అంతర్జాతీయ గ్యాస్ ధరల పెరుగుదల నుంచి భారత వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ దిశగా దేశీయ గ్యాస్ ధరలపై ప్రభావం పడకుండా సవరణను ఆమోదిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.
దీనిపై కేంద్ర పెట్రోలియం-సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ట్వీట్‌ను ప్రజలతో పంచుకుంటూ పంపిన సందేశంలో:
“సవరించిన దేశీయ గ్యాస్ ధరలకు సంబంధించి మంత్రిమండలి నిర్ణయం వినియోగదారులకు అనేక ప్రయోజనాలు కల్పిస్తుంది. దీన్ని ఈ రంగానికి సానుకూల పరిణామంగా పరిగణించాలి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
The Cabinet decision relating to revised domestic gas pricing has many benefits for the consumers. It is a positive development for the sector. https://t.co/CT1d0eLwra
— Narendra Modi (@narendramodi) April 7, 2023