‘యూదుల కొత్త సంవత్సరం ‘రోష్ హషానా’ ప్రారంభం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని యైర్ లాపిడ్, ఆ దేశ ప్రజానీకంతోపాటు ప్రపంచవ్యాప్తంగాగల యూదులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“రోష్ హషానా నేపథ్యంలో నా మిత్రుడు @yairlapidతోపాటు ఇజ్రాయెల్ స్నేహపూర్వక ప్రజానీకానికి, ప్రపంచవ్యాప్తంగాగల యూదు సమాజానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికీ చక్కని ఆరోగ్యం, శాంతిసౌభాగ్యాలను సమకూర్చాలని ఆకాంక్షిస్తున్నాను. ‘షానా తోవా!” అని ప్రధాని పేర్కొన్నారు.
Warmest greetings for Rosh Hashanah to my friend @yairlapid, Israel's friendly people and the Jewish community all over the world. May the new year bring good health, peace and prosperity to everyone. Shana Tova!
— Narendra Modi (@narendramodi) September 25, 2022
מאחל לידידי @yairlapid, לאזרחי ישראל, והעם היהודי בכל העולם ברכות לבביות לרגל חג ראש השנה. אני מאחל ששנה זו תהיה שנה של בריאות טובה, שלום ושגשוג לכולם.
— Narendra Modi (@narendramodi) September 25, 2022
שנה טובה!