సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్ పిఎఫ్) సిబ్బంది అందరికీ వారి సంస్థ స్థాపన దినం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు. వారి అచంచల అంకిత భావం, దేశ ప్రజలకు వారు అందిస్తున్న నిరంతర సేవలు నిజంగా ప్రశంసనీయమైనవిగా ఉంటున్నాయని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:
‘‘స్థాపన దినం సందర్భంగా @crpfindia సిఆర్ పిఎఫ్ సిబ్బంది అందరికీ నా శుభాకాంక్షలు. దేశం పట్ల వారికి ఉన్న అచంచల అంకిత భావం, విశ్రాంతి అనేదే ఎరుగక దేశ ప్రజలకు వారు చేస్తున్న సేవలు నిజంగా ప్రశంసనీయమైనవి. ఎట్టి పరిస్థితులలోనైనా సరే, అత్యున్నత ప్రమాణాలకు తులతూగే ధైర్య, సాహసాలకు మరియు నిబద్ధతకు మారుపేరుగా నిలుస్తున్నారు వారు. మన దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో వారి భూమిక సర్వోపరిగా ఉన్నది.’’
On the occasion of their Raising Day, my greetings to all @crpfindia personnel. Their unwavering dedication and relentless service to the nation are truly commendable. They have always stood for the highest standards of courage and commitment. Their role in keeping our nation… pic.twitter.com/fQRQvVhzbf
— Narendra Modi (@narendramodi) July 27, 2024