పరమ పావనులు శ్రీ దలై లామా కు ఆయన 89వ జన్మదినం సందర్భం గా శుభాకాంక్షలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు. పరమ పావనులు శ్రీ దలై లామా కు ఇటీవలే మోకాలి నొప్పి కి శస్త్రచికిత్స జరిగింది. ఆయన త్వరగా పున:స్వస్థులు కావాలని కూడా శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పరమ పావనులు శ్రీ దలై లామా కు మంచి ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్షు ను ప్రసాదించవలసిందంటూ ఆ ఈశ్వరుడిని ప్రధాన మంత్రి ప్రార్థించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ లో -
‘‘పరమ పావనులు శ్రీ @DalaiLama కు ఆయన 89వ జన్మదినం సందర్భం గా నా శుభాకాంక్షలను వ్యక్తం చేశాను. మోకాలి కి శస్త్రచికిత్స దరిమిలా ఆయన త్వరగా పున:స్వస్థులు కావాలని, ఆయనకు మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్సు ను ప్రసాదించాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థించాను.’’ అని పేర్కొన్నారు.
Sent my greetings to His Holiness @DalaiLama on the occasion of his 89th birthday. Pray for his quick recovery after knee surgery, good health and long life.
— Narendra Modi (@narendramodi) July 6, 2024