కువైట్ అధినేత గౌరవనీయ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.
ఈ మేరకు కువైట్ రాచ కుటుంబానికి, నాయకత్వానికి, ప్రజలకు ఆయన సంతాపం తెలియజేయడంతోపాటు సానుభూతి ప్రకటించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్టు ద్వారా పంపిన సందేశంలో:
‘‘కువైట్ దేశాధినేత గౌరవనీయ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా తుదిశ్వాస విడిచారన్న వార్త నన్ను కలచివేసింది. ఈ నేపథ్యంలో రాచకుటుంబానికి, దేశ నాయకత్వానికి, ప్రజలకు నాతోపాటు భారత ప్రజల తరఫున ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Deeply saddened to learn about the unfortunate demise of His Highness Sheikh Nawaf Al-Ahmed Al-Jaber Al-Sabah. We convey our deepest condolences to the Royal family, the leadership and the people of Kuwait.
— Narendra Modi (@narendramodi) December 16, 2023