పదకొండు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల లో సరిహద్దు రహదారుల సంస్థ (బిఆర్ఒ) నిర్మించిన 2,900 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన తొంభై మౌలిక సదుపాయాల సంబంధి ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ ప్రాజెక్టుల ను రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ దేశ ప్రజల కు ఈ రోజు న అంకితం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -
‘‘ఈ పథకాలు ప్రధానమైనవి; ఇవి సరిహద్దు ప్రాంతాల లో మౌలిక సదుపాయాల ను వృద్ధి చెందింప చేయడం లో ఎంతగానో తోడ్పడుతాయి.’’ అని పేర్కొన్నారు.
These are important projects which will go a long way in enhancing infrastructure in the border areas! https://t.co/3Q3AoiRuRO
— Narendra Modi (@narendramodi) September 12, 2023