డెన్ మార్క్ ప్రధాని మెటె ఫ్రెడరిక్సన్ గారి తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో సంభాషించారు.
ఫ్రెడరిక్సన్ గారు డెన్ మార్క్ ప్రధాని పదవి లో రెండో సారి నియమితులు కావడం పట్ల ఆమె కు ప్రధాన మంత్రి అభినందనల ను తెలియ జేశారు.
ఇండియా-డెన్ మార్క్ గ్రీన్ స్ట్రటిజిక్ పార్ట్ నర్ శిప్ లో ప్రగతి ని గురించి నేత లు ఇరువురు సమీక్ష జరిపారు. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాల పట్ల మరియు వృద్ధి చెందుతున్నటువంటి సహకారం ల పట్ల వారు సంతృప్తి ని వ్యక్తం చేశారు.
జి20 కి ప్రస్తుతం భారతదేశం అధ్యక్ష బాధ్యతల ను నిర్వహిస్తూ ఉన్న విషయాన్ని మరియు భారతదేశం కీలక ప్రాధాన్యాల ను గురించి ప్రధాని ఫ్రెడరిక్సన్ గారి దృష్టి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకు వచ్చారు. భారతదేశం చేపడుతున్నటువంటి కార్యక్రమాల ను ప్రధాని ఫ్రెడరిక్సన్ గారు ప్రశంసించడం తో పాటు గా ఆయా కార్యక్రమాల కు డెన్ మార్క్ పక్షాన పూర్తి సమర్థన ను కూడా తెలియ జేశారు.
భారతదేశం-డెన్ మార్క్ సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని వచ్చే సంవత్సరం లో సముచితమైన రీతి లో జరపాలి అని, మరి అలాగే ఉభయ పక్షాల మధ్య సంబంధాల ను మరింత గా విస్తరించుకోవడాని కి అవకాశం ఉన్న రంగాల ను అన్వేషించాలని ఇద్దరు నేత లు సమ్మతి ని వ్యక్తం చేశారు.