ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ నుంచి రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళను ప్రారంభించారు. ఈ రెండు రైళ్లలో ఒకటి గోరఖ్ పూర్- లక్నో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కాగా, రెండోది జోధ్ పూర్- అహమ్మదాబాద్ (సబర్మతి) వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు. రూ.498 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ పునరభివృద్ధి పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని వెంట ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీ బెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, గోరఖ్ పూర్ ఎంపీ శ్రీ రవి కిషన్ ఉన్నారు. .
నేపథ్యం
గోరఖ్ పూర్- లక్నో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు అయోధ్య గుండా వెళుతుంది. రాష్ట్రంలో ముఖ్యమైన నగరాల గుండా వెళ్ళటం ద్వారా అనుసంధానత పెంచుతూ, పర్యాటకాభివృద్ధికి దోహదపడుతుంది. జోధ్ పూర్ – సబర్మతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ జోధ్ పూర్, అబూ రోడ్, అహమ్మదాబాద్ లాంటి ప్రముఖ స్థలాలకు అనుసంధానత పెంచుతుంది. ఆ విధంగా ఈ ప్రాంత సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసినట్టావుతుంది.
గోరఖ్ పూర్ రైల్వేస్టేషన్ పునరభివృద్ధి పనులకు రూ. 498 కోట్లు వెచ్చించటానికి సిద్ధమై శంకుస్థాపన చేయగా ఈ పనులు పూర్తయితే ప్రయాణీకులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.