భారతదేశం లోని లాజిస్టిక్స్ రంగం లో మార్పు ను తీసుకు రావడం లో యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ ఫేస్ ప్లాట్ ఫార్మ్ (యుఎల్ఐపి) యొక్క పాత్ర ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
వ్యాపారం మరియు వాణిజ్యం శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ట్వీట్ ను ప్రధాన మంత్రి వెల్లడి చేస్తూ -
‘‘లాజిస్టిక్స్ సంబంధి సింగిల్ విండో ప్లాట్ పార్మ్ ద్వారా సరకు ల చేరవేత లో ఇదివరకు ఎరుగనటువంటి మార్పు చోటు చేసుకొన్నది. దీని ద్వారా సమయం, ఖర్చు.. ఈ రెండూ ఆదా అవుతూ ఉండడం ఒక్కటే కాకుండా ఇది దేశం యొక్క స్వయం సమృద్ధి లోనూ ఎంతగానో సాయ పడేది గా ఉండగలదు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
लॉजिस्टिक्स के सिंगल विंडो प्लेटफॉर्म से सामान की ढुलाई में अभूतपूर्व बदलाव आया है। इससे न सिर्फ समय और लागत दोनों की बचत हो रही है, बल्कि यह देश की आत्मनिर्भरता में भी काफी मददगार होने वाला है। https://t.co/6bM10xbw95
— Narendra Modi (@narendramodi) July 10, 2023