ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరిగిన 2024 ఒలింపిక్స్ ఆదివారం(11.08.2024) ముగిసిన నేపథ్యంలో భారతీయ బృందం చేసిన ప్రయత్నాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
భారతీయ అథ్లెట్లను హీరోలుగా పేర్కొంటూ, వారి భవిష్యత్తు లక్ష్యాలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు 'ఎక్స్' మాధ్యమంలో ప్రధానమంత్రి పోస్ట్ చేస్తూ:
"పారిస్ ఒలింపిక్స్ ముగిసిన నేపథ్యంలో మొత్తం ఆటల్లో భారతీయ బృందమంతా చేసిన ప్రయత్నాలను అభినందిస్తున్నాను. అథ్లెట్లు అందరూ వారి అత్యుత్తమ ప్రదర్శనను ఇచ్చి ప్రతి భారతీయుడు వారి పట్ల గర్వపడేలా చేశారు. మన క్రీడా హీరోల రాబోయే లక్ష్యాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను."
As the Paris #Olympics conclude, I appreciate the efforts of the entire Indian contingent through the games. All the athletes have given their best and every Indian is proud of them. Wishing our sporting heroes the best for their upcoming endeavours.
— Narendra Modi (@narendramodi) August 11, 2024