దిల్లీ-గాజియాబాద్-మేరఠ్ ఆర్ఆర్ టిఎస్ కారిడార్ ప్రయారిటీసెక్శను ను ఆయన ప్రారంభించారు
సాహిబాబాద్ ను దుహాయీ డిపో తో కలిపే నమో భారత్రేపిడ్ఎక్స్ ట్రేన్ కు ఆకుపచ్చ జెండా ను చూపారు
బెంగళూరు మెట్రో కు చెందిన ఈస్ట్-వెస్ట్ కారిడార్ లో రెండు మార్గాల ను దేశ ప్రజల కు అంకితం చేశారు
‘‘ప్రాంతీయ సంధానంలో ఒక చెప్పుకోదగిన మార్పు ను దిల్లీ-మేరఠ్ ఆర్ఆర్ టిఎస్ కారిడార్ తీసుకు వస్తుంది’’
‘‘భారతదేశం లో ఒకటో రేపిడ్ రైలు సేవ అయిన నమో భారత్ రైలు ఈ రోజు న మొదలైంది’’
‘‘న్యూ ఇండియా మరియు న్యూ ఇండియా యొక్క నూతన సంకల్పాల నవీన యాత్ర కు నమో భారత్ రైలు భాష్యం చెబుతున్నది’’
‘‘క్రొత్త మెట్రోసదుపాయాని కి గాను బెంగళూరు ప్రజలందరికీ అభినందనల ను తెలియ జేస్తున్నాను’’
‘‘భారతదేశం యొక్కఆశాజనక భవిష్యత్తు ప్రతిబింబాన్ని నమో భారత్ రైళ్ళ లో చూడవచ్చును’’
‘‘అమృత్ భారత్, వందే భారత్, ఇంకా నమో భారత్ .. ఈ మూడూ ఈ దశాబ్దం ముగిసేసరికల్లా ఆధునిక రైల్వేల కు ఒకచిహ్నం గా మారుతాయి’’
‘‘అది దిల్లీ కావచ్చు, యూపీ కావచ్చు లేక కర్నాటక కావచ్చు.. ప్రతి నగరం లో ఆధునికమైనటువంటి మరియు పచ్చదనం ప్రధానమైనటువంటి సార్వజనిక రవాణా ను ప్రోత్సహించడాని కి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది’’
‘‘మీరు నా కుటుంబం లో భాగం, ఆ విధం గా మీకే నా ప్రాధాన్యం. ఈ పని ని మీకోస్ చేయడం జరుగుతోంది. మీరు సంతోషం గా ఉంటే, నేను సంతోషం గా ఉంటాను. మీరు దక్షత కలిగిన వారైతే, దేశం దక్షత ను కలిగివుంటుంది’’

దిల్లీ-గాజియాబాద్-మేరఠ్ ఆర్ఆర్ టిఎస్ కారిడార్ లోని ప్రయారిటీ సెక్శను ను ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ లో సాహిబాబాద్ రేపిడ్ఎక్స్ స్టేశన్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. సాహిబాబాద్ ను దుహాయీ డిపో తో కలిపేటటువంటి నమో భారత్ రేపిడ్ఎక్స్ రైలు కు కూడా ఆయన ప్రారంభ సూచక ఆకుపచ్చటి జెండా ను చూపెట్టారు. దీని తో భారతదేశం లో రీజనల్ రేపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్ టిఎస్) కు నాంది పలికినట్లు అయింది. బెంగళూరు మెట్రో కు చెందిన ఈస్ట్-వెస్ట్ కారిడార్ తాలూకు రెండు భాగాల ను దేశ ప్రజల కు శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేశారు.

 

రీజనల్ రేపిడ్ ట్రేన్ ‘నమో భారత్’ లో ప్రధాన మంత్రి ప్రయాణించారు కూడాను.

 

జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు దేశ ప్రజల కు ఒక చరిత్రాత్మకం అయినటువంటి సందర్భం గా ఉంది. దీని కారణం భారతదేశం లో ఒకటో రేపిడ్ రైల్ సర్వీస్ అయినటువంటి, నమో భారత్ రైలు ను దేశ ప్రజల కు అంకితం చేయడం జరుగుతున్నది అని ఆయన అన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం దిల్లీ-గాజియాబాద్-మేరఠ్ ఆర్ఆర్ టిఎస్ కారిడార్ కు శంకుస్థాపన చేసిన ఘట్టాన్ని శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చారు. మరి అలాగే, సాహిబాబాద్ నుండి దుహాయీ డిపో వరకు ఉన్నటువంటి మార్గం లో ఈ కారిడార్ కార్యకలాపాలు ఈ రోజు న మొదలయ్యాయని ఆయన చెప్పారు. పునాది రాళ్ళ ను వేసినటువంటి ప్రాజెక్టుల ను ప్రారంభించాలి అన్నది ప్రభుత్వం యొక్క వచనబద్ధత గా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఆర్ఆర్ టిఎస్ లో మేరఠ్ మార్గం ఒకటిన్నర సంవత్సరాల తరువాత నిర్మాణం పూర్తి అయ్యాక, దానిని ప్రారంభించడాని కి తాను విచ్చేస్తానన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కొద్ది సేపటి క్రితం నమో భారత్ లో తాను ప్రయాణించిన సంగతి ని శ్రీ నరేంద్ర మోదీ తెలియజేస్తూ, దేశం లో రైల్ వేలు పరివర్తన కు లోనవడం సంతోషం కలిగించిందన్నారు. నవరాత్రి ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, నమో భారత్ కు కాత్యాయని దేవి మాత అనుగ్రహం ఉందన్నారు. క్రొత్త గా ప్రారంభం అయినటువంటి నమో భారత్ రైలు లో లోకో మోటివ్ పైలట్ లు మరియు యావత్తు సహాయక సిబ్బంది గా మహిళలే ఉన్నారన్న విషయాన్ని కూడా ఆయన వెల్లడి చేశారు. ‘‘నమో భారత్ అనేది దేశం లో నారీ శక్తి బలోపేతం కావడానికి ఒక సంకేతం గా ఉందని’’ శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. నవరాత్రి తాలూకు శుభ సందర్భం లో ఈ రోజు న మొదలైన ప్రాజెక్టుల కు గాను దిల్లీ, ఎన్ సిఆర్ మరియు ఉత్తర్ ప్రదేశ్ లోని పశ్చిమ ప్రాంతాల ప్రజల కు ప్రధాన మంత్రి అభినందనల ను తెలియ జేశారు. నమో భారత్ రైలు క్రొత్తదనాని కి మరియు వేగాని కి మారు పేరు అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. ‘‘నమో భారత్ రైలు న్యూ ఇండియా యొక్క మరియు న్యూ ఇండియా తాలూకు నూతన సంకల్పాల యొక్క నవీన యాత్ర ను నిర్వచిస్తున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

రాష్ట్రాల అభివృద్ధి లో భారతదేశం అభివృద్ధి ఇమిడివుందనేది తన నమ్మకం అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ఐటి కేంద్రం గా ఉన్న బెంగళూరు లో మెట్రో తాలూకు రెండు భాగాలు అక్కడి కనెక్టివిటీ ని మరింత గా బలపరుస్తాయి అని ఆయన అన్నారు. మెట్రో లో నిత్యం సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు రాక పోక లు జరుపుతున్నారని ఆయన తెలిపారు.

 

‘‘21 వ శతాబ్దాని కి చెందిన భారతదేశం ప్రతి రంగం లో ప్రగతి మరియు అభివృద్ధి ల స్వీయ గాథ ను వ్రాసుకొంటున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. చంద్రయాన్-3 ఇటీవల సఫలం అయిన సంగతి ని ఆయన ప్రస్తావిస్తూ, మరి జి-20 ని ఫలప్రదం గా నిర్వహించుకోవడం అనేది భారతదేశాన్ని యావత్తు ప్రపంచాని కి ఒక ఆకర్షణ కేంద్రం గా నిలిపింది అని కూడా పేర్కొన్నారు. ఏశియాన్ గేమ్స్ లో రికార్డు స్థాయి లో ఒక వంద కు పైచిలుకు పతకాల ను చేజిక్కించుకోవడం, భారతదేశం లో 5జి ప్రారంభం మరియు విస్తరణ, డిజిటల్ లావాదేవీ లు మునుపు ఎన్నడూ ఎరుగనంతటి స్థాయి లో నమోదు అవుతూ ఉండడం లను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. భారతదేశం లో తయారైన టీకామందులు ప్రపంచం లో కోట్ల కొద్దీ ప్రజల ప్రాణాల ను కాపాడిన విషయాన్ని సైతం శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. తయారీ రంగం లో భారతదేశం యొక్క వృద్ధి ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, మొబైల్ ఫోన్ లు, టీవీలు, లాప్ టాప్ లు మరియు కంప్యూటర్ లకు ఉద్దేశించిన తయారీ యూనిట్ లను భారతదేశం లో ఏర్పాటు చేయాలన్న ఆసక్తి తో బహుళ జాతీయ సంస్థలు ఉన్నాయని వివరించారు. ఫైటర్ జెట్ లు మరియు విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ లు సహా రక్షణ రంగ తయారీ ని గురించి సైతం ఆయన చెప్పారు. ‘‘నమో భారత్ రైలు కూడా భారతదేశం లోనే రూపుదిద్దుకొంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్లాట్ ఫార్మ్ స్ లో అమర్చిన స్క్రీన్ డోర్స్ కూడా ను భారతదేశం లోనే తయారు అయ్యాయి అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నమో భారత్ రైలు లో ధ్వని స్థాయి లు హెలికాప్టర్ లు మరియు విమానాల తో పోలిస్తే తక్కువ గా ఉన్నట్లు కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు.

 

నమో భారత్ అనేది భారతదేశం యొక్క భవిష్యత్తు కు ఒక ప్రతిబింబం గా ఉంది అని ప్రధాన మంత్రి నొక్కి పలికారు. అది నానాటికీ వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి తో కూడిన దేశం యొక్క మార్పు ను సూచిస్తోందని ఆయన అన్నారు. దిల్లీ-మేరఠ్ ల మధ్య ఈ 80 కిలో మీటర్ ల మార్గం ఒక ఆరంభం మాత్రమే అని ప్రధాన మంత్రి చెప్తూ, ఒకటో దశ అనేది దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, హరియాణా మరియు రాజస్థాన్ లకు చెందిన అనేక ప్రాంతాలు నమో భారత్ రైలు తో ముడిపడడాన్ని సాధ్యం చేస్తుందని వివరించారు. రాబోయే కాలం లో, కనెక్టివిటీ ని మెరుగు పరచడం కోసం, ఉద్యోగ కల్పన సంబంధి సరిక్రొత్త బాటల ను పరచడం కోసం ఇదే విధమైనటువంటి వ్యవస్థ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ప్రస్తుత శతాబ్ది లోని ఈ మూడో దశాబ్దం భారతీయ రైల్ వే స్ యొక్క పరివర్తన ప్రధాన దశాబ్ది గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘చిన్న చిన్న కలల ను కనే అలవాటు మరియు మెల్ల గా నడచే మనిషి ని కాను నేను. ఈ పదేళ్ళ కాలం ముగింపునకు వచ్చే సరికల్లా భారతదేశం లో రైళ్ళు ప్రపంచం లో మరే రైళ్ళ కు తీసిపోవు అని మీరు తెలుసుకొనేటట్లుగా నేటి యువతరాని కి ఒక పూచీకత్తు ను ఇవ్వదలచుకొన్నాను నేను’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సురక్ష లో, స్వచ్ఛత లో, సదుపాయాల లో, సమన్వయం లో, స్పందనాత్మకత లో మరియు సామర్థ్యం లో భారతీయ రైల్ వే ప్రపంచం లో ఒక క్రొత్త ఉన్నత స్థానాని కి ఎదుగుతుంది అని ఆయన అన్నారు. భారతీయ రైల్ వే వంద శాతం విద్యుతీకరణ లక్ష్యాని కి ఎంతో దూరం లో లేదు అని ఆయన అన్నారు. నమో భారత్, వందే భారత్, ఇంకా అమృత్ భారత్ రైల్ వే స్టేశన్ పథకం లో భాగం గా రైల్ స్టేశన్ ల ఉన్నతీకరణ ల వంటి కార్యక్రమాల ను గురించి ఆయన వివరించారు. ‘‘అమృత్ భారత్, వందే భారత్ మరియు నమో భారత్.. ఈ మూడు వర్తమాన దశాబ్ది ముగిసే సరికల్లా ఆధునిక రైల్ వే స్ కు ఒక గుర్తు గా నిలుస్తాయి’’ అని ఆయన అన్నారు.

 

మల్టీ-మాడల్ కనెక్టివిటీ కి సంబంధించిన ఆలోచన ను గురించి ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, దిల్లీ లోని సరాయ్ కాలే ఖాన్, ఆనంద్ విహార్, గాజియాబాద్, ఇంకా మేరఠ్ ల బస్సు స్టేశన్ లను, మెట్రో స్టేశన్ లను మరియు రైల్ వే స్టేశన్ లను నమో భారత్ వ్యవస్థ తో జతపరచడం జరుగుతున్నది అని వివరించారు.

 

   దేశ పౌరులందరి జీవన నాణ్యత, జీవన ప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం గురించి శ్రీ మోదీ ప్రస్తావించారు. ఇందులో భాగంగా వాయు నాణ్యత మెరుగు, చెత్త పోగు యార్డుల తొలగింపు, మెరుగైన విద్యా సౌకర్యాలు, ప్రజా రవాణా సేవల మెరుగుదల వగైరాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. దేశంలో ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుకు ప్రభుత్వం మునుపటికన్నా ఎక్కువగా పెట్టుబడులు పెడుతోందని, భూమి-ఆకాశం-సముద్ర రంగాల్లో సర్వతోముఖాభివృద్ధికి తాము చేస్తున్న కృషిని ప్రధాని వివరించారు. దేశీయ జలరవాణా వ్యవస్థలను ఉదాహరిస్తూ- వారణాసి నుంచి హల్దియా వరకూ గంగానది వెంబడి అతిపెద్ద జలమార్గం అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ నదులలో వందకుపైగా జలమార్గాలను అభివృద్ధి చేస్తున్నామని ప్రధానమంత్రి తెలిపారు. లోతట్టు జలమార్గాల ద్వారా రైతులు నేడు తమ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు రవాణా చేయవచ్చునని ఆయన అన్నారు. గంగావిలాస్‌ విహార నౌక ఇటీవలే 3,200 కిలోమీటర్లకుపైగా దూరం ప్రయాణించి, ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ నదీయానం చేసిన నౌకగా ప్రపంచ రికార్డు సృష్టించిందని ప్రధాని గుర్తుచేశారు. దేశంలోని ఓడరేవు మౌలిక సదుపాయాల విస్తరణ, ఆధునికీకరణను కూడా ఆయన ప్రస్తావించారు. దీనివల్ల కర్ణాటక వంటి పలు రాష్ట్రాలు ప్రయోజనం పొందుతున్నాయని పేర్కొన్నారు.

 

   భూతల రవాణా నెట్‌వర్క్‌ గురించి వివరిస్తూ- దేశంలో అత్యాధునిక ఎక్స్‌ప్రెస్‌వేల వలయం విస్తరణకు రూ.4 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నామని ప్రధాని వెల్లడించారు. ఇక రైల్వేల విషయంలో నమో భారత్ లేదా మెట్రోవంటి ఆధునిక రైళ్ల కోసం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలియజేశారు. ఢిల్లీలో మెట్రో నెట్‌వర్క్ విస్తరణ గురించి ప్రస్తావిస్తూ- ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, ఘజియాబాద్, లక్నో, మీరట్, ఆగ్రా, కాన్పూర్ వంటి నగరాలు ఇదే బాటలో నడుస్తున్నాయని ఆయన అన్నారు. కర్ణాటకలోనూ బెంగళూరు, మైసూరు నగరాల్లో మెట్రో విస్తరణ కొనసాగుతున్నదని తెలిపారు. దేశంలో గగనయాన అనుసంధానం గురించి చెబుతూ- గడచిన తొమ్మిదేళ్లలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపైందని పేర్కొన్నారు. భారత పౌర విమానయాన సంస్థల నుంచి 1000కిపైగా కొత్త విమానాలకు ఆర్డర్లు ఇవ్వబడ్డాయని ప్రధాని వెల్లడించారు. మరోవైపు అంతరిక్ష రంగంలోనూ భారత్‌ శరవేగంగా ‌ ్రరంపురోగమించడాన్ని ప్రధాని గుర్తుచేశారు. ఇటీవలే చంద్రునిపై పాదం మోపడంలో చంద్రయాన్ సాధించిన విజయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో 2040దాకా ప్రభుత్వం ఒక మార్గ ప్రణాళికను సిద్ధం చేసిందని పేర్కొంటూ- ఇందులో మానవ సహిత అంతరిక్షయానం సంబంధిత గగన్‌యాన్‌సహా భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు కూడా అంతర్భాగంగా ఉందని శ్రీ మోదీ తెలిపారు. “మనదైన  అంతరిక్ష నౌకలో చంద్రునిపై తొలి భారత వ్యోమగామిని దింపే రోజు ఎంతో దూరంలో లేదు” అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. దేశ యువతరం కోసం ఇవన్నీ చేపడుతున్నామని, వారి ఉజ్వల భవిష్యత్తుకు హామీ ఇస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు.

   పట్టణ కాలుష్యం తగ్గింపు అవసరాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. ఈ దిశగా దేశంలో విద్యుత్తు బస్సుల నెట్‌వర్క్‌ పెరుగుదలకు మార్గం సుగమం అవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రాలకు 10,000 విద్యుత్‌ బస్సుల సరఫరాకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో రూ.600 కోట్లతో 1300కుపైగా బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటిలో ఇప్పటికే 850కిపైగా బస్సులు దేశ రాజధానిలో నడుస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా బెంగళూరులోనూ 1200కుపైగా బస్సులు నడిపేందుకు కేంద్రం రూ.500 కోట్లదాకా ఆర్థిక సహాయం అందిస్తున్నదని తెలిపారు. “ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లేదా కర్ణాటక… రాష్ట్రం ఏదైనా, ప్రతి నగరంలో ఆధునిక, హరిత ప్రజా రవాణాను ప్రోత్సహించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది” అని ఆయన అన్నారు.

 

   దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి పౌర సౌలభ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధానమంత్రి తెలిపారు. మెట్రో లేదా నమో భారత్ వంటి రైళ్లు ప్రయాణికులకు జీవిత సౌలభ్యం కల్పిస్తాయన్నారు. దేశంలో నాణ్యమైన మౌలిక సదుపాయాలతో యువత, వ్యాపారవేత్తలు, శ్రామిక మహిళలకు కొత్త అవకాశాలు ఎలా అందివస్తాయో ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. “ఆస్పత్రుల వంటి సామాజిక మౌలిక సదుపాయాలు రోగులకే కాకుండా వైద్యులు, విద్యార్థులకూ ప్రయోజనం చేకూరుస్తాయి. డిజిటల్ మౌలిక సదుపాయాలు నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంతోపాటు నగదు లావాదేవీలు సజావుగా సాగే వీలు కల్పిస్తాయని ఆయన తెలిపారు.

   ప్రస్తుత పండుగల సమయంలో రైతులు, ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాల దిశగా కేంద్ర మంత్రిమండలి ఇటీవల తీసుకున్న నిర్ణయాలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు రబీలో వివిధ పంటలకు మద్దతు ధరల పెంపును వివరిస్తూ- కందులు క్వింటాల్‌కు రూ.425, ఆవాలు రూ.200, గోధుమలు రూ.150 చొప్పున భారీగా పెంచినట్లు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో 2014నాటికి క్వింటాలు రూ.1400గా ఉన్న గోధుమ కనీస మద్దతు ధర ఇప్పుడు రూ.2000 దాటిందన్నారు. అలాగే గత తొమ్మిదేళ్లలో కందులపై మద్దతు ధర రెండింతలు కాగా, ఆవాలకు క్వింటాల్‌పై రూ.2600 పెరిగిందని ఆయన వివరించారు. “రైతులకు పంట సాగు వ్యయంకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువగా మద్దతు ధర ఇవ్వడంపై మా నిబద్ధతకు ఇదే నిదర్శనం” అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు రైతులకు అందుబాటు ధరలో యూరియా లభ్యత దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ మేరకు అంతర్జాతీయ విపణిలో రూ.3,000దాకా ధర పలుకుతున్న యూరియాను దేశంలో రూ.300కన్నా తక్కువకే అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.2.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నదని ఆయన తెలిపారు.

   పంటకోత అనంతరం వరిగడ్డి లేదా దుబ్బువంటి అవశేషాల సద్వినియోగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రధాని ప్రస్తావించారు. దేశంలో తొమ్మిదేళ్ల కిందటితో పోలిస్తే ఇథనాల్‌  ఉత్పత్తిని పెంచేందుకు జీవ ఇంధన, ఇథనాల్ ఉత్పాదక పరిశ్రమలు ఏర్పాటు కాగా, ఇథనాల్‌ ఉత్పత్తి 10 రెట్లు పెరిగిందని ఆయన గుర్తుచేశారు. దీంతో ఇథనాల్ ఉత్పత్తి ద్వారా ఇప్పటివరకూ రైతులకు దాదాపు రూ.65 వేల కోట్లు అందాయని ప్రధాని తెలిపారు. “కేవలం పది నెలల్లోనే దేశంలోని రైతులకు రూ.18 వేల కోట్లకుపైగా అందాయి” అని వివరించారు. మీరట్-ఘజియాబాద్ ప్రాంత రైతుల గురించి మాట్లాడుతూ ఈ  ఏడాది కేవలం 10 నెలల్లోనే  ఇథనాల్ ఉత్పత్తిపై రూ.300 కోట్లకుపైగా చెల్లించినట్లు ఆయన వెల్లడించారు.

   ఉజ్వల లబ్ధిదారులకు వంటగ్యాస్ ధరను రూ.500 దాకా తగ్గింపు, 80 కోట్ల మందికిపైగా ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, కేంద్ర ప్రభుత్వోద్యోగులు-పెన్షనర్లకు 4 శాతం కరవు భత్యం/భృతి పెంపు, రైల్వల్లో లక్షలాది గ్రూప్ ‘బి, సి’ ఉద్యోగులకు దీపావళి బోనస్ వంటి పండుగ కానుకలు ప్రకటించడాన్ని కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. “ఈ చర్యలతో విపణిలో  ఆర్థిక కార్యకలాపాలకు ప్రోత్సాహం లభిస్తుంది కాబట్టి మొత్తం ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుంది” అని ఆయన అన్నారు. చివరగా- ఇటువంటి కీలక నిర్ణయాలవల్ల ప్రతి కుటుంబంలో పండుగ ఆనందం ఇనుమడిస్తుందని ప్రధాని ఉద్ఘాటించారు. దేశంలోని ప్రతి కుటుంబంలో పండుగల వేళ ఆనందోత్సాహాలు మిన్నంటుతాయి అన్నారు. “మీరంతా నా కుటుంబం.. కాబట్టే నా ప్రాధాన్యం మీరే.. ఇదంతా మీ సంక్షేమం కోసమే.. మీరంతా సంతోషంగా ఉంటేనే నేనూ ఆనందంగా ఉంటాను. మీరందరూ సమర్థులైతే దేశం కూడా సమర్థంగా ముందంజ వేస్తుంది” అంటూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.

 

   ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి తదితరులతోపాటు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య కూడా పాల్గొన్నారు.

ఢిల్లీ-ఘజియాబాద్‌-మీరట్‌ కారిడార్

   ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ‘ఆర్‌ఆర్‌టిఎస్‌’ కారిడార్‌లో భాగమైన 17 కిలోమీటర్ల ప్రధాన మార్గం సాహిబాబాద్ నుంచి ‘దుహై డిపో’ దాకా సాగుతుంది. ఇది ఘజియాబాద్, గుల్ధర్, దుహై స్టేషన్‌లను అనుసంధానిస్తుంది. కాగా, ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌కు ప్రధానమంత్రి 2019 మార్చి 8న శంకుస్థాపన చేశారు.

   ప్రపంచ స్థాయి రవాణా మౌలిక సదుపాయాల కల్పనతో దేశంలో ప్రాంతీయ అనుసంధానం పరివర్తనాత్మకం కావాలన్న ప్రధాని దూరదృష్టికి అనుగుణంగా ఈ ‘ప్రాంతీయ వేగవంతమైన రవాణా వ్యవస్థ (ఆర్‌ఆర్‌టిఎస్‌) రూపొందించబడింది. ఇది రైలు ఆధారిత, సెమీ-హైస్పీడ్‌, అధిక రద్దీగల ప్రయాణిక రవాణా వ్యవస్థ. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా రూపొందించబడిన పరివర్తనాత్మక, ప్రాంతీయాభివృద్ధి ప్రణాళిక ఇది. ప్రతి 15 నిమిషాలకూ ఒకటి వంతున అంతర-నగర ప్రయాణానికి రైళ్లు అందుబాటులో ఉంటాయి. అవసరాన్ని బట్టి ఇవి ప్రతి 5 నిమిషాలకూ ఒకటి వంతున అందుబాటులోకి రాగలవు.

 

   జాతీయ రాజధాని నగర ప్రాంతంలో మొత్తం 8 ‘ఆర్‌ఆర్‌టిఎస్‌’ కారిడార్ల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. వీటిలో ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ సతో తొలిదశలో మూడు కారిడార్ల పూర్తికి ప్రాధాన్యం ఇవ్వబడింది. ఇందులో ఢిల్లీ-గురుగ్రామ్-ఎస్‌ఎన్‌బి-అల్వార్ కారిడార్; ఢిల్లీ-పానిపట్ కారిడార్ కూడా ఉన్నాయి. ఈ మూడింటికిగాను ప్రస్తుతం ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ‘ఆర్‌ఆర్‌టిఎస్‌’ రూ.30,000 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించబడుతోంది. దీనిద్వారా ఢిల్లీ-మీరట్‌ మార్గంలో ప్రయాణించే రైలు ఘజియాబాద్, మురాద్‌నగర్, మోదీనగర్ పట్టణ కేంద్రాల మీదుగా గంటలోపే గమ్యం చేరుతుంది.

   దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ‘ఆర్‌ఆర్‌టిఎస్‌’ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా పరిగణించదగిన అత్యాధునిక ప్రాంతీయ రవాణా సౌలభ్యం కల్పిస్తుంది. అలాగే సురక్షిత, విశ్వసనీయ, ఆధునిక అంతర-నగర ప్రయాణ సదుపాయాలను కల్పిస్తుంది. ‘ఆర్‌ఆర్‌టిఎస్‌’ నెట్‌వర్కులోని రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, బస్సు సేవలు తదితరాలతో కూడిన విస్తృత బహుళ-రవాణా సాధనాల ఏకీకరణ ‘పిఎం గతిశక్తి’ బృహత్‌ ప్రణాళికకు అనుగుణంగా ఉంటుంది. ఇలాంటి పరివర్తనాత్మక ప్రాంతీయ రవాణా పరిష్కారాలతో ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ఉపాధి, విద్య, ఆరోగ్య సంరక్షణ అవకాశాల సౌలభ్యం పెరుగుతుంది. ముఖ్యంగా వాహనాల రద్దీ, వాయు కాలుష్యం గణనీయంగా తగ్గించడంలో ఈ వ్యవస్థ ఎంతగానో దోహదం చేస్తుంది.

బెంగళూరు మెట్రో

   ప్రధానమంత్రి అధికారికంగా జాతికి అంకితం చేసిన రెండు మెట్రో మార్గాలు బైయప్పనహళ్లి నుంచి కృష్ణరాజపుర, కెంగేరి నుంచి చల్లఘట్ట దాకా ప్రయాణ సౌలభ్యం కల్పిస్తాయి. అయితే, అధికారిక ప్రారంభోత్సవం కోసం వేచి చూడకుండానే ఈ రెండు మార్గాలనూ  ప్రజా సౌకర్యార్థం 2023 అక్టోబరు 9 నుంచే ప్రారంభించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
25% of India under forest & tree cover: Government report

Media Coverage

25% of India under forest & tree cover: Government report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi