Bhutan. https://t.co/uVWC4FiZYT
— Narendra Modi (@narendramodi) December 17, 2021