పంపు నీరు సరిహద్దు గ్రామం అయినటువంటి హేమ్యా కు చేరుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రశంసించారు.
కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింహ్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘ఇది భారతదేశం లో ప్రతి ఒక్కరు గర్వపడేటట్టు చేసేదే. సరిహద్దు గ్రామాల ను అభివృద్ధి పరచే దిశ లో సాగుతున్న మన ప్రయాసల కు ఒక పెద్ద ఉత్తేజం లభించడాన్ని చూసి సంతోషం కలుగుతోంది. దశాబ్దాల పాటు, మన సరిహద్దు ప్రాంతాల ను చిన్నచూపు చూడడం జరిగింది; అయితే ప్రస్తుతం అభివృద్ధి పరంగా వాటి అవసరాల కు అగ్ర ప్రాధాన్యం దక్కుతోంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
This will make every Indian proud. It is heartening to see our efforts towards developing border areas getting a big impetus. For decades, our border areas were ignored but now their development needs are getting top priority. https://t.co/AvXDhOqgZP
— Narendra Modi (@narendramodi) May 12, 2023