ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్ర లోని సంగోలా నుంచి పశ్చిమ బంగాల్ లోని శాలిమార్ కు నడిచే వందో కిసాన్ రైలు కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజున జెండా ను చూపి, ఆ రైలును ప్రారంభించారు. ఈ సందర్భం లో కేంద్ర మంత్రులు శ్రీ నరేంద్ర సింహ్ తోమర్, శ్రీ పీయూష్ గోయల్ లు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, దేశ రైతుల ఆదాయాన్ని పెంచే దిశలో కిసాన్ రైలు సర్వీసు ఒక పెద్ద అడుగు అని అభివర్ణించారు. కరోనా మహమ్మారి కాలంలో సైతం గత నాలుగు నెలల లో 100 కిసాన్ రైళ్ళను ప్రారంభించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విధమైన సేవ వ్యవసాయానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ లో ఒక పెద్ద మార్పును కొని తెస్తుందని, అంతేకాకుండా దేశ శీతలీకరణ సదుపాయం కలిగిన సరఫరా వ్యవస్థ తాలూకు శక్తిని కూడా పెంచుతుందని ఆయన అన్నారు. కిసాన్ రైలు ద్వారా సరకుల చేరవేతకు ఎలాంటి కనీస రాశి నిబంధనను ఖరారు చేయలేదని, అత్యంత చిన్న పరిమాణంలో ఉండే ఉత్పత్తి కూడా తక్కువ ధరకు పెద్ద బజారుకు సరైన విధంగా చేరగలుగుతుందని కూడా ఆయన అన్నారు.
కిసాన్ రైలు పథకం రైతులకు సేవ చేయాలన్న ప్రభుత్వ వచనబద్ధతను చాటడం ఒక్కటే కాకుండా, మన రైతులు కొత్త బాధ్యతలను అందుకోవడానికి ఎంత వేగంగా సన్నద్ధులు అవుతారనే దానికి కూడా ఒక నిదర్శనంగా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. రైతులు వారి పంటలను ప్రస్తుతం ఇతర రాష్ట్రాల లో కూడా అమ్ముకోగలుగుతారని, ఈ ప్రక్రియలో కిసాన్ రైల్ తో పాటు, వ్యావసాయక విమానాలు (కృషి ఉడాన్)లవి ప్రధాన పాత్ర అని ఆయన చెప్పారు. కిసాన్ రైలు అంటే అది త్వరగా పాడయిపోయే ఫలాలు, కాయగూరలు, పాలు, చేపల వంటి సరకులను పూర్తి భద్రతతో చేరవేసే ఒక చలనశీల శీతలీకరణ నిలవ సదుపాయం అని ఆయన అన్నారు. ‘‘భారతదేశం లో ఒక పెద్ద రైల్వే నెట్ వర్క్ స్వాతంత్య్రం రావడానికంటే ముందు నుంచీ ఉంది. శీతలీకరణ నిలవ సంబంధిత సాంకేతిక విజ్ఞానం కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ బలాన్ని కిసాన్ రైల్ మాధ్యమం ద్వారా సరైన విధంగా వినియోగించుకోవడం జరుగుతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
కిసాన్ రైలు వంటి సదుపాయం పశ్చిమ బంగాల్ కు చెందిన లక్షల కొద్దీ చిన్న రైతులకు ఒక భారీ సౌకర్యంగా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సౌకర్యం అటు రైతులకు, ఇటు స్థానికంగా చిన్న వ్యాపారస్తులకు కూడా అందుబాటులో ఉందని ఆయన చెప్పారు. ఇతర దేశాలకు చెందిన వ్యవసాయరంగ నిపుణులతో పాటు, అక్కడి కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని భారతదేశ వ్యవసాయరంగం లోకి తీసుకోవడం జరుగుతోందని ఆయన అన్నారు.
రైల్వే స్టేషన్ల పరిసరాల లో పెరిశబుల్ రైల్ కార్గో సెంటర్లను నిర్మించడం జరుగుతోంది. వాటిలో రైతులు వారి ఉత్పత్తిని నిలవ చేసే వీలు ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ పండ్లను, కాయగూరలను కుటుంబానికి అందించాలన్నదే ఈ ప్రయత్నంగా ఉంది. అదనపు ఉత్పత్తి రసం, పచ్చడి, సాస్, చిప్స్ వగైరాలను ఉత్పత్తి చేసే నవ పారిశ్రామికుల చెంతకు చేరాలి అని ప్రధాన మంత్రి అన్నారు.
నిలవ సౌకర్యంతో కూడిన మౌలిక సదుపాయాలను, ప్రోసెసింగ్ పరిశ్రమలకు పెద్దపీట వేయాలి అనేదే ప్రభుత్వ ప్రాధమ్యంగా ఉందని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఆ తరహా పథకాలను సుమారు 6500 సంఖ్యలో మెగా ఫూడ్ పార్క్స్, కోల్డ్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆగ్రో ప్రోసెసింగ్ క్లస్టర్ లలో భాగంగా ఆమోదించడమైందని ఆయన అన్నారు. ఆత్మ నిర్భర్ అభియాన్ ప్యాకేజీలో భాగంగా సూక్ష్మ ఆహారశుద్ధి పరిశ్రమల కోసం 10,000 కోట్ల రూపాయలను మంజూరు చేయడమైంది అని ఆయన అన్నారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు, యువతీయువకుల భాగస్వామ్యం, సమర్ధనలే ప్రభుత్వ ప్రయత్నాలు సఫలం కావడానికి కారణమవుతాయని శ్రీ మోదీ అన్నారు. వ్యవసాయ ప్రధాన వ్యాపారాలు, వ్యవసాయ ప్రధాన మౌలిక సదుపాయాల కల్పన లలో మహిళా స్వయం సహాయ సమూహాలు వంటి సహకార సమూహాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పిఒ స్) వంటివి ప్రాధాన్యాన్ని పొందుతాయని ఆయన చెప్పారు. ఇటీవలి సంస్కరణలు వ్యవసాయ సంబంధ వ్యాపారం విస్తరించడానికి దారితీస్తాయని, వాటి తాలూకు అతి పెద్ద లబ్ధిదారులుగా ఈ సమూహాలు ఉంటాయని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడి ఈ సమూహాలకు సహాయం అందించాలన్న ప్రభుత్వ ప్రయత్నానికి మద్ధతుగా ఉండగలదని ఆయన చెప్పారు. “మేము భారతదేశ వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసే మార్గంలో ముందుకు సాగిపోతూనే ఉంటాము” అని ప్రధాన మంత్రి అన్నారు.
किसान रेल सेवा, देश के किसानों की आमदनी बढ़ाने की दिशा में भी एक बहुत बड़ा कदम है।
— PMO India (@PMOIndia) December 28, 2020
इससे खेती से जुड़ी अर्थव्वस्था में बड़ा बदलाव आएगा।
इससे देश की कोल्ड सप्लाई चेन की ताकत भी बढ़ेगी: PM
ये काम किसानों की सेवा के लिए हमारी प्रतिबद्धता को दिखाता है।
— PMO India (@PMOIndia) December 28, 2020
लेकिन ये इस बात का भी प्रमाण है कि हमारे किसान नई संभावनाओं के लिए कितनी तेजी से तैयार हैं।
किसान, दूसरे राज्यों में भी अपनी फसलें बेच सकें, उसमें किसान रेल और कृषि उड़ान की बड़ी भूमिका है: PM#100thKisanRail
किसान रेल चलता फिरता कोल्ड स्टोरेज भी है।
— PMO India (@PMOIndia) December 28, 2020
यानि इसमें फल हो, सब्ज़ी हो, दूध हो, मछली हो, यानि जो भी जल्दी खराब होने वाली चीजें हैं, वो पूरी सुरक्षा के साथ एक जगह से दूसरी जगह पहुंच रही हैं: PM#100thKisanRail
अब किसान रेल जैसी सुविधा से पश्चिम बंगाल के लाखों छोटे किसानों को एक बहुत बड़ा विकल्प मिला है।
— PMO India (@PMOIndia) December 28, 2020
और ये विकल्प किसान के साथ ही स्थानीय छोटे-छोटे व्यापारी को भी मिला है।
वो किसान से ज्यादा दाम में ज्यादा माल खरीदकर किसान रेल के ज़रिए दूसरे राज्यों में बेच सकते हैं: PM
कृषि से जुड़े एक्सपर्ट्स और दुनिया भर के अनुभवों और नई टेक्नॉलॉजी का भारतीय कृषि में समावेश किया जा रहा है।
— PMO India (@PMOIndia) December 28, 2020
स्टोरेज से जुड़ा इंफ्रास्ट्रक्चर हो या फिर खेती उत्पादों में वैल्यू एडिशन से जुड़े प्रोसेसिंग उद्योग, ये हमारी सरकार की प्राथमिकता हैं: PM
पीएम कृषि संपदा योजना के तहत मेगा फूड पार्क्स, कोल्ड चेन इंफ्रास्ट्रक्चर, एग्रो प्रोसेसिंग क्लस्टर, ऐसे करीब साढ़े 6 हजार प्रोजेक्ट स्वीकृत किए गए हैं।
— PMO India (@PMOIndia) December 28, 2020
आत्मनिर्भर अभियान पैकेज के तहत माइक्रो फूड प्रोसेसिंग उद्योगों के लिए 10 हज़ार करोड़ रुपए स्वीकृत किए गए हैं: PM