భాగల్ పుర్ లో జరిగిన పేలుడు లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటన కు సంబంధించిన స్థితి ని గురించి ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్ తో ప్రధాన మంత్రి మాట్లాడారు. పాలన యంత్రాంగం రక్షణ మరియు సహాయ కార్యకలాపాల లో తలమునకలు గా ఉందని, బాధితుల కు సాధ్యమైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందించడం జరుగుతోందని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘బిహార్ లోని భాగల్ పుర్ లో జరిగిన విస్ఫోటం వల్ల ప్రాణనష్టం వాటిల్లిందన్న కబురు దుఃఖాన్ని కలిగించింది. గాయపడిన వారు త్వరగా ఆరోగ్యవంతులు కావాలని కోరుకొంటున్నాను. ఈ ఘటన తో ముడిపడిన పరిస్థితుల ను గురించి ముఖ్యమంత్రి @NitishKumar గారి తో మాట్లాడడం జరిగింది. పాలన యంత్రాంగం రక్షణ చర్యల లో మరియు సహాయ కార్యకలాపాల లో నిమగ్నమైంది. బాధితుల కు చేతనైన అన్ని విధాలుగాను సహాయాన్ని అందించడం జరుగుతోంది’’ అని పేర్కొన్నారు.
बिहार के भागलपुर में धमाके से हुई जनहानि की खबर पीड़ा देने वाली है। मैं घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। घटना से जु़ड़े हालातों पर मुख्यमंत्री @NitishKumar जी से भी बात हुई। प्रशासन राहत और बचाव कार्यों में लगा हुआ है, और पीड़ितों को हर संभव सहायता दी जा रही है।
— Narendra Modi (@narendramodi) March 4, 2022