అవంతీపోరా మరియు కాకాపోరా మధ్య గల రత్నీపోరా స్టేశన్ లో రైళ్ళ ను ఆపాలంటూ దీర్ఘ కాలం గా వినవస్తున్న డిమాండు ఆఖరు కు నెరవేరింది అంటూ రైల్ వే మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ సందేశం లో తెలియ జేసింది. ఈ స్టేశన్ లో రైళ్ళ ను ఆపడం మొబిలిటీ ని సులభం చేయడం ఒక్కటే కాకుండా ఆ ప్రాంతం లో రాక పోకల ను కూడా మెరుగు పరచగలుగుతుంది.
రైల్ వే ల మంత్రిత్వ శాఖ యొక్క ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘జమ్ము, కశ్మీర్ లో కనెక్టివిటీ మరింత బలపడుతుందన్న దృష్టి లో చూస్తే ఇది ఒక మంచి కబురు అని చెప్పాలి.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Good news for deepening connectivity in Jammu and Kashmir. https://t.co/9Nnk22GoJi
— Narendra Modi (@narendramodi) May 11, 2023