వాల్మీకి జయంతి పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక సమానత్వం, సద్భావనపై మహర్షి వాల్మీకి ప్రబోధాలు నేటికీ మనను నడిపిస్తున్నాయని ప్రధాని అన్నారు. ఆయన తన సందేశాల ద్వారా మన నాగరికత, సంస్కృతిలో తరతరాలుగా చిరస్మరణీయుడుగా నిలిచారని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“వాల్మీకి జయంతి పవిత్ర సందర్భంగా దేశప్రజలందరికీ శుభాకాంక్షలు. సాంఘిక సమానత్వం, సద్భావనపై ఆయన అమూల్య ప్రబోధాలు నేటికీ భారతీయ సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తున్నాయి. మానవాళికి ఇచ్చిన సందేశాల ద్వారా మన నాగరికత, సంస్కృతిలో అమూల్య వారసత్వంగా ఆయన తరతరాలుగా నిలిచిపోతారు” అని ప్రధాని పేర్కొన్నారు.
देशवासियों को वाल्मीकि जयंती की अनंत शुभकामनाएं। सामाजिक समानता और सद्भावना से जुड़े उनके अनमोल विचार आज भी भारतीय समाज को सिंचित कर रहे हैं। मानवता के अपने संदेशों के माध्यम से वे युगों-युगों तक हमारी सभ्यता और संस्कृति की अमूल्य धरोहर बने रहेंगे। pic.twitter.com/wls3yN8ZfJ
— Narendra Modi (@narendramodi) October 28, 2023