‘సిఎ డే’ నాడు చార్టర్డ్ అకౌంటెంట్ లు అందరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను వ్యక్తం చేశారు. అర్థశాస్త్ర రంగం లో చార్టర్డ్ అకౌంటెంట్ లకు గల ప్రాముఖ్యం విషయం లో తన అభిప్రాయాల ను వెల్లడి చేస్తున్నటువంటి ఒక వీడియో ను కూడా శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భం లో శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మన ఆర్థిక వ్యవస్థ లో చార్టర్డ్ అకౌంటెంట్ యొక్క పాత్ర ముఖ్యమైంది అని చెప్పాలి. సిఎ డే సందర్భం లో, చార్టర్డ్ అకౌంటెంట్ లు అందరి కి ఇవే శుభాకాంక్షలు. ఆర్థిక వ్యవస్థ లో వృద్ధి ని మరియు పారదర్శకత్వాన్ని పెంపొందింప చేయడం లో వారు కఠోర శ్రమ ను కొనసాగిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
A Chartered Accountant has an important role in our economy. On CA Day, best wishes to all Chartered Accountants. May they keep working hard in furthering growth and transparency in the economy. pic.twitter.com/TDtyxefIYP
— Narendra Modi (@narendramodi) July 1, 2022