హర్యానా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పొందుపరిచిన ఒక సందేశంలో  ప్రధాన మంత్రి ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘సమృద్ధ, చరిత్రాత్మక వారసత్వానికి హర్యానా రాష్ట్రం పేరెన్నిక గన్నది . ఈ రాష్ట్రం దేశాభివృద్ధికి గొప్ప తోడ్పాటును అందిస్తూ వస్తోంది. మన దేశ పురోగతిలో భాగస్వాములు అవుతున్న హర్యానా రాష్ట్రంలోని నా సోదరులు, సోదరీమణులందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ  శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. వారికి సుఖం, సమృద్ధి లతో పాటు మంచి ఆరోగ్యం కూడా దక్కాలని కోరుకుంటున్నాను.’’