నాగ్ పుర్ మరియు బిలాస్ పుర్ ను కలిపే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న నాగ్ పుర్ రైల్ వే స్టేశన్ లో ఆకుపచ్చటి జెండా ను చూపి, ఆ రైలు ను ప్రారంభించారు.
ప్రధాన మంత్రి వందే భారత్ ఎక్స్ ప్రెస్ యక్క రైటు పెట్టెల ను పరిశీలించారు. ఆ రైలు పెట్టెల లో ప్రయానించేటప్పుడు లభించే సౌకర్యాలను ఆయన గమనించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ యొక్క లోకోమోటివ్ ఇంజను యొక్క నియంత్రణ కేంద్రాన్ని శ్రీ నరేంద్ర మోదీ చూశారు. నాగ్ పుర్ మరియు అజ్ నీ రైల్ వే స్టేశన్ ల అభివృద్ధి ప్రణాళికల ను కూడా ఆయన పరిశీలించారు. ఈ రైలు తో నాగ్ పుర్ నుండి బిలాస్ పుర్ వరకు పట్టే ప్రయాణ కాలం 7-8 గంటల నుండి తగ్గిపోయి 5 గంటల 30 నిమిషాలు అయిపోతుంది.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘నాగ్ పుర్ మరియు బిలాస్ పుర్ ల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రారంభ సూచక ఆకుపచ్చటి జెండా ను చూపెట్టాను. ఈ రైలు వల్ల కనెక్టివిటీ బాగా పెరిగిపోనుంది.’’ అని పేర్కొన్నారు.
Flagged off the Vande Bharat Express between Nagpur and Bilaspur. Connectivity will be significantly enhanced by this train. pic.twitter.com/iqPZqXE4Mi
— Narendra Modi (@narendramodi) December 11, 2022
नागपूर-बिलासपूर वंदे भारत एक्स्प्रेसला हिरवा झेंडा दाखवला. या ट्रेनमुळे दळणवळणात लक्षणीय वाढ होईल. pic.twitter.com/KLWGbnQwPr
— Narendra Modi (@narendramodi) December 11, 2022