హర్యానా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వ్యవసాయం, రక్షణవంటి ప్రధాన రంగాల్లో హర్యానా సదా దేశానికి గణనీయ తోడ్పాటునందించింది’’ అని ప్రధాని అన్నారు. అంతేకాకుండా నవ్యావిష్కరణల్లోనూ హర్యానా యువత సాధించిన పురోగతిని కూడా ఆయన ప్రశంసించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో హర్యానాలోని నా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. వ్యవసాయం, రక్షణ వంటి ప్రధాన రంగాల్లో ఈ రాష్ట్రం కృషి దేశానికి సదా ఆదర్శప్రాయంగా నిలిచింది. ఇక్కడి యువతరం వినూత్న ఆవిష్కరణలలో తమదైన ముద్ర వేస్తున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రతి పారామితిరీత్యా కొత్త రికార్డు సృష్టించడం కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
हरियाणा के अपने सभी परिवारजनों को राज्य के स्थापना दिवस पर मेरी हार्दिक शुभकामनाएं। इस प्रदेश ने हमेशा ही कृषि और रक्षा जैसे बड़े क्षेत्रों में देश को महत्वपूर्ण योगदान दिया है। यहां के युवा इनोवेशन की दुनिया में भी अपना परचम लहरा रहे हैं। मेरी कामना है कि विकास के हर मानदंड पर…
— Narendra Modi (@narendramodi) November 1, 2023