ఆరోగ్యాని కి, సంతోషాని కి మరియు సమృద్ధి కి సంకేతం గా ఉంటున్నటువంటి మరియు మంగళ ప్రదం అయినటువంటి పండుగ ‘ధన్ తేరస్’ సందర్భం లో దేశ ప్రజల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు. ధన్ తేరస్.
భగవాన్ ధన్వంతరి యొక్క ఆశీస్సుల కై శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు. పౌరులంతా ఆరోగ్యం గాను, సమృద్ధియుక్తం గాను మరియు సంతోషం గాను ఉండాలని, వారు అలా ఉంటే అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క దృఢసంకల్పం క్రొత్త శక్తి ని పుంజుకొంటూ ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. భగవాన్ ధన్వంతరి యొక్క ఆశీస్సుల కై శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.
ప్రధాన మంత్రి X మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -
‘‘ఆరోగ్యం మరియు సుఖం, ఇంకా సమృద్ధి ల ప్రతీక అయిన పండుగ ధన్ తేరస్ సందర్భం లో దేశం లో నా కుటుంబ సభ్యులు అందరికి అనేకానేక శుభాకాంక్షలు. భగవాన్ ధన్వంతరి యొక్క కృప తో మీరు అందరు ఎల్లప్పుడు స్వస్థత, సంపన్నత మరియు ప్రసన్నతల తో ఉందురుగాక. మీరు ఈ విధం గా ఉన్నప్పుడు, భారతదేశం యొక్క సంకల్పానికి క్రొత్త శక్తి అందుతూ ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.
देश के मेरे सभी परिवारजनों को आरोग्य एवं सुख-समृद्धि के प्रतीक पर्व धनतेरस की बहुत-बहुत बधाई। मेरी कामना है कि भगवान धन्वंतरि की कृपा से आप सभी सदैव स्वस्थ, संपन्न और प्रसन्न रहें, जिससे विकसित भारत के संकल्प को नई ऊर्जा मिलती रहे।
— Narendra Modi (@narendramodi) November 10, 2023