చాత్ పూజ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఇవాళ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ మేరకు 'ఎక్స్' ద్వారా పంపిన ఒక సందేశంలో:
"పవిత్ర చాత్ పర్వదినం సందర్భంగా దేశంలోని నా కుటుంబ సభ్యులందరికీ అనేకానేక శుభాభినందనలు. సూర్య భగవానునికి నమస్కరించడం అందరి జీవితాల్లో నవోదయానికి నాంది పలకాలని, కొత్త శక్తి నింపాలని ఆకాంక్షిస్తున్నాను. జై ఛతీ మాతా!" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
महापर्व छठ के संध्या अर्घ्य के पावन अवसर पर अपने सभी परिवारजनों को मेरी अनंत शुभकामनाएं। सूर्यदेव की वंदना हर किसी के जीवन में नई ऊर्जा और नए उत्साह का संचार करे। जय छठी मइया!
— Narendra Modi (@narendramodi) November 19, 2023