ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచం లోనే అతి పెద్దదైన నదీ జల యాత్ర ఎమ్ వి గంగా విలాస్ కు ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా ప్రారంభ సూచక పచ్చజెండా ను చూపెట్టారు. దీనితో పాటే వారాణసీ లో టెంట్ సిటీ ని కూడా ఆయన ప్రారంభించారు. ఇదే కార్యక్రమం లో భాగం గా, ఒక వేయి కోట్ల రూపాయల కు పైగా విలువైన అనేక ఇతర అంతర్ దేశీయ జలమార్గ పథకాల ను ఆయన ప్రారంభించడం తో పాటుగా కొన్ని పథకాల కు శంకుస్థాపన కూడా చేశారు. నదీ జలాల లో విహారాని కి సంబంధించిన పర్యటన రంగాని కి ఉత్తేజాన్ని అందించాలనే ప్రధాన మంత్రి ప్రయత్నానికి అనుగుణం గా ఈ యొక్క సర్వీసు మొదలవడం తో, నదీ జలయాత్ర లకు సంబంధించిన ఇంతవరకు వినియోగం లోకి రానటువంటి సంభావ్యత లు ఇక మీదట ఆచరణ రూపాన్ని దాల్చనున్నాయి. మరి ఇది భారతదేశం లో నదీ విహార ప్రధాన పర్యటన ల తాలూకు ఒక సరికొత్త యుగాన్ని ఆవిష్కరించనుంది.
ప్రధాన మంత్రి సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భగవానుడు మహాదేవ్ ను స్తుతించారు. మంగళప్రదమైనటువంటి లోహ్ డీ పండుగ సందర్భం లో అందరికి అభినందనల ను తెలియ జేశారు. మన పండుగల లో దానాని కి, విశ్వాసాని కి, తపస్సు కు ప్రాముఖ్యాన్ని ఇవ్వడమైంది. అంతేకాకుండా, మన పర్వదినాల లో నదుల కు ఉన్నటువంటి పాత్ర ప్రముఖమైంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ అంశం నదీ సంబంధి జలమార్గాల తో ముడిపడిన పథకాల ను మరింత కీలకమైనవి గా మార్చివేస్తోంది అని ఆయన చెప్పారు. కాశీ నుండి డిబ్రూగఢ్ వరకు అతి దీర్ఘమైన నదీ జలయాత్ర ను ఈ రోజు న ప్రారంభించుకోవడం జరుగుతున్నది. ఈ ఘట్టం భారతదేశం లోని ఉత్తర ప్రాంతాల లో గల అనేక పర్యటన స్థలాల ను ప్రపంచ పర్యటక చిత్రపటం లో మరింత ఉన్నతమైన స్థానాని కి చేర్చనుంది అని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు న దేశ ప్రజల కు వారాణసీ లో, పశ్చిమ బంగాల్ లో, ఉత్తర్ ప్రదేశ్ లో, బిహార్ లో, అసమ్ లో అంకితం చేస్తున్న ఇతర ప్రాజెక్టులు ఒక వేయి కోట్ల రూపాయల విలువ కలిగినవి. ఇవి భారతదేశం లోని తూర్పు ప్రాంతాల లో పర్యటన కు మరియు ఉపాధి రంగాని కి అవకాశాల పరం గా దన్ను గా నిలవబోతున్నాయి అని ఆయన అన్నారు.
గంగానది కి భారతదేశం లో ప్రతి ఒక్క వ్యక్తి జీవనం లో ఉన్న కేంద్ర స్థానాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ఈ నది తీరాల చుట్టుపక్కల ప్రాంతాలు స్వాతంత్య్రం అనంతర కాలం లో అభివృద్ధి కి వెనుకపట్టున నిలచిపోవడం శోచనీయం అని ఆయన అన్నారు. ఇలా జరిగినందువల్ల, ఆయా ప్రాంతాల లో నివసించే జనాభా పెద్ద ఎత్తున తరలి వెళ్ళిపోవడానికి ఈ పరిణామం దారి తీసింది అని ఆయన అన్నారు. దురదృష్టకరమైన ఈ స్థితి ని పరిష్కరించడాని కి అనుసరిస్తున్నటువంటి రెండు విధాలైన వైఖరుల ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. ఒక పక్క నమామి గంగే ద్వారా గంగ శుద్ధి కి ప్రచార ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది, మరొక పక్క ‘అర్థ్ గంగ’ ను అమలు పరచడం జరుగుతోంది అని ఆయన చెప్పారు. ‘అర్థ్ గంగ’ లో భాగం గా, గంగ పారే రాష్ట్రాల లో ఆర్థికం గా చైతన్యశీలం అయినటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యల ను తీసుకోవడమైంది అని ఆయన తెలిపారు.
క్రూజ్ లో మొట్టమొదటిసారి గా యాత్ర లో పాలుపంచుకొనే విదేశీ పర్యటకుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘ఈ రోజు న భారతదేశం లో అన్నీ ఉన్నాయి; మీ ఊహ కు అందని అనేక అంశాలు సైతం ఇక్కడ ఉన్నాయి.’’ అని పేర్కొన్నారు. వ్యక్తుల ను వారి ప్రాంతం లేదా వారి ధార్మిక విశ్వాసం, లేదా వారి వర్గం, లేదా వారి దేశం ఎటువంటివి అన్నదానితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి ని విశాల హృదయం తో భారతదేశం ఆహ్వానిస్తున్నందువల్ల ఈ దేశాన్ని మనసు పెట్టి మాత్రమే అనుభూతి ని చెందవచ్చు అని కూడా ఆయన చెప్తూ, ప్రపంచం లో నలుమూల లకు చెందిన యాత్రికుల కు స్వాగతం పలికారు.
ఈ క్రూజ్ యాత్ర తాలూకు అనుభూతి ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, దీని లో ప్రతి ఒక్కరి కీ ఏదో ఒక విశిష్టత ఉందని వెల్లడించారు. ఆధ్యాత్మిక అనుభూతి ని కోరుకొనే వారు కాశీ, బోధ్ గయ, విక్రంశిల, పట్ నా సాహిబ్, ఇంకా మాజులీ వంటి ప్రదేశాల కు వెళ్ళవచ్చును. బహుళ దేశాల పర్యటనానుభూతి ని కోరుకొనే వారు బాంగ్లాదేశ్ లోని ఢాకా మీదు గా పయనించే అవకాశాన్ని పొందుతారు, భారతదేశం లోని ప్రాకృతిక వైవిధ్యాన్ని గమనించాలి అనుకొనే వారిని ఈ జల యాత్ర సుందర్ బన్స్ మరియు అసమ్ లోని అరణ్యాల తాలూకు విహారాన్ని ప్రసాదిస్తుంది అని ఆయన వివరించారు. ఈ యాత్ర 25 నదీ పాయల గుండా సాగుతుంది అని ప్రధాన మంత్రి చెప్తూ, భారతదేశం లో నదుల ను గురించిన అవగాహన ను ఏర్పరచుకోవాలి అనే తపన ఉన్నటువంటి వారికి ఈ యాత్ర చాలా మహత్వపూర్ణమైంది కాగలదన్నారు. భారతదేశం లో రక రకాల వంటకాల రుచుల ను ఆస్వాదించాలి అని కోరుకొనే వారి కి ఇది ఒక సువర్ణావకాశం అని కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘భారతదేశం యొక్క వారసత్వాన్ని మరియు భారతదేశం యొక్క ఆధునికత్వాన్ని ఈ యాత్ర సాక్షాత్కరింప చేస్తుంది. ’’ అని ప్రధాన మంత్రి అన్నారు. క్రూజ్ టూరిజమ్ తాలూకు ఈ నవ యుగం ఆరంభం కావడం తో దేశం లో యువతీయువకుల కు ఈ రంగం లో సరికొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయి అని ఆయన అన్నారు. ‘‘ఈ తరహా అనుభవాన్ని పొందేందుకు వివిధ దేశాల కు వెళ్ళినటువంటి విదేశీ యాత్రికులు, భారతీయ యాత్రికులు సైతం ఇక భారతదేశం లోని ఉత్తరాది ప్రాంతాల కు పయనించవచ్చును.’’ అని ప్రధాన మంత్రి అన్నారు. క్రూజ్ టూరిజమ్ కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం దేశం లోని ఇతర అంతర్ దేశీయ జల మార్గాల ను కూడా ఇదే విధమైనటువంటి అనుభూతుల ను అందించడం కోసం సన్నాహాలు జరుపుతూనే, అదే కాలం లో విలాసవంతమైన అనుభవం తో పాటు బడ్జెటు ను కూడా దృష్టి లో పెట్టుకోవడం జరుగుతున్నది అని ఆయన తెలిపారు.
భారతదేశం యొక్క వైశ్విక భూమిక ఎలాగెలాగ పెరుగుతూ పోతోందో, అదే తీరు న భారతదేశాన్ని సందర్వించాలన్న, భారతదేశాన్ని గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత కూడా అధికం అవుతోంది. ఈ కారణం గా, పర్యటన రంగం లో దశ తిరిగేటట్లు గా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. గడచిన 8 సంవత్సరాల లో దేశం లో పర్యటన రంగాన్ని విస్తరింప చేయడం కోసం విభిన్న చర్యల ను తీసుకోవడమైంది అని ఆయన అన్నారు. ధార్మిక ప్రదేశాల ను అభివృద్ధి పరచడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తరహా ప్రయాసల కు కాశీయే ఒక ప్రత్యక్ష ఉదాహరణ గా ఉంది అని ఆయన అన్నారు. సౌకర్యాల ను మెరుగు పరచినందువల్ల మరియు కాశీ విశ్వనాథ్ ధామ్ పునర్ నిర్మాణం పూర్తి అయిన అనంతరం కాశీ ని సందర్శిస్తున్న భక్తుల సంఖ్య పెరిగిపోయింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థ కు ఒక పెద్ద అండ గా ఉంది. అధునాతనత్వం, ఆధ్యాత్మిక వాదం మరియు విశ్వాసం కలబోసిన ఈ కొత్త టెంట్ సిటీ తీర్థయాత్రికుల కు ఒక నవ్యానుభూతి ని పంచుతుంది అని ఆయన అన్నారు.
దేశం లో 2014వ సంవత్సరం తరువాతి కాలం లో తీసుకొన్న నిర్ణయాలు, చేపట్టిన విధానాలు, అనుసరించిన దిశ ల ప్రతిబింబమే ఈనాటి ఈ కార్యక్రమం అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘21వ శతాబ్ది లో ఈ దశాబ్దం భారతదేశం లో మౌలిక సదుపాయాల పరివర్తన కు సంబంధించిన దశాబ్దం గా ఉంది. కొన్నేళ్ళ కిందట ఊహించనైనా ఊహించలేనటువంటి స్థాయి లో మౌలిక సదుపాయాల కల్పన కు భారతదేశం సాక్షి గా ఉన్నది.’’ అని ఆయన అన్నారు. ఇళ్ళు, టాయిలెట్ లు, ఆసుపత్రులు, విద్యుత్తు, నీరు, వంట గ్యాస్, విద్యాలయాలు వంటి సామాజిక మౌలిక సదుపాయాలు మొదలుకొని డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేదా రైలు మార్గాలు, హైవేస్ కానివ్వండి, జల మార్గాలు, వాయు మార్గాలు మరియు రహదారుల వంటి ఫిజికల్ కనెక్టివిటీ సంబంధి మౌలిక సదుపాయాల వరకు చూసుకొన్నప్పుడు, ఇవి అన్నీ కూడాను భారతదేశం సాధిస్తున్న సత్వర వృద్ధి కి బలమైన సూచికలు గా ఉన్నాయి. అన్ని రంగాల లో భారతదేశం అతి ఉత్తమం అయినటువంటి వాటి ని మరియు అతి పెద్దవి అయినటువంటి వాటి ని స్థాపిస్తోంది అని ఆయన అన్నారు.
నదీ జల మార్గాల కు సంబంధించినంత వరకు దేశం లో గతించిన కాలం లో ఘన చరిత్ర ఉన్నప్పటికీ 2014వ సంవత్సరాని కి పూర్వ కాలం లో ఈ మార్గాల ను ఉపయోగించుకోవడం అరకొర స్థాయి లోనే జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ప్రాచీనమైన శక్తి ని 2014వ సంవత్సరం అనంతర కాలం లో నవీన భారతదేశాన్ని దృష్టి లో పెట్టుకొని చక్కగా వినియోగించుకోవడం జరుగుతోంది. దేశం లోని పెద్ద పెద్ద నదుల లో జల మార్గాల ను అభివృద్ధి పరచడం కోసం ఒక నూతన చట్టం మరియు సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దుకొన్నాయి అని ప్రధాన మంత్రి వివరించారు. భారతదేశం లో 2014వ సంవత్సరం వరకు చూస్తే 5 జాతీయ జల మార్గాలు మాత్రమే ఉండగా ప్రస్తుతం దేశం లో 111 జాతీయ జల మార్గాలు ఏర్పాటు అయ్యాయి, దాదాపు గా రెండు డజన్ ల జలమార్గాల లో ఈ సరికే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి అని ప్రధాన మంత్రి తెలిపారు. అదే మాదిరి గా, నదీ జలమార్గాల గుండా సరకు రవాణా ఎనిమిదేళ్ళ క్రితం 30 లక్షల మెట్ రిక్ టన్నులు గా ఉన్నది కాస్తా మూడు రెట్లు మేరకు పెరిగింది అని ఆయన అన్నారు.
ఇక తూర్పు భారతం అభివృద్ధి కథనంలోకి వస్తే- తూర్పు భారతాన్ని వికసిత భారతదేశ వృద్ధి చోదకంగా మార్చడంలో నేటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ప్రధానమంత్రి అన్నారు. ఇది హల్దియా బహుళ రవాణా సాధన కూడలిని వారణాసితో సంధానిస్తుంది. అలాగే భారత-బంగ్లాదేశ్ అధికారిక మార్గం, ఈశాన్యంతోనూ అనుసంధానితమై ఉంది. దీంతోపాటు కోల్‌కతా ఓడరేవును-బంగ్లాదేశ్‌ను కూడా కలుపుతుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి బంగ్లాదేశ్ దాకా వ్యాపార సౌలభ్యం కల్పిస్తుంది.
సిబ్బందికి, నిపుణ శ్రామిక శక్తికి తగిన శిక్షణ అవసరమని నొక్కిచెబుతూ, అందుకే గువహటిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశామని ప్రధానమంత్రి తెలిపారు. అంతేకాకుండా నౌకల మరమ్మతు కోసం గువహటిలో కొత్త సౌకర్యాలను కూడా నిర్మిస్తున్నామని వెల్లడించారు. “ప్రయాణికుల నౌక కావచ్చు... రవాణా ఓడ కావచ్చు... అది ఏదైనా రవాణా, పర్యాటక రంగాలకు ఉత్తేజమిస్తాయి. అంతేకాకుండా వాటి సేవలతో ముడిపడి ఉన్న పరిశ్రమ మొత్తం కొత్త అవకాశాలను సృష్టిస్తుంది” అని ప్రధానమంత్రి చెప్పారు.
జలమార్గాలు పర్యావరణానికి ప్రయోజనకరమేగాక డబ్బు ఆదా చేయడంలోనూ తోడ్పడతాయని ఒక అధ్యయనాన్ని ఉటంకిస్తూ ప్రధానమంత్రి వెల్లడించారు. రహదారులతో పోలిస్తే జలమార్గాల నిర్వహణ వ్యయం రెండున్నర రెట్లు, రైల్వేలతో పోలిస్తే మూడింట ఒక వంతు తక్కువని ఆయన వివరించారు. జాతీయ రవాణా సదుపాయాల విధానాన్ని కూడా ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ- వేల కిలోమీటర్ల మేర జలమార్గాల నెట్‌వర్క్ అభివృద్ధి చేయగల సామర్థ్యం భారతదేశానికి ఉందన్నారు. మన దేశంలో 125కుపైగా నదులు, నదీ ప్రవాహాలు ఉన్నాయని, వీటిని సరకు రవాణాతోపాటు ప్రజల నౌకా ప్రయాణానికి వీలుగా అభివృద్ధి చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. అంతేగాక ఓడరేవుల చోదిత ప్రగతి విస్తరణకు ఉత్తేజం లభిస్తుందని తెలిపారు. ఆధునిక బహుళ-ఉపకరణ జలమార్గాల నెట్‌వర్క్ నిర్మాణం అవసరం ఎంతయినా ఉందన్నారు. అలాగే బంగ్లాదేశ్ సహా ఇతర దేశాల భాగస్వామ్యంతో ఈశాన్య ప్రాంతంలో జల సంధానం బలోపేతం కావడాన్ని వివరించారు.
చివరగా- భారతదేశంలో జలమార్గాల అభివృద్ధికి సంబంధించి నిరంతర ప్రగతి ప్రక్రియ గురించి వివరిస్తూ- “వికసిత భారతదేశ నిర్మాణానికి బలమైన అనుసంధానం అత్యంత అవశ్యం” అన్నారు. భారత నదీజల శక్తితో దేశంలోని వాణిజ్య, పర్యాటక రంగాలు కొత్త పుంతలు తొక్కుతాయని ప్రధాని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విహార ఓడ ప్రయాణం ఆహ్లాదకరంగా సాగాలంటూ యాత్రికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలోఅస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు శ్రీ హిమంతబిశ్వ శర్మ, శ్రీ యోగి ఆదిత్యనాథ్‌లతోపాటు కేంద్ర ఓడరేవులు-జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం... ఎంవీ గంగా విలాస్
ఎంవీ గంగా విలాస్ విహార నౌక ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో బయల్దేరి 51 రోజులపాటు 27 నదీ వ్యవస్థల గుండా 3,200 కిలోమీటర్లు ప్రయాణించి బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూగఢ్ చేరుతుంది. విలాసవంతమైన సౌకర్యాలుగల ఈ నౌకలో 3 డెక్‌లు, 18 సూట్లు ఉండగా 36 మంది పర్యాటకులు వెళ్లవచ్చు. కాగా, ఈ తొలి ప్రయాణంలో స్విట్జర్లాండ్ నుంచి 32 పర్యాటకులు ఆద్యంతం ప్రయాణిస్తారు.
ఈ విహార నౌక దేశంలోని అత్యుత్తమ సందర్శక ప్రదేశాల మీదుగా పయనిస్తూ ప్రపంచానికి సరికొత్త అనుభూతిని కల్పిస్తుంది. మొత్తం 51 రోజుల ప్రయాణంలో పర్యాటకులు 50 సందర్శక స్థలాల్లో పర్యటిస్తారు. వీటిలో వారసత్వ ప్రదేశాలు, జాతీయ పార్కులు, నదీలోయలుసహా వివిధ రాష్ట్రాల్లోని పాట్నా (బీహార్), సాహిబ్‌గంజ్ (జార్ఖండ్), కోల్‌కతా (పశ్చిమ బెంగాల్), గువహటి (అస్సాం) వంటి ప్రధాన నగరాలతోపాటు బంగ్లాదేశ్ రాజధా ఢాకా కూడా ఉన్నాయి. పర్యాటకులు భారత, బంగ్లాదేశ్‌ల కళ-సంస్కృతి-చరిత్ర, ఆధ్యాత్మికతతో మమేకమవుతూ అనుభవపూర్వక జలయానం చేయడానికి ఈ పర్యటన అవకాశమిస్తుంది. నదీ విహార నౌకా పర్యాటకానికి ఉత్తేజమివ్వాలన్న ప్రధానమంత్రి దార్శనికత మేరకు ఈ తరహా నౌకా యానానికిగల భారీ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం తలపెట్టింది. తదనుగుణంగానే ప్రస్తుత నౌకా విహార సేవద్వారా భారతనదీ పర్యాటక యుగంలో తొలి అడుగు పడింది.
వారణాషిలో టెంట్ సిటీ
గంగానది తీరాన టెంట్ సిటీ నిర్మాణంతో ఈ ప్రాంతంలో పర్యాటక రంగ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రణాళిక రూపొందించబడింది. ఈ ప్రాజెక్టు నగర ఘాట్‌లకు ఎదురుగా రూపుదిద్దుకుని, ముఖ్యంగా కాశీ విశ్వనాథ క్షేత్రం ప్రారంభోత్సవం నాటినుంచి పెరిగిన పర్యాటకుల సంఖ్యకు తగినట్లు వసతి సదుపాయాలు కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టుకు వారణాసి అభివృద్ధి ప్రాధికార సంస్థ ‘పీపీపీ’ విధానంతో రూపుదిద్దింది. పర్యాటకులు సమీపంలోని వివిధ ఘాట్‌ల నుంచి పడవల ద్వారా టెంట్ సిటీకి చేరుకుంటారు. ఇది ఏటా అక్టోబర్ నుంచి జూన్ దాకా పని చేస్తుంది. వర్షాకాలంలో నది నీటిమట్టం పెరుగుతుంది కాబట్టి మూడు నెలలపాటు మూసివేయబడుతుంది.
అంతర్గత జలమార్గాల ప్రాజెక్టులు
పశ్చిమ బెంగాల్‌లో హల్దియా బహుళ రవాణ ఉపకరణ కూడలిని ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. జల మార్గాల అభివృద్ధి ప్రాజెక్టు కింద ఇది రూపొందించబడింది. హల్దియా మల్టీ-మోడల్ టెర్మినల్‌కు ఏటా సుమారు 3 మిలియన్ టన్నుల (ఎంఎంటీపీఏ) సరకు రవాణా నిర్వహణ సామర్థ్యం ఉంది. అంతేకాకుండా బెర్తులు కూడా సుమారు 3,000 డెడ్‌వెయిట్ టన్నుల (డీడబ్ల్యూటీ) వరకు బరువుగల నౌకల నిర్వహణకు వీలుగా రూపొందించబడ్డాయి. ఘాజీపూర్ జిల్లాలోని సైద్‌పూర్, చోచక్‌పూర్, జమానియా, ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాల్లోని కన్స్‌పూర్‌లో నాలుగు తేలియాడే సామాజిక జెట్టీలను కూడా ప్రధాని ప్రారంభించారు. అలాగే పాట్నా జిల్లాలోని దిఘా, నక్తా దియారా, బర్హ్, పానాపూర్, బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోగల హసన్‌పూర్‌లో 5 కమ్యూనిటీ జెట్టీలకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో గంగా నది వెంబడి 60కిపైగా పామాజిక జెట్టీలు నిర్మితమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని స్థానిక సమాజాల జీవనోపాధి మెరుగుతోపాటు ఆర్థిక కార్యకలాపాల విస్తృతి వీటి లక్ష్యం. ఈ సామాజిక జెట్టీలు చిన్న రైతులు, మత్స్య యూనిట్లు, అసంఘటిత వ్యవసాయ ఉత్పత్తి యూనిట్లు, తోటల పెంపకందారులు, పూల వ్యాపారులు, కళాకారులతో కూడిన గంగానది లోతట్టు ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలపై దృష్టి సారిస్తూ, ప్రజల జీవనోపాధి మెరుగులో కీలక పాత్ర పోషిస్తాయి.
ఈశాన్య భారతం కోసం గువహటిలో సముద్ర నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇది ఈశాన్య భారతంలోని అసమాన ప్రతిభా సమూహాన్ని మెరుగుపరచడంలో ఇంది ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే అభివృద్ధి చెందుతున్న రవాణా పరిశ్రమలో మెరుగైన ఉపాధి అవకాశాలు అందిస్తుంది. వీటితోపాటు గువహటిలోని పాండు టెర్మినల్‌లో ఓడల మరమ్మతు సదుపాయంసహా ఎలివేటెడ్ రహదారికి ప్రధాని శంకుస్థాపన చేశారు. కోల్‌కతాలోని మరమ్మతు సదుపాయానికి ఓడలు తీసుకెళ్లడం, తిరిగి తీసుకురావడానికి ప్రతి ఓడకూ నెలకుపైగా సమయం పడుతుంది. అందువల్ల పాండు టెర్మినల్ వద్ద ఓడల మరమ్మతు సదుపాయంతో విలువైన సమయం కలిసివస్తుంది. అంతేకాకుండా రవాణా ఖర్చు కూడా ఆదా అవుతుంది కాబట్టి ఇది నగదుపరంగానూ భారీ పొదుపు కాగలదు. పాండు టెర్మినల్‌ను జాతీయ రహదారి-27కు అనుసంధానించే ప్రత్యేక రహదారి 24 గంటల సంధానానికి వీలు కల్పిస్తుంది.
Today, the world's longest river cruise - Ganga Vilas, has embarked on a journey between Kashi and Dibrugarh.
— PMO India (@PMOIndia) January 13, 2023
Due to this, many tourist places of Eastern India are going to benefit. pic.twitter.com/SlE4pvd2Or
गंगा जी हमारे लिए सिर्फ एक जलधारा भर नहीं है।
— PMO India (@PMOIndia) January 13, 2023
बल्कि ये भारत की तप-तपस्या की साक्षी हैं। pic.twitter.com/iJGA4OqXqE
India welcomes all our tourist friends from different parts of the world.
— PMO India (@PMOIndia) January 13, 2023
Come, explore the vibrancy of our country! pic.twitter.com/7LiA2beUkq
क्रूज जहां से भी गुजरेगा वहां विकास की एक नई लाइन तैयार करेगा। pic.twitter.com/HcKxwy3Cz3
— PMO India (@PMOIndia) January 13, 2023
This is the decade of transforming India's infrastructure. pic.twitter.com/bb0pyirjfd
— PMO India (@PMOIndia) January 13, 2023
नदी जलमार्ग, भारत का नया सामर्थ्य बन रहे हैं। pic.twitter.com/pGB1hrwK27
— PMO India (@PMOIndia) January 13, 2023