‘ఆది మహోత్సవ్’ కు అన్ని వర్గాల వారి నుండి స్పందన లభించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. లోక్ సభ ఎంపి డాక్టర్ శ్రీ భోలా సింహ్ చేసిన అనేక ట్వీట్ లకు ప్రధాన మంత్రి ప్రతిస్పందించారు. శ్రీ భోలా సింహ్ ‘ఆది మహోత్సవ్’ ను తాను సందర్శించిన విషయాన్ని వెల్లడిస్తూ, ఆది మహోత్సవ్ ను చాలా చక్కనైన పద్ధతి లో ఏర్పాటు చేశారు, అక్కడ మీకు యావత్తు భారతదేశం లోని ఆదివాసి సంస్కృతి తాలూకు అద్భుతమైనటువంటి ఆవిష్కరణ కానవస్తుంది అని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి తన ట్వీట్ లో -
‘‘మీరు ‘ఆది మహోత్సవ్’ పట్ల ఇంతటి ఆసక్తి ని కనబరచడం చూసి సంతోషం కలిగింది. ఆదివాసి సమాజం యొక్క సంస్కృతి మరియు వారి అన్నపానాదుల ను గురించి తెలుసుకొన్న మీ అనుభవం ఉత్సాహాన్ని పెంచేది గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
यह देखकर अच्छा लगा कि आपने ‘आदि महोत्सव’ में इतनी रुचि ली। आदिवासी समाज की संस्कृति और उनके खानपान से जुड़ा आपका अनुभव उत्साह बढ़ाने वाला है। https://t.co/Gr8wzWKirW
— Narendra Modi (@narendramodi) February 23, 2023