దాదాపు గా 71,000 నియామక లేఖల ను కొత్త గా ఉద్యోగం లోకి చేర్చుకొన్న వ్యక్తుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా పంపిణీ చేశారు. ఉద్యోగ కల్పన కు అండగా నిలవడం లో ఒక ఉత్ప్రేరకం గా రోజ్ గార్ మేళా పని చేస్తుందన్న ఆశ తో పాటు యువతీయువకుల కు వారి యొక్క సశక్తీకరణ సాధన లోను, దేశాభివృద్ధి లో వారికి ప్రత్యక్ష ప్రాతినిధ్యాన్ని కల్పించడం లోను ఒక అవకాశాన్ని అందిస్తందన్న ఆశ కూడా ఉంది. ఇంతకు ముందు అక్టోబరు లో, 75వేల నియామక పత్రాల ను సరికొత్త గా ఉద్యోగాల లోకి చేర్చుకొన్న వ్యక్తుల కు రోజ్ గార్ మేళా లో భాగం గా ప్రదానం చేయడమైంది.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశం లో 45 కు పైగా నగరాల లో 71 వేల మంది కి పైచిలుకు యువతీ యువకుల కు నియామక పత్రాల ను అందించడం జరుగుతోందని, దీని ద్వారా అనేక కుటుంబాల లో సంతోషం తాలూకు ఒక నవ యుగం ఆరంభం అవుతుందన్నారు. ధన్ తేరస్ రోజు న కేంద్ర ప్రభుత్వం 75 వేల నియామక పత్రాల ను యువత కు ఇచ్చిందని ఆయన గుర్తు కు తెచ్చారు. ‘‘ఈ నాటి రోజ్ గార్ మేళా దేశ యువత కు ఉపాధి అవకాశాల ను కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యమం తరహా లో పాటుపడుతోందనేందుకు ఒక రుజువు గా ఉంది’’, అని ప్రధాన మంత్రి అన్నారు.
రోజ్ గార్ మేళా ను ఒక నెల రోజుల కిందట ప్రారంభించడాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, రాష్ట్రాలతో పాటు అనేక కేంద్ర పాలిత ప్రాంతాలు అప్పుడప్పుడు అటువంటి రోజ్ గార్ మేళా లను ఏర్పాటు చేస్తుంటాయి అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, జమ్ము & కశ్మీర్ లతో పాటు లద్దాఖ్, అండమాన్ మరియు నికోబార్, లక్ష్యద్వీప్, దమన్ మరియు దీవ్, దాద్ రా మరియు నగర్ హవేలీ, ఇంకా చండీగఢ్ లలో ఆయా ప్రభుత్వాలు వేల కొద్దీ యువతీయువకుల కు నియామక పత్రాల ను ఇవ్వడం పట్ల ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు. కొద్ది రోజుల లో గోవా మరియు త్రిపుర సైతం ఈ తరహా రోజ్ గార్ మేళా లను నిర్వహించనున్నాయని ఆయన చెప్పారు. ఈ గొప్ప కార్యాని కి ఖ్యాతి డబల్ ఇంజన్ ప్రభుత్వాని ది అని ప్రధాన మంత్రి చెప్తూ, భారతదేశం లో యువత కు సశక్తీకరణ ను ప్రదానం చేయడం కోసం అటువంటి ఉపాధి కల్పన మేళా లను తరచు గా నిర్వహించడం జరుగుతుంటుంది అంటూ హామీ ని ఇచ్చారు.
దేశాని కి అతి పెద్ద బలం యువతే అని ప్రధాన మంత్రి అన్నారు. వారి యొక్క ప్రతిభ ను మరియు వారి శక్తి ని దేశ నిర్మాణాని కి ఉపయోగించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాముఖ్యాన్ని కట్టబెడుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వోద్యోగం లో చేరిన వారికి ఆయన స్వాగతం పలుకుతూ అభినందన లు తెలిపారు. చాలా విశిష్టమైనటువంటి కాలం లో, అదే.. ‘అమృత కాలం’ లో.. వారు ఈ ముఖ్య బాధ్యత ను స్వీకరిస్తున్నారని ఆయన గుర్తు కు తెచ్చారు. అమృత కాలం లో ఒక అభివృద్ధి చెందిన దేశం గా నిలవాలన్న మన దేశ సంకల్పం నెరవేరడం లో వారి పాత్ర ఎంతైనా ఉంటుందని ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధులు గా వారు వారి యొక్క భూమిక ను మరియు కర్తవ్యాల ను సమగ్రం గా ఆకళింపు చేసుకొని వారి విధుల ను నిర్వర్తించడం కోసం అవసరపడే దక్షత ను సంపాదించుకోవడం పై తదేక శ్రద్ధ ను తీసుకోవాలని ఆయన సూచించారు.
‘కర్మయోగి భారత్’ టెక్నాలజీ ప్లాట్ ఫార్మ్ ను ఈ రోజు న ప్రారంభించుకోవడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ప్రభుత్వ అధికారుల కోసం ఎన్నో ఆన్ లైన్ కోర్సు లు లభిస్తున్నాయని వెల్లడించారు. ‘కర్మయోగి ప్రారంభ్’ పేరు తో ప్రభుత్వ ఉద్యోగుల కోసమని ఒక విశిష్ట పాఠ్య క్రమాన్ని తీసుకు రావడం జరిగిందని ఆయన స్పష్టంచేశారు. ఈ పాఠ్య క్రమాన్ని వీలైనంత గరిష్ఠ స్థాయి లో వినియోగించుకోండి అంటూ కొత్త గా నియామకం అయిన వారికి ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. దీని తాలూకు ప్రయోజనాల ను గురించి ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ, ఈ కోర్సు వారి నైపుణ్యాభివృద్ధి కి ఒక గొప్ప సాధనం గా ఉంటుందని, రాబోయే రోజుల లో వారికి లబ్ధి ని చేకూర్చుతుందన్నారు.
మహమ్మారి కారణం గాను, యుద్ధం కారణం గాను ప్రపంచ స్థాయి లో యువత కు ఎదురైన సంకటాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఈ కష్ట కాలం లో సైతం ప్రపంచం నలుమూలల నిపుణులు భారతదేశం యొక్క వృద్ధి గతి పట్ల ఆశాభావం తో ఉన్నారని ఆయన అన్నారు. నిపుణులు చెప్తున్న దాని ప్రకారం భారతదేశం సేవ రంగం లో ఒక ప్రధాన శక్తి గా నిలచింది, భారతదేశం త్వరలో ప్రపంచ తయారీ కేంద్రం గా కూడా కానుంది అని ప్రధాన మంత్రి అన్నారు. పిఎల్ఐ వంటి కార్యక్రమాలు దీనిలో ఒక పెద్ద పాత్ర ను పోషిస్తాయి; అయితే యువత మరియు చేయి తిరిగిన మానవ శక్తి .. ఇవే ప్రధానమైన పునాది గా ఉంటాయని ఆయన అన్నారు. పిఎల్ఐ పథకం 60 లక్షల కొలువులు అందివచ్చే అవకాశం ఉందని ప్రధాన మంత్రి తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫార్ లోకల్, లోకల్ ను గ్లోబల్ స్థాయి కి తీసుకు పోవడం వంటి ఉద్యమాలు దేశం లో ఉపాధి కి మరియు స్వతంత్రోపాధి కి కొంగొత్త అవకాశాల ను అందిస్తున్నాయని కూడా ఆయన అన్నారు. ‘‘ఇటు ప్రభుత్వం లోను, అటు ప్రైవేటు రంగం లోను కొత్త కొలువుల కు అవకాశం నిరంతరాయం గా వృద్ధి చెందుతోంది. పైపెచ్చు, ఈ అవకాశాలు యువతీ యువకుల కు వారి యొక్క సొంత గ్రామాల లో, సొంత నగరాలలో అందివస్తున్నాయి అనేది గొప్ప విషయం. ఇది యువత ప్రవాసం పోయే నిర్భంద స్థితి ని తగ్గించింది. మరి వారు వారి యొక్క ప్రాంతం లోనే అభివృద్ధి లో వారిదైనటువంటి పాత్ర ను పోషించగలుగుతున్నారు అని ఆయన అన్నారు.
స్టార్ట్-అప్ మొదలుకొని స్వతంత్రోపాధి వరకు, అంతరిక్షం మొదలుకొని డ్రోన్ వరకు అనేక రంగాల లో తీసుకొంటున్న చర్య ల కారణం గా కొత్త కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి అని ప్రధాన మంత్రి వివరించారు. 80 వేల స్టార్ట్-అప్స్ యువతీ యువకుల కు వారి ప్రతిభ ను చాటిచెప్పుకొనేటటువంటి అవకాశాన్ని ఇస్తున్నాయి అని ఆయన అన్నారు. మందుల సరఫరా కు, కీటకనాశినుల ను వెదజల్లడానికి, ఇంకా స్వామిత్వ పథకం లో మేపింగు కు, అలాగే రక్షణ రంగం లో సైతం డ్రోన్స్ ను విరివి గా వాడడం జరుగుతోంది. ఈ ప్రక్రియ యువత కు కొత్త నౌకరీల ను కల్పిస్తోందని ఆయన అన్నారు. భారతదేశం లో కొద్ది రోజుల కిందట ప్రైవేటు రంగం ద్వారా తొలి అంతరిక్ష రాకెటు ను ప్రయోగించడాన్ని గురించి ప్రధాన మంత్రి గుర్తు కు తెస్తూ, అంతరిక్ష రంగాన్ని తెరవాలన్న నిర్ణయం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇది భారతదేశం లో యువతీయువకుల కు ఉపాధి అవకాశాల ను తెచ్చిపెడుతోందని ఆయన అన్నారు. 35 కోట్ల పైచిలుకు ‘ముద్ర’ రుణాల ను మంజూరు చేయడమైంది అని కూడా ఆయన ఒక ఉదాహరణ గా ప్రస్తావించారు. పరిశోధన కు మరియు నూతన ఆవిష్కరణల కు ప్రోత్సాహాన్ని ఇస్తున్న కారణం గా దేశం లో ఉపాధి అవకాశాల లో వృద్ధి చోటుచేసుకొందని ప్రధాన మంత్రి అన్నారు.
ఉద్యోగం లో ఇటీవలే చేర్చుకొన్న వ్యక్తులు వారికి అందజేసిన అవకాశాల ను సాధ్యమైనంత వరకు అధికం గా వినియోగించుకోవాలి అంటూ ప్రధాన మంత్రి సూచించారు. ఈ నియామక లేఖ లు ఒక ప్రవేశ స్థానం గా మాత్రమే చూడాలి. అవి వారి యొక్క వృద్ధి కి నాంది ని పలుకుతాయి అని ఆయన అన్నారు. అనుభవాన్ని సంపాదించుకొని, సీనియర్స్ నుండి నేర్చుకోవడం ద్వారా అభ్యర్థులు రాణించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. నేర్చుకోవడం తాలూకు స్వీయ అనుభవాన్ని వెల్లడిస్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ఒక వ్యక్తి తన లోపలి విద్యార్థి ని అణచివేయకూడదని ఆయన చెప్పారు. ఏదైనా కొత్తదాని ని నేర్చుకొనేందుకు లభించినటువంటి అవకాశాన్ని ఎన్నటికీ వదలి వేయవద్దని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆన్ లైన్ మాధ్యం ద్వారా శిక్షణ ను పొందేటప్పుడు ఎదురైన అనుభవాల ను ఇతరుల దృష్టి కి తీసుకు రండి. కర్మయోగి భారత్ ప్లాట్ ఫార్మ్ ను మెరుగు పరచడం కోసం ఫలప్రదం కాగల ప్రతిస్పందనల ను అందించండి అని ఉద్యోగాల లో చేరుతున్న వారి కి ప్రధాన మంత్రి సూచించారు. ‘‘మనం ఇప్పటికే భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దే బాట లో సాగుతున్నాం. ఈ యొక్క దృష్టికోణం తో మరింతగా ముందంజల ను వేసేందుకు మనం సంకల్పం చెప్పుకొందాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
పూర్వరంగం
ఉపాధికల్పన కు అత్యంత అధిక ప్రాధాన్యాన్నికట్టబెట్టాలన్న ప్రధాన మంత్రి నిబద్ధత ను నెరవేర్చే దిశ లో రోజ్ గార్ మేళా ఒకముందడుగు గా ఉంది. రోజ్ గార్ మేళా ఉపాధికల్పన ను పెంపొందింప చేయడం లో ఒక ఉత్ప్రేరకం గా పని చేయగలదన్న, యువతీ యువకుల కు వారి సశక్తీకరణ తో పాటు దేశాభివృద్ధి లోవారు పాలుపంచుకోవడానికి కూడాను సార్థక అవకాశాల ను కల్పిస్తుందన్న ఆశాభావం వ్యక్తం అవుతున్నది. ఇంతకు మునుపు అక్టోబరు లో జరిగిన రోజ్ గార్ మేళా లో, కొత్త గా ఉద్యోగాల లోకి చేర్చుకొన్న 75 వేల మంది కి నియామక లేఖల ను అందజేయడమైంది.
కొత్త గా భర్తీ అయిన వ్యక్తుల కు నియామక పత్రాల ను దేశవ్యాప్తం గా (గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ మినహా) మొత్తం 45 స్థానాల లో ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు పూర్వం భర్తీ చేసిన ఉద్యోగాల కేటగిరీల కుఅదనం గా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, నర్సులు, నర్సింగ్ ఆఫీసర్స్, వైద్యులు, ఫార్మసిస్టు లు, రేడియోగ్రాఫర్ లు, ఇంకా ఇతర సాంకేతిక మరియు పేరామెడికల్ పోస్టుల ను కూడా భర్తీచేస్తున్నారు. చెప్పుకోదగిన సంఖ్య లోఉద్యోగాల ను హోం మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్రీయ సాయుధ పోలీసు బలగాల (సిఎపిఎఫ్) కుచెందిన వేరు వేరు విభాగాల లో భర్తీ చేయడం జరుగుతోంది.
కర్మయోగి ప్రారంభ మాడ్యూల్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ మాడ్యూల్ ను వివిధ ప్రభుత్వ విభాగాల లో నూతనం గా నియామకం అయిన వారికి ఉద్దేశించినటువంటి ఒక ఆన్ లైన్ ఓరియంటేశన్ కోర్సు అని చెప్పవచ్చును. దీనిలో ప్రభుత్వ ఉద్యోగుల కు ప్రవర్తన సంహిత, పని ప్రదేశం లో పాటించవలసిన నైతిక ప్రమాణాలు, సజ్జనత్వం, మానవ వనరుల సంబంధి విధానాలు, ఇంకా ఇతర ప్రయోజనాలు, భత్యాల వంటివి ఉంటాయి. అవి కొత్త గా ఉద్యోగం లో చేరిన వారు పని ప్రదేశం లో అనుసరించవలసివున్న విధానాల కు అలవాటు పడే విధం గాను, కొత్త భూమికల లోకి సాఫీ గా మారిపోయే విధం గాను సాయపడుతాయి. వారికి వారి యొక్క జ్ఞానాన్ని, నైపుణ్యాల ను మరియు దక్షతల ను పెంపొందింప చేసుకోవడం కోసం igotkarmayogi.gov.in ప్లాట్ ఫార్మ్ లోని ఇతర కోర్సుల ను నేర్చుకొనేఅ వకాశాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది.
Working in mission mode to provide government jobs. pic.twitter.com/A7f6WGmQ08
— PMO India (@PMOIndia) November 22, 2022
Youth are the biggest strength of our country. pic.twitter.com/hb8rl5Nn7X
— PMO India (@PMOIndia) November 22, 2022
The 'Karmayogi Bharat' technology platform which has been launched, has several online courses. This will greatly help in upskilling. pic.twitter.com/KWSirYDxF8
— PMO India (@PMOIndia) November 22, 2022
Experts around the world are optimistic about India's growth trajectory. pic.twitter.com/Pe4h6gQin0
— PMO India (@PMOIndia) November 22, 2022
New opportunities are being created for the youth in India. pic.twitter.com/sZwRbhULJg
— PMO India (@PMOIndia) November 22, 2022