- ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఇరాన్ ఇస్లామిక్ గణతంత్రం యొక్క అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిమ్ రయీసీ
లు ఉజ్ బెకిస్తాన్ లోని సమర్ కంద్ లో ఎస్ సిఒ యొక్క దేశాధినేతల మండలి 22వ సమావేశం జరిగిన సందర్భం లో సమావేశమయ్యారు. 2021వ సంవత్సరం లో అధ్యక్షుడు శ్రీ రయీసీ పదవీబాధ్యతల ను స్వీకరించిన తరువాత, ప్రధాన మంత్రి మరియు అధ్యక్షుడు శ్రీ రయీసీ లు సమావేశం కావడం ఇదే తొలి సారి.
- సమావేశం సాగిన క్రమం లో, ఇద్దరు నేత లు ద్వైపాక్షిక సంబంధాల తో ముడిపడ్డ అనేక ముఖ్యమైనటువంటి అంశాల పైన చర్చ జరపడం తో పాటు గా వాటి ని బలపరచాలన్న ఆకాంక్ష ను వ్యక్తం చేశారు. భారతదేశం – ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలు చారిత్రిక మరియు నాగరకత సంబంధాల ద్వారా స్పష్టం అవుతూ వస్తున్నాయని, దీనిలో దేశ ప్రజల పరస్పర సంపర్కం అనేది కూడా మిళితం అయివుందని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు.
- శహీద్ బెహెస్తీ టర్మినల్, చాబహార్ నౌకాశ్రయం యొక్క అభివృద్ధి పరంగా చోటు చేసుకొన్న ప్రగతి ని నేతలు ఇరువురు సమీక్షించారు. ప్రాంతీయ సంధానం రంగం లో ద్వైపాక్షిక సహకారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని వారు నొక్కిచెప్పారు.
4. నేత లు ఇద్దరు ప్రాంతీయ ఘటనక్రమాల గురించి మరియు అంతర్జాతీయ ఘటనక్రమాల ను గురించి కూడా చర్చించారు. అఫ్ గానిస్తాన్ ప్రజల కు మానవీయ సహాయాన్ని అందజేయడం అనే విషయం లో భారతదేశం యొక్క ప్రాథమ్యాల ను గురించి మరియు ఒక శాంతిపూర్ణమైనటువంటి, స్థిరమైనటువంటి, ఇంకా సురక్షితమైనటువంటి అఫ్ గానిస్తాన్ ఆవిష్కారాన్ని సమర్థించే ప్రతినిధిత్వ మరియు అన్ని వర్గాల ను కలుపుకొని పోయే రాజకీయ వ్యవస్థ యొక్క ఆవశ్యకత ను గురించి ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. - జెసిపిఒఎ సంప్రతింపుల వర్తమాన స్థితి ని గురించి అధ్యక్షుడు శ్రీ రయీసీ ప్రధాన మంత్రి కి తెలియజేశారు.
- అధ్యక్షుడు శ్రీ రయీసీ వీలు ను చూసుకొని అతి త్వరలోనే భారతదేశం సందర్శన కు తరలి రావాలంటూ ప్రధాన మంత్రి ఆహ్వానించారు.
Held wide-ranging discussions with President Ebrahim Raisi. We talked about the growing India-Iran friendship and the scope to boost ties in sectors like energy, commerce and connectivity. pic.twitter.com/jrGI6ut7kM
— Narendra Modi (@narendramodi) September 16, 2022