ప్రధానమంత్రి-సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన కోసం కోటికిపైగా కుటుంబాల నమోదుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హర్షం ప్రకటించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
‘‘ఇదెంతో అద్భుతమైన వార్త! ఈ పథకానికి శ్రీకారం చుట్టిన నెల రోజుల వ్యవధిలోనే కోటికిపైగా కుటుంబాలు ప్రధానమంత్రి-సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన కింద నమోదు చేసుకున్నాయి. ఆ మేరకు దేశం నలుమూలల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. అస్సాం, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిషా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ల రాష్ట్రాల పరిధిలో 5 లక్షలకుపైగా కుటుంబాలు నమోదు చేసుకున్నాయి. ఇంకా నమోదు చేసుకోనివారు pmsuryaghar.gov.in ద్వారా ఈ అవకాశాన్ని త్వరగా సద్వినియోగం చేసుకోవాలి’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
అలాగే ‘‘ఈ కార్యక్రమం వల్ల విద్యుదుత్పాదనకు భరోసా లభించడంతోపాటు గృహవిద్యుత్ చార్జీల భారం గణనీయంగా తగ్గడం ఖాయం. అంతేకాకుండా భూగోళం ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేసే పర్యావరణ హిత జీవనశైలిని (లైఫ్-LiFE) ఇది ఎంతగానో ప్రోత్సహిస్తుంది’’ అని స్పష్టం చేశారు.
Outstanding news!
— Narendra Modi (@narendramodi) March 16, 2024
In about a month since it was launched, over 1 crore households have already registered themselves for the PM-Surya Ghar: Muft Bijli Yojana.
Registrations have been pouring in from all parts of the nation. Assam, Bihar, Gujarat, Maharashtra, Odisha, Tamil…