జప్తు చేసినటువంటి 1,44,000 కిలోగ్రాముల మత్తు పదార్థాల ను ధ్వంసం చేయడం ద్వారా భారతదేశం మాదకద్రవ్యాల నిర్మూలన దిశ లో సాధించినటువంటి చరిత్రాత్మక కార్యసాధన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.
హోం శాఖ కేంద్ర మంత్రి శ్రీ అమిత్ శాహ్ ఒక ట్వీట్ లో ఈ కార్యసాధన ద్వారా, భారతదేశం కేవలం ఒక సంవత్సర కాలం లో 12,000 కోట్ల రూపాయల విలువైన ఒక మిలియన్ కిలోగ్రాము ల మత్తు పదార్థాల ను ధ్వంసం చేసిన ఒక ఆశ్చర్యకరమైన రికార్డు ను నెలకొల్పింది అని పేర్కొన్నారు.
‘మత్తు పదార్థాల వ్యాపారం మరియు జాతీయ భద్రత’ అంశాల పైన ఏర్పాటైన ప్రాంతీయ సమ్మేళనం లో ఈ అసాధారణమైన కార్యాన్ని నెరవేర్చుకోవడమైంది. ఇది మత్తు పదార్థాల కు తావు ఉండనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించాలన్న ప్రధాన మంత్రి స్వప్నాన్ని సాకారం చేసే దిశ లో హోం మంత్రిత్వ శాఖ యొక్క దృఢమైన మరియు అలుపెరుగని ప్రయత్నాల కు ఒక ఉదాహరణ గా నిలుస్తున్నది.
ఈ ట్వీట్ కు ప్రధాన మంత్రి తన సమాధానాన్ని ఇస్తూ -
‘‘చాలా బాగుంది. భారతదేశాన్ని మత్తు పదార్థాల అపాయం బారిన పడకుండా ఉంచాలన్న మన ప్రయాసల కు దీనితో బలం చేకూరుతుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Great! Adds strength to our efforts to make India free from the drugs menace. https://t.co/JT77u8aOqT
— Narendra Modi (@narendramodi) July 17, 2023