సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఏర్పాటు దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బీఎస్ఎఫ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ రక్షణలో కీలక పాత్రను పోషిస్తూ, ధైర్య-సాహసాలకు, అంకితభావానికి, అసామాన్య సేవకు ప్రతీకగా ఉంటున్నందుకుగాను బీఎస్ఎఫ్‌ను ఆయన ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశంలో ప్రధానమంత్రి ఈ కింది విధంగా పేర్కొన్నారు:
“సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఏర్పాటు దినోత్సవం సందర్భంగా బీఎస్ఎఫ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ రక్షణలో బీఎస్ఎఫ్ కీలక పాత్రను పోషిస్తూ, ధైర్య-సాహసాలకు, అంకితభావానికి, అసామాన్య సేవకు ప్రతీకగా ఉంటోంది. కంటికి కునుకనేదే ఎరుగకుండా అప్రమత్తంగా ఉంటూ, తన ధైర్య-సాహసాలతో మన దేశ ప్రజల సురక్షకు, భద్రతకు పాటు పడుతోంది.
Warm wishes to the Border Security Force on their Raising Day! The BSF stands as a critical line of defence, embodying courage, dedication and exceptional service. Their vigilance and courage contribute to the safety and security of our nation.@BSF_India pic.twitter.com/KeXEvgLhdB
— Narendra Modi (@narendramodi) December 1, 2024