వారాణసీ లో 644 కోట్ల రూపాయల ఖర్చు తో 3.85 కిమీ పొడవైన పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రోప్ వే నిర్మాణాన్ని చేపట్టడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
వారాణసీ లో 644 కోట్ల రూపాయల ఖర్చు తో 3.85 కిమీ పొడవైన పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రోప్ వే నిర్మాణ పనులు జరుగుతున్నాయి అంటూ రహదారి, రవాణా మరియు రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ వెల్లడించిన ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ -
‘‘విశ్వాసం మరియు సాంకేతిక విజ్ఞానం యొక్క అద్భుతమైన మిశ్రణం. వారాణసీ లో రూపు దిద్దుకొంటున్నటువంటి ఈ రోప్ వే తో భక్త జనుల కు యాత్రానుభవం మరింత ఉత్తేజకరం గా మారడం తో పాటు మరింత స్మరణీయం గా కూడా ఉంటుంది; దీని ద్వారా బాబా విశ్వనాథ్ ను దర్శించుకోవడం లో వారికి చాలా సౌకర్యవంతం గా కూడాను ఉంటుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
आस्था और टेक्नोलॉजी का अद्भुत संगम! वाराणसी में तैयार हो रहे इस रोप-वे से श्रद्धालुओं के लिए यात्रा का अनुभव बहुत रोचक और यादगार तो होगा ही, इससे बाबा विश्वनाथ के दर्शन में भी उन्हें बहुत सुविधा होगी। https://t.co/AMbBQsdEdr
— Narendra Modi (@narendramodi) March 29, 2023