భారతీయ రైల్వేలు అభయపురి - పంచరత్న; దుధ్నై - మెండి పత్తర్ ప్రాంతాల మధ్య ముఖ్యమైన విభాగాల విద్యుదీకరణను పూర్తి చేయడంతో, మేఘాలయలో మొదటిసారిగా విద్యుత్ రైళ్లు అందుబాటులోకి రావడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
మేఘాలయ లోని పత్రికా సమాచార కార్యాలయం (పి.ఐ.బి) చేసిన ట్వీట్ ను ప్రధానమంత్రి పంచుకుంటూ, "ఈశాన్య ప్రాంతంలో అనుసంధానత మరింత పెరగడం,మేఘాలయకు ఇది ఒక అద్భుతమైన వార్త." అని సామాజిక మాధ్యమం ద్వారా ట్వీట్ చేశారు.
Wonderful news for Meghalaya and furthering connectivity in the Northeast. https://t.co/AZjPuBr2Ul
— Narendra Modi (@narendramodi) March 17, 2023