అహ్మదాబాద్-మెహసానా (64.27 కిలోమీటర్లు) గేజ్ మార్పిడి పూర్తి కావడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం ప్రకటించారు.
వాణిజ్యానికి, కనెక్టివిటీకి ఇది పెద్ద అవకాశమని శ్రీ మోదీ అన్నారు.
ఈ ప్రాజెక్టులతో రైళ్ల రాకపోకలు క్రమబద్ధం అయి అహ్మదాబాద్, మెహసానా మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. అహ్మదాబాద్-ఢిల్లీ రూట్ లో సరకు రవాణా పెరుగుతుంది.
రైల్వే మంత్రి ట్వీట్ కి స్పందిస్తూ ‘‘ఇది వాణిజ్యం, అనుసంధానతకు పెద్ద అవకాశం’’ అని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు.
Great for commerce and connectivity. https://t.co/qxV2jwKz9r
— Narendra Modi (@narendramodi) March 6, 2023