ఓపన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలిసి హయాం లో భాగం గా ఒడిశా లోని మహానది ఆన్‌శోర్ బేసిన్ లో మొట్టమొదటి అన్వేషణాత్మక బావి పురి-1 ని మొదలుపెట్టి శక్తి రంగం లో భారతదేశాన్ని స్వయంసమృద్ధం గా మలచే దిశ లో ఆయిల్ ఇండియా లిమిటెడ్ చేస్తున్నకృషి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
పెట్రోలియమ్ సహజవాయు శాఖ కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ సింహ్ పురి ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ -
‘‘ఇది ఉల్లేఖనీయమైనటువంటిది, శక్తి రంగం లో ఆత్మనిర్భరత ను సాధించే దిశ లో సాగుతున్నటువంటి మన ప్రయాసల ను సుదృఢపరుస్తుంది కూడాను.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
This is noteworthy and it invigorates our efforts towards being Aatmanirbhar in the energy sector. https://t.co/nc4uNMuDjc
— Narendra Modi (@narendramodi) February 17, 2023