హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లూ లో మంట లు చెలరేగిన కారణం గా బాధితులైన కుటుంబాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తో పాటు స్థానిక పాలన యంత్రాంగం కూడా పూర్తి సన్నద్ధత తో ఉపశమనకారి కార్యకలాపాల లోను, సురక్ష సంబంధి కార్యకలాపాల లోను తలమునకలు అయ్యాయని కూడా ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లూ లో సంభవించిన అగ్ని ప్రమాదం అత్యంత దుఃఖదాయకం గా ఉంది. చరిత్రాత్మకమైనటువంటి మలాణా గ్రామం లో జరిగిన ఈ దుర్ఘటన లో బాధిత కుటుంబాలన్నిటి కి నేను నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక పాలన యంత్రాంగం ఉపశమనకారి కార్యకలాపాల లో మరియు సురక్ష సంబంధి కార్యకలాపాల లో నిమగ్నం అయ్యాయి’’ అని పేర్కొన్నారు.
हिमाचल प्रदेश के कुल्लू में हुआ अग्निकांड अत्यंत दुखद है। ऐतिहासिक मलाणा गांव में हुई इस त्रासदी के सभी पीड़ित परिवारों के प्रति मैं अपनी संवेदना व्यक्त करता हूं। राज्य सरकार और स्थानीय प्रशासन राहत और बचाव के काम में पूरी तत्परता से जुटे हैं।
— Narendra Modi (@narendramodi) October 27, 2021