ఇందౌర్ లో జరిగిన దుర్ఘటన పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింహ్ చౌహాన్ తో శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడి, తాజా స్థితి ఏమిటి అని అడిగి తెలుసుకొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
ఇందౌర్ లో జరిగిన దుర్ఘటన కు అమితం గా బాధపడ్డాను. ముఖ్యమంత్రి @ChouhanShivraj Ji తో మాట్లాడి తాజా స్థితి ని గురించి తెలుసుకొన్నాను. రాష్ట్ర ప్రభుత్వం త్వరిత గతి న రక్షణ కార్యకలాపాల ను మరియు సహాయక కార్యకలాపాల ను చేపట్టడం లో నిమగ్నం అయింది. ఈ దుర్ఘటన లో ప్రభావితం అయినటువంటి వ్యక్తులు అందరికి మరియు వారి కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
Extremely pained by the mishap in Indore. Spoke to CM @ChouhanShivraj Ji and took an update on the situation. The State Government is spearheading rescue and relief work at a quick pace. My prayers with all those affected and their families.
— Narendra Modi (@narendramodi) March 30, 2023