సామాజిక న్యాయం యొక్క పథనిర్ణేత శ్రీ కర్పూరీ ఠాకుర్ కు భారత్ రత్న ను ఇవ్వాలన్న నిర్ణయం ఆయన మరణానంతరం తాజా గా వెలువడడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

కర్పూరీ ఠాకుర్ గారి శత జయంతి తాలూకు సందర్భం లో ఈ నిర్ణయం దేశప్రజల ను గౌరవాన్వితులను గా చేయగలదు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. వెనుకబడిన వర్గాల వారు మరియు వంచన కు గురి అయిన వర్గాల వారి అభ్యున్నతి కోసం శ్రీ కర్పూరీ ఠాకుర్ చాటిచెప్పిన అచంచల నిబద్ధత మరియు దూరదర్శి నాయకత్వం లు భారతదేశం యొక్క సామాజిక-రాజకీయ యవనిక పై చెరిపివేయలేనటువంటి ముద్ర ను వేసింది.

 

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశంలో -

‘‘సామాజిక న్యాయం యొక్క పథ ప్రదర్శకుడు మహనీయుడైన జన్ నాయక్ కర్పూరీ ఠాకుర్ గారి కి భారత్ రత్న సమ్మానాన్ని కట్టబెట్టాలన్న నిర్ణయాన్ని భారతదేశం ప్రభుత్వం తీసుకొన్నదన్న విషయం, అది కూడాను ఆయన యొక్క శత జయంతి వేళ లో ఈ నిర్ణయం వెలువడడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఆయన శత జయంతి సందర్భం లో ఈ నిర్ణయం దేశ ప్రజల ను గౌరవాన్వితులను గా చేస్తుంది. ఆదరణ కు నోచుకోకుండా మిగిలిపోయిన వర్గాల వారి పక్షాన సమానత్వం, ఇంకా సశక్తీకరణ ల దృఢసంకల్పం తో పోరాడిన ఒక విజేత కు మరియు ఆయన జరిపినటువంటి సహనశీల ప్రయాసల కు ఒక నిదర్శన గా ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి గుర్తింపు ఉన్నది.

వెనుకబడిన వర్గాల వారు మరియు వంచన కు గురి అయిన వర్గాల వారి అభ్యున్నతి కోసం శ్రీ కర్పూరీ ఠాకుర్ చాటిచెప్పిన అచంచల నిబద్ధత మరియు దూరదర్శి నాయకత్వం లు భారతదేశం యొక్క సామాజిక-రాజకీయ యవనిక పై చెరిపివేయలేనటువంటి ముద్ర ను వేసింది. ఈ పురస్కారం ఆయన యొక్క ప్రశంసనీయమైనటువంటి తోడ్పాటుల ను గౌరవించుకోవడం ఒక్కటే కాకుండా మరింత న్యాయవంతం అయినటువంటి మరియు సమాన అవకాశాల ను ప్రసాదించేటటువంటి ఒక సమాజాన్ని ఏర్పరచాలి అనే ఆయన ఆశయాల సాధన బాట లో మనం మునుముందుకు సాగిపోయేటందుకు మనకు ప్రేరణ ను ఇవ్వగలదు.” అని పేర్కొన్నారు.

 

“मुझे इस बात की बहुत प्रसन्नता हो रही है कि भारत सरकार ने समाजिक न्याय के पुरोधा महान जननायक कर्पूरी ठाकुर जी को भारत रत्न से सम्मानित करने का निर्णय लिया है। उनकी जन्म-शताब्दी के अवसर पर यह निर्णय देशवासियों को गौरवान्वित करने वाला है। पिछड़ों और वंचितों के उत्थान के लिए कर्पूरी जी की अटूट प्रतिबद्धता और दूरदर्शी नेतृत्व ने भारत के सामाजिक-राजनीतिक परिदृश्य पर अमिट छाप छोड़ी है। यह भारत रत्न न केवल उनके अतुलनीय योगदान का विनम्र सम्मान है, बल्कि इससे समाज में समरसता को और बढ़ावा मिलेगा।”

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s Biz Activity Surges To 3-month High In Nov: Report

Media Coverage

India’s Biz Activity Surges To 3-month High In Nov: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 నవంబర్ 2024
November 24, 2024

‘Mann Ki Baat’ – PM Modi Connects with the Nation

Driving Growth: PM Modi's Policies Foster Economic Prosperity