ఈశాన్య ప్రాంతం అగ్రగామి పర్యటన స్థలం గా ఎదుగుతున్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసన్నత ను వ్యక్తం చేశారు. పర్యటనలు పెరుగుతూ ఉన్నాయంటే ఆ ప్రాంతం లో సమృద్ధి సైతం అధికం అవుతోంది అనే అర్థం అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఈశాన్య ప్రాంతాని కి 2022 వ సంవత్సరం లో 11.8 మిలియన్ కు పైచిలుకు స్వదేశీ సందర్శకులు మరియు 1,00,000 మంది కి పైగా అంతర్జాతీయ సందర్శకులు విచ్చేసినందువల్ల అక్కడ పర్యటన రంగం రికార్డు ను బద్దలు చేసింది అని కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అనేక ట్వీట్ లలో తెలియజేయగా, ప్రధాన మంత్రి దీనికి తాను సమాధానాన్ని ఇస్తూ,
‘‘సంతోషదాయకమైనటువంటి సరళి. పర్యటన లో వృద్ధి అంటే దానికి అర్థం ఆ ప్రాంతం లో సమృద్ధి లోనూ వృద్ధి ఉంటోందనే.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Gladdening trend. Increased tourism means increased prosperity in the region. https://t.co/hCwjqEef0o
— Narendra Modi (@narendramodi) April 4, 2023