యోగిని మీరాబాయి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు ఘనంగా నివాళి అర్పించడంతోపాటు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను శ్రీకృష్ణుని అసమాన భక్తురాలిగా అభివర్ణిస్తూ, ఆమె ఆలపించిన భక్తి గీతాలు నేటికీ ఇంటింటా ప్రతిధ్వనిస్తున్నాయని పేర్కొన్నారు. ఆమె జీవితం యావత్ సమాజానికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘శ్రీ కృష్ణ భగవానునికి అంకితమైన భక్తురాలుగా మీరాబాయి జీవితం మన సమాజానికి స్ఫూర్తిదాయకం. ఆమె ఆలపించిన కీర్తనలు, ద్విపదలు ఇప్పటికీ ప్రతి ఇంటా మారుమోగుతున్నాయి. ప్రజలు వాటిని భక్తిపారవశ్యంతో ఆలపిస్తూ తన్మయత్వంలో మునిగిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఆమె జయంతి నేపథ్యంలో దేశంలోని నా కుటుంబ సభ్యులందరికీ అనేకానేక శుభాకాంక్షలు’’ అని ప్రధాని పేర్కొన్నారు.
भगवान श्री कृष्ण की अनन्य भक्त मीराबाई का जीवन हमारे समाज के लिये प्रेरणा है । उनके भजन और दोहे आज भी घर-घर को श्रद्धा और भक्ति से सुशोभित करते हैं। उनकी जन्म-जयंती पर देशभर के मेरे परिवारजनों को ढेरों शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) October 28, 2023