బిహార్ లోని లఖీసరాయ్ లో రహదారి ప్రమాదం సంభవించి ప్రాణ నష్టాని కి దారితీయడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా పునఃస్వస్థులు అయ్యేటట్టు అనుగ్రహించాలంటూ ఆ ఈశ్వరుడి ని ఆయన ప్రార్థించారు
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘బిహార్ లోని లఖీసరాయ్ లో జరిగిన రహదారి దుర్ఘటన అత్యంత దుఃఖాన్ని కలిగించేది గా ఉంది. ఈ దుర్ఘటన లో ఆప్తుల ను కోల్పోయిన వ్యక్తుల కు ఇదే నా సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా కోలుకోవాలి అని నేను కోరుకొంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం బాధితుల కు చేతనైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందించడం లో తలమునుకలు గా ఉంది: ప్రధాన మంత్రి’’ అని తెలిపింది.
बिहार के लखीसराय में हुआ सड़क हादसा अत्यंत दुखद है। इस दुर्घटना में जिन्होंने अपनों को खोया है, उनके प्रति मेरी शोक-संवेदनाएं। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव सहायता में जुटा है: PM…
— PMO India (@PMOIndia) February 21, 2024