దేవ్ దీపావళి సందర్భంగా లక్షల కొద్దీ దీపాల వెలుగుల మధ్య కాశీ మిలమిలలాడినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో శ్రీ నరేంద్ర మోదీ ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘దేవ్ దీపావళి సందర్భంగా లక్షలాది దివ్వెలతో కళకళలాడుతున్న బాబా విశ్వనాథుని కాశీ నగరి భవ్య స్వరూపం మనసుకు మోహ పరవశత్వాన్ని కలిగించేదిగా ఉంది. దీపదానం చేసే ఈ సంప్రదాయానికి ప్రపంచం అంతటా ఉన్న ప్రజలు సాక్షులుగా నిలుస్తారు. గంగా నదీమాత తీరాన నాలుగు దిక్కులకు విస్తరించిన దివ్య జ్యోతుల కాంతులు ప్రతి ఒక్కరి జీవితంలో సుఖం, శాంతి, సమృద్ధి, ఉత్తమ స్వస్థత అనే వెలుగులను నింపాలని నేను కోరుకుంటున్నాను.’’
देव दीपावली पर लाखों दीयों से जगमग बाबा विश्वनाथ की नगरी काशी का भव्य स्वरूप मन को मोह लेता है। दीपदान की इस परंपरा का दुनिया भर के लोग साक्षी बनते हैं। मेरी कामना है कि मां गंगा के तट पर चारों ओर फैली दिव्य ज्योति हर किसी के जीवन को सुख, शांति, समृद्धि और उत्तम स्वास्थ्य से रोशन… pic.twitter.com/6G9dCDKMS6
— Narendra Modi (@narendramodi) November 15, 2024