మంగళప్రదం అయినటువంటి నవరాత్రి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. నవరాత్రి ఆరంభ తరుణం లో, దేవి శైలపుత్రి కి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థన లు కూడా నిర్వహించారు. ఆ దేవి కరుణ తో అందరి కి సంతోషం, ఆరోగ్యం మరియు అ దృష్టం ప్రాప్తించాలి అంటూ ఆయన ఆకాంక్షించారు.
ప్రధాన మంత్రి అనేక ట్వీట్ ల లో -
‘‘శక్తి యొక్క ఉపాసన తాలూకు మహాపర్వం అయినటువంటి నవరాత్రి కి మీ అందరి కి ఇవే అనేకానేక శుభకామన లు. నమ్మకం తో మరియు విశ్వాసం తో కూడినటువంటి పవిత్రమైన ఈ సందర్భం ప్రతి ఒక్కరి జీవనం లో కొత్త శక్తి ని మరియు కొత్త ఉత్సాహాన్ని నింపును గాక. జయ్ మాతా దీ.’’
‘‘వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్’’
దేవీ శైలపుత్రి యొక్క ఆరాధన తో పాటు గా నేటి నుండి నవరాత్రి కి శుభారంభం జరుగుతున్నది. ఆ దేవి కృప వల్ల ప్రతి ఒక్కరి జీవనం సుఖం తో, సౌభాగ్యం తో మరియు ఆరోగ్యం తో పరిపూర్ణం అగు గాక అని నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।
— Narendra Modi (@narendramodi) September 26, 2022
वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम् ।।
देवी शैलपुत्री की आराधना के साथ आज से नवरात्रि का शुभारंभ हो रहा है। मेरी कामना है कि उनकी कृपा से हर किसी का जीवन सुख, सौभाग्य और आरोग्य से परिपूर्ण हो। pic.twitter.com/Vh03672Q4M