ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ధన్వంతరి భగవానుని జయంతి, ఘనమైన మన సంస్కృతికి ఆయుర్వేదం అందిస్తున్న ప్రయోజనాలు, సేవలతో ముడిపడి ఉందని తెలిపారు. ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదం సమస్త మానవాళి ఆరోగ్యవంతమైన జీవితానికి మేలు చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
‘‘ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు. ఘనమైన మన సంస్కృతికి ఆయుర్వేదం అందిస్తున్న ప్రయోజనాలు, ఉపయోగాలతో భగవాన్ ధన్వంతరి జయంతి ముడిపడి ఉంది. ఆయుర్వేదం ప్రాముఖ్యాన్ని ప్రపంచమంతా గుర్తించింది. ఈ ప్రాచీన వైద్య విధానం సమస్త మానవాళి ఆరోగ్య జీవనానికి మేలు చేస్తుందని విశ్వసిస్తున్నాను.’’ అని శ్రీ మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
समस्त देशवासियों को आयुर्वेद दिवस की बहुत-बहुत शुभकामनाएं। भगवान धन्वंतरि की जन्म-जयंती का यह पावन अवसर हमारी महान संस्कृति में आयुर्वेद की उपयोगिता और उसके योगदान से जुड़ा है, जिसके महत्त्व को आज पूरी दुनिया मान रही है। मुझे विश्वास है कि चिकित्सा की यह प्राचीन पद्धति पूरी…
— Narendra Modi (@narendramodi) October 29, 2024